Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎవరి ప్రత్యేకత వారిదే.. నిరాశ చెందకండి!

Webdunia
సోమవారం, 18 ఆగస్టు 2014 (16:25 IST)
ఈ ప్రపంచంలో ఎవరి ప్రత్యేకత వారిదేనని మీరు గుర్తించాలి. ఒకరికి ఓ రంగంలో ప్రతిభ ఉంటే మీకు మరో రంగంలో ఉంటుంది. అందుకని వాళ్లు ఫలానా పని బాగా చేస్తారు కానీ నాకు రాదని నిరాశ చెందకండి. ప్రయత్నిస్తే మీరూ చేయగలరు. మిమ్మల్ని వెనక్కి నెట్టే ఇలాంటి విషయాలలో మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి చాలు విజయం మీదే అవుతుంది.
 
ముందుగా మిమ్మల్ని వెనక్కి నెట్టే అంశాలను విడిగా ఓ పేపర్‌పై రాసుకోండి. ఏ విషయంలో మీరు బలహీనులవుతున్నారని గుర్తించండి. మీకంటే అవతలి వారు దేనిలో ప్రత్యేకంగా ఉన్నారో గమనించండి. వాటిని క్రమబద్ధంగా రాసుకుని వాటిలో మీ వద్ద ఏవి లేవో తెలుసుకోండి. తర్వాత వాటిని ఎలా జయించాలో ఆలోచించండి. పట్టుదల వదలకుండా ప్రయత్నించి చూడండి.
 
అలాగే మీ బలహీనతల్ని చూసి వెక్కిరించే వారిని పట్టించుకోవద్దు. మిమ్మల్ని మీరు ఉన్నత స్థానంలో నిలుపుకోండి. ఈ చర్యలు చేపడితే మీరు విజేతగా నిలిచేందుకు మార్గం సులభమైనట్టే. ప్రతి ఒక్కరిలో ఏదో ఓ రంగంలో ప్రతిభ ఉంటుందని మనం తెలుసుకోవాలి. అయితే ఆ రంగాలలో మన ప్రతిభను మెరుగు పరుచుకునేందుకు కృషి చేయండి. చక్కని ఫలితాలను పొందుతారు. 
 
తోటి వారిని మాటలతో బాధపెట్టకండి. చక్కని మాటతీరుతో, స్నేహ భావంతో మెలగండి. మీ వద్ద ఉన్న లోపాలు దూరంగా వెళ్లిపోతాయి. అందరూ మీ చుట్టూ చేరాలని మీ మనసులో ఉందా? అది నెరవేరాలంటే మీ పనిలో శ్రద్ధపెట్టి ఏకాగ్రతతో పనిచేయండి. మీ ప్రవర్తనను ఎప్పటికప్పుడు చూసుకోండి. తద్వారా అందరూ మీ చుట్టూ చేరతారు.  

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments