Webdunia - Bharat's app for daily news and videos

Install App

బావతో అక్క సంసారం చేస్తూనే ప్రియుడితో పలుకుతోంది.. ఏం చేయాలి?

Webdunia
గురువారం, 15 నవంబరు 2018 (15:49 IST)
మేము హైదరాబాద్‌లో ఉంటున్నాం. మా అక్కకు రెండేళ్ళ క్రితం పెళ్లిచేశాం. ఆమెకు ఓ పాప కూడా ఉంది. నిజానికి ఆమె పెళ్లికి ముందే ఓ వ్యక్తిని ప్రేమించింది. ఈ విషయం ఇంట్లో తెలిసి పెద్ద గొడవ జరిగింది. ఆ తర్వాత ఆమెను బలవంతంగా ఒప్పించి మరో వ్యక్తితో పెళ్లి చేశాం. 
 
కానీ, పెళ్లయ్యాక కాకపోయినా పాప పుట్టిన తర్వాత అయినా మారుతుందని ఎదురు చూశాం. కానీ, ఆమె ప్రవర్తనలో మార్పులేదు. ఒకవైపు బావతో పలుకుతూనే మరోవైపు ప్రియుడితోనూ దొంగచాటుగా కలుస్తోంది. ఈ విషయం బావకు తెలిసి.. మందలించాడు కూడా అయినా మార్పురాలేదు. ఏం చేయాలో తెలియడం లేదు. ఆమె కాపురం ఎపుడు కూలిపోతుందోనన్న భయం వెంటాడుతోంది. ఏం చేయాలి. 
 
ఇక్కడ తప్పు చేస్తున్నది మీ అక్క కాదు. మీరు. ఆమె మనసులో ఏముందో తెలుసుకోకుండా బలవంతంగా ఒప్పించి పెళ్లి చేశారు. పెళ్లి చేశాక అయినా ఆమె అత్తారింట్లో సరిగ్గా ఉందో లేదో తెలుసుకోలేదు. పైపెచ్చు... భర్తతో ఏమైన సమస్యలు ఉన్నాయో లేదో తెలుసుకునే ప్రయత్నమే చేయలేదు. ఇక్కడ కావాలిసింది కోపం, దండన కాదు. కన్నవారికోసం ఒకసారి ప్రేమను వదులుకున్న ఆమె.. ఇపుడు పుట్టిన బిడ్డ కోసం సర్దుకోమని చెబితే ఖచ్చితంగా తనను మార్చుకునే అవకాశం లేకపోలేదు. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా, కాస్త ఓర్పుతో ఆమెతో మాట్లాడటమే. ఇదే అన్ని సమస్యలకు పరిష్కార మార్గం చూపిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

హైదరాబాద్‌లో మెట్రో చార్జీల బాదుడే బాదుడు...

నీకెంత ధైర్యం.. నా బస్సునే ఓవర్‌టేక్ చేస్తావా.. కండక్టరుపై వైకాపా మాజీ ఎమ్మెల్యే దాడి!!

ఇంటి ముందు చెత్త వేయుద్దన్నందుకు మహిళ తల నరికేశాడు

తమిళనాడు జీడీపీ కంటే పాకిస్థాన్ జీడీపీ తక్కువా? నెటిజన్ల సెటైర్లు!!

కాశ్మీర్ త్రాల్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం, ఒకడు పహెల్గాం దాడిలో పాల్గొన్నాడు?!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత ఆ దర్శకుడుతో ప్రేమలో ఉందా? హీరోయిన్ మేనేజరు ఏమంటున్నారు?

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

తర్వాతి కథనం
Show comments