Webdunia - Bharat's app for daily news and videos

Install App

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

సెల్వి
శనివారం, 8 మార్చి 2025 (23:13 IST)
ఆధునిక యుగంలో స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా ప్రభావం అంతా ఇంతా కాదు. ఈ ఉపకరణాల కారణంగా మానవీయ సంబంధాలు బలపడుతున్నాయో లేదో కానీ.. భార్యాభర్తల సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. ముఖ్యంగా ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు కనుమరుగవుతున్నాయి. కుటుంబ వ్యవస్థ దెబ్బతింటోందనే చెప్పాలి. కుటుంబ సభ్యులతో కలిసి సమయాన్ని వెచ్చించే వారి సంఖ్య రోజు రోజుకీ తగ్గిపోతుంది. 
 
స్మార్ట్ ఫోన్లలో సంసారం చేసే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఫలితంగా అనుబంధాలు సన్నగిల్లిపోతున్నాయి. సంపాదన కోసం ఆరాటం.. ఆడంబరాలకు ప్రాధాన్యంతో మానవ సంబంధాలకు విలువ లేకుండా పోతున్నాయి. ఫలితం నేరాల సంఖ్య పెరగడం. హత్యలు పెరిగిపోవడం.. క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకోవడం జరిగిపోతున్నాయి. 
 
అలాగే వివాహేత సంబంధాలు పెరిగిపోవడానికి కారణాలు కూడా స్మార్ట్ ఫోన్లేనని.. సామాజిక మాధ్యమాలేనని మానసిక నిపుణులు అంటున్నారు. వివాహేతర సంబంధాల గురించి ఓపెన్‌గా మాట్లాడటం వద్దులేండి అంటూ చాలామంది మెల్లగా జారుకునే పరిస్థితి వుంది. 
 
అయితే అలాంటి వివాహేతర సంబంధాలు, అక్రమ సంబంధాలు పెరిగిపోయేందుకు ప్రధాన కారణాలేంటి? సీతారాములు వసించిన ఈ భూమిపై ఏకపత్నీ వ్రతులు తక్కువవడానికి కారణం ఏంటి అనేదానిపై చర్చిస్తే... ఆ అంశంపై ఎన్నెన్నో అంశాలను పరిశీలన చేయాల్సి వుంటుంది. 
lovely eyes
 
ఇక అసలు సంగతికి వస్తే.. వివాహేతర సంబంధాలకు గల కారణాలపై మానసిక నిపుణులు ఏమంటున్నారో.. అందుకు గల అంశాల గురించి ఓసారి పరిశీలిద్దాం.. ఈ టాపిక్ చాలా సెన్సిటివ్. అయితే దీనిపై అవగాహన అవసరమని మానసిక వైద్యులు చెప్తున్నారు.
 
అందుకే ఈ అంశంపై సైకలాజిస్టులు చెప్తున్న సంగతులు ఏంటనే దానిపై ఓ కన్నేద్దాం.. భార్యాభర్తల బంధంలో వివాహేతర సంబంధాలు ఏర్పడటానికి కారణాలు, ఆ సంబంధాల కారణంగా ఏర్పడే నేరాల గురించి కూడా తెలుసుకుందాం. అలాగే ఈ వివాహేతర సంబంధాలు ఏర్పడకుండా వుండాలంటే భార్యాభర్తల మధ్య సఖ్యత, ఒకరినొకరు అర్థంచేసుకోవడం వంటివి ఎంత ఆవశ్యకమో తెలుసుకుందాం. 
 
సమాజంలో ఆడామగా లింగం బేధం వున్నప్పుడు అన్నీ రంగాల్లో స్త్రీపురుషులు కలిసి పనిచేస్తుంటారు. అలాంటి పరిస్థితుల్లో కుటుంబ వ్యవస్థ కంటే బయట సమాజంలో వున్న వ్యక్తులతో పరిచయం వివాహేతర సంబంధాలకు దారితీస్తుంది. అవి ఎన్నో నేర చరిత్రలకు దారితీసేందుకు కారణం ఏంటంటే...? సాధారణంగా పురుషులు సంపాదన వైపు మొగ్గు చూపుతారు. మహిళలు అన్నీ రంగాల్లో రాణించినా.. ఇంటికే పరిమితమై.. భర్త బంగారంగా చూసుకున్నా.. సంపాదించినా.. తన భావోద్వేగాలను అర్థం చేసుకోలేకపోతున్నారనే ఆవేదన మహిళలు వివాహేతర సంబంధాలు నెరపేందుకు కారణం అవుతుందని.. అలాగే పురుషుడు కుటుంబంతో కంటే.. కార్యాలయాల్లో ఎక్కువ సమయం గడపడం ద్వారా అక్కడ తనకు నచ్చిన వ్యక్తితో పరిచయం కాస్త ప్రేమగా.. ఆపై అక్రమ సంబంధాలుగా మార్చేసుకుంటాడు. భార్యాభర్తలు తమ తమ భావాలను పంచుకునేందుకు, ఒకరిపై ఒకరు ప్రేమను వ్యక్తం చేసేందుకు కూడా ప్రస్తుతం బిజీ లైఫ్‌లో టైమ్ లేకపోవడం ఇందుకు ప్రధాన కారణమని సైకలాజిస్టులు అంటున్నారు. 
couple
 
స్త్రీపురుషుల భావోద్వేగ అసమతుల్యతను వేరే వ్యక్తులు ఉపయోగించుకోవడమే వివాహేతర సంబంధాలకు కారణమని చెప్తున్నారు. ఈ సంబంధాలు పెరగకుండా వుండాలంటే.. భార్యతో భర్త ఎక్కువ సమయం గడపాలి. వారి భావోద్వేగాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. మహిళలకు మూడ్ స్వింగ్ ఎక్కువగా వుంటాయి. అలాగే 40 ఏళ్లు దాటిన మహిళల్లో మెనోపాజ్ దశలో ఈ మూడ్ స్వింగ్ తప్పనిసరి. 
 
ఆ మూడ్ స్వింగ్స్‌ను ఓ పురుషుడు ఎలా హ్యాండిల్ చేస్తాడో దానిని బట్టి దంపతుల మధ్య అన్యోన్యతను అంచనా వేయవచ్చు. దీనిని పురుషులు అర్థం చేసుకుంటే ఎలాంటి సమస్యే లేనట్టే. ఈ దశలో మహిళలకు అంటే భార్యకు తాను అన్నీ చేస్తున్నాను.. ఇంకా ఏం చేయాలి అని పురుషుడు భావించకూడదు. మహిళల మానసిక పరిస్థితిని బట్టి వారితో మాట్లాడటం.. వారి ఉద్వేగం, మానసిక ఆవేదనకు ప్రాధాన్యత ఇవ్వడం చేయాలి. 
 
మహిళలకు భావోద్వేగ బంధం చాలా అవసరం. పురుషుడు స్క్వేర్ మైండ్. మహిళలు సర్కిల్ మైండ్. సాధారణంగా పురుషులు స్క్వేర్ మైండ్ ప్రభావంతో ఓ గొడవ జరిగినప్పుడు ఆ సమస్యను స్క్వేర్ ఎడ్జ్‌లు ఎండ్ అయ్యేట్టు అలానే ముగించేయడం చేస్తుంటారు. దానిని పెద్దగా పట్టించుకోరు. కానీ మహిళలు అలా కాదు. సర్కిల్ తరహాలో సమస్యలను తిరిగి తిరిగి ఆలోచించడం చేస్తుంటారు. వారికి లాజికల్‌గా కాకుండా ఎమోషనల్ ఎక్లనిజేషన్ అవసరం. దీనికి భర్త ఆమెను ఎమోషనల్‌గా కవర్ చేయాలి అంటున్నారు.. మానసిక వైద్యులు. ఎమోషనల్ ఫుల్ ఫిల్ మెంట్ అనేది మహిళలు ఆశిస్తారు.
 
అందుచేత పురుషులు మహిళలతో భావోద్వేగాలకు ప్రాధాన్యత ఇస్తూ.. భార్యను గుండెల్లో పెట్టుకుని వున్నాననే విషయాన్ని గుర్తు చేసుకుంటూ వుండాలి. అలాగే మాట్లాడే తీరును మార్చుకోవాలి. భార్య తప్పు చేసినా.. ఆమె మాట్లాడే తీరులో తప్పులున్నా.. దానిని సరిదిద్దే ప్రయత్నం చేయాలి.
 
అధికారం చెలాయించడం చేయకూడదు. అలాగే పురుషుల తరహాలో మహిళలు కూడా తమ వ్యక్తిత్వ వికాసానికి ప్రాధాన్యత ఇవ్వాలి. గత విషయాలనే చెప్పడం.. దాని గురించే మాట్లాడటం మానుకోవాలి. ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకుని మాట్లాడటం చేయాలి. లాజికల్‌గా ఆలోచించాలి. 
 
భావోద్వేగ ఆలోచనలకే ప్రాధాన్యం ఇవ్వకూడదు. భావాలను పంచుకోవాలి. అయితే అది జగడానికి కారణం కాకుండా మాట్లాడటం చేస్తే భార్యాభర్తల మధ్య విబేధాలు ఏర్పడవు. ఇందుకోసం సేట్మెంట్ కమ్యూనికేషన్ విధానాన్ని ఎంచుకోవాలి. అంటే గట్టిగా అరవడం.. భాగస్వామ్యులతో వాదనలకు దిగకుండా.. చెప్పదలుచుకున్న విషయాన్ని... భాగస్వామికి అర్థం అయ్యేలా చెప్పడం. చర్చలా ఈ విషయం జరగాలి. 
 
భార్యాభర్తల మధ్య కమ్యూకేషన్ సన్నగిల్లితే.. మూడో వ్యక్తి ఎంట్రీ ఇవ్వడం.. ఆ థర్డ్ పర్సన్ ద్వారా భార్యాభర్తల మధ్య సంబంధాలు సన్నగిల్లడం.. ఇంకా వివాహేతర సంబంధాలకు దారితీస్తుంది. భార్యాభర్తలు మనసు విప్పి మాట్లాడటం, ఏ విషయాన్ని దాచకుండా వుండటం, అలాగే మహిళలు కుటుంబ బాధ్యతలు, ఇంటి బాధ్యతలు, పిల్లల పట్ల శ్రద్ధ చూపడం చేస్తూనే.. భర్తతో కాలం గడపటం.. వారిని కేర్ చేస్తూ వుండాలి. ఇంట్లోని కమిట్మెంట్లు, పిల్లలు కలిగిన తర్వాత భర్తను పక్కనబెట్టేయడం కూడదు. ఇలా చేస్తే భార్య నుంచి పొందని ప్రేమ కోసం బయట వ్యక్తుల వద్ద పురుషులు ఆశించడం చేస్తే.. వివాహేతర సంబంధం ఏర్పడే అవకాశం లేకపోలేదు. 
 
జీవితం బోరింగ్ లేకుండా చూసుకోవడం కూడా ఈ వ్యవహారంలో చాలా ముఖ్యం. భార్యాభర్తలు వారానికి ఒక్కసారైనా ఏకాంతంగా గడపడం, మాట్లాడుకోవడం, డేట్‌కు వెళ్లడం చేస్తుండాలి. పురుషులు ఆదాయం కోసం పరుగులు తీస్తున్న ఈ కాలంలో ఆఫీసును వచ్చిన వెంటనే.. ఈ రోజు ఎలా సాగింది అని అడిగే భార్య వుంటే మంచిదని ఆశిస్తారు. చిన్నచిన్న విషయాలను గుర్తించి వారిని అడగాలని.. వారిని పట్టించుకోవాలని ఆశిస్తారు. 
couple
 
ఇవన్నీ కనుక భార్య చేయని పక్షంలో.. ఆ ప్రేమ కోసం వేరు మార్గాన్ని ఎంచుకోవడం సాధారణమైపోతుంది. దీంతో సామాజిక మాధ్యమాల ద్వారా ఏర్పడే పరిచయాలు అక్రమ సంబంధాలకు దారిస్తాయని చెప్తున్నారు.. మానసిక వైద్యులు. పురుషులు-స్త్రీలకు సమానత్వం వున్న ఈ ఆధునిక యుగంలో అన్నీ విషయాలను అర్థం చేసుకునే భావ వికాసంలో వున్న ఈ కాలంలో సంబంధాలకు విలువ ఇవ్వాలని అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

స్టిక్ ఐస్ క్రీంలో చనిపోయిన పాము.. ఎంత పెద్ద కళ్ళు..?: ఫోటో వైరల్

తెలంగాణ సింగానికి అదిరిపోయే వీడ్కోలు పలికిన సహచరులు!! (Video)

వలపు వల పేరుతో 36 మందిని బురిడీ కొట్టించిన కిలేడీ!

జడ్జి వద్ద విలపించిన పోసాని... తప్పుడు కేసులతో రాష్ట్రమంతా తిప్పుతున్నారు...

కాంగ్రెస్ పార్టీలో వుంటూ బీజేపీకి పనిచేస్తారా? తాట తీస్తాం.. వారు ఆసియా సింహాలు: రాహుల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రూబా లో సరికొత్త ప్రేమ కథను చూస్తారు - దర్శకుడు విశ్వ కరుణ్

Vijayashanti: కళ్యాణ్ రామ్, విజయశాంతి మూవీ టైటిల్ అర్జున్ S/O వైజయంతి

Rukshar Dhillon: హాపీ ఉమన్స్ డే గా నటి రుక్సార్ ధిల్లాన్ ఘాటు విమర్శలు

దర్శకులు మెచ్చుకున్న 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో చిత్రం.. ఫుల్ ఫన్ రైడ్

సమాజంలో మార్పుకే కీప్ ది ఫైర్ అలైవ్ ఫిల్మ్ తీసాం : చిత్ర యూనిట్

తర్వాతి కథనం
Show comments