Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాత్రిళ్లు పడక గదిలో చేసేది పొద్దున్నే డైరీలో రాస్తాడు.. ఏం చేయాలి?

Webdunia
శుక్రవారం, 16 నవంబరు 2018 (15:26 IST)
మా ఆయనకు ఓ వింత అలవాటు ఉంది. రోజువారీ చేసే పనులు రాస్తోడో లేదో తెలియదుకానీ, రాత్రిపూట పడక గదిలో చేసేది మాత్రం క్రమం తప్పకుండా డైరీలో రాస్తుంటాడు. ముఖ్యంగా శారీరకంగా కలిసిన ప్రతిసారి.. బెడ్‌పై మేము చేసుకున్న ప్రతి పని, ప్రతి మాట తు.చ తప్పకుండా రాస్తాడు. అలా ఎందుకు చేస్తారో అర్థంకాదు. దీనివల్ల నేను చాలా ఇబ్బంది పడుతున్నా. ఏదైనా కొత్త ప్రయోగం చేద్దామని ప్రతిపాదిస్తే అది కూడా ఎలా వర్ణిస్తాడోనని భయం పట్టుకుంది. పైగా, ఇదే విషయంపై ఆయన్ను అడుగుదామనుకుంటే ఏమనుకుంటారో.. ఎలా స్పందిస్తారోనని అని జంకాల్సి వుంటుంది. ఆయన చర్య వల్ల పడకగది వాతావరణం పూర్తిగా చెడిపోతోంది. ఏమి చెయ్యాలో తోచడం లేదు. ఏదైనా సలహా ఇవ్వండి. 
 
కామ కోర్కెలు తగ్గిపోయి, అసంతృప్తి చెందడం వల్లే కొందరు పురుషులు ఇలాంటి పనులకు పాల్పడుతుంటారు. చేస్తున్న పనిమీదకాకుండా మరెక్కడో మనసు లగ్నం చేస్తారు. 'నేను ఎలా పాల్గొంటున్నాను.. అది ఆయన మెచ్చుకుంటారా? లేదా?' అని మీరు.. 'నేను ఆమెకు తగినట్టుగా చేస్తున్నానా? లేదా? నా ఫ్రెండ్స్, చేస్తున్న తీరులోనే నేను కూడా చేస్తున్నానా? లేదా?' అని ఆయన అలోచిస్తుంటే పడక గది జీవితం ఆనందంగా సాఫీగా సాగిపోతుంది. 
 
అసలు పడక గదిలో జరిగే విషయాలు డైరీలో రాసే అలవాటు ఎందుకు అలవడిందో ఓసారి తెలుసుకోండి. చాలా మంది మగాళ్లు అశ్లీల చిత్రాలు, అశ్లీల బొమ్మలు చూసి అందులోని విధంగా చెయ్యాలని అనుకుంటారు. ఆ విధంగా ఏమైనా చేస్తున్నారేమోనని గుర్తించండి. ఏది ఏమైనా ఇది మంచి అలవాటు ఏమాత్రం కాదు. ఆయన శృంగార సామర్థ్యం గురించి ఎప్పుడైనా మీతో మాట్లాడారా! లేదంటే మీరే మాట్లాడి చూడండి. అయినా లొంగకపోతే ఆ డైరీ గురించి పట్టించుకోనట్టుగా ఉండండి. కొన్నాళ్లు రాసి ఆయనే మారతాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇండోర్‌ అప్నా దళ్ సమావేశంలో రాజకీయ వ్యూహకర్త డాక్టర్ అతుల్ మాలిక్‌రామ్

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు: వేడి నుంచి ఉపశమనం.. కానీ రైతుల పంటలు.. ఎల్లో అలెర్ట్

కంచ భూముల వివాదం ... విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు ఆదేశం

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

తర్వాతి కథనం
Show comments