Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుదిరితే పరిగెత్తు... లేకపోతే నడువు... అదీ చేతకాకపోతే పాకుతూ పో...

Webdunia
సోమవారం, 21 మార్చి 2016 (15:16 IST)
కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడువు అదీ చేతకాకపోతే పాకుతూ పో, అంతేకానీ ఒకేచోట అలా కదలకుండా ఉండిపోకు. ఉద్యోగం రాలేదని, వ్యాపారం దెబ్బ తినిందని, స్నేహితుడొకడు మోసం చేశాడని, ప్రేమించిన వాళ్ళు వదిలి వెళ్ళి పోయారని అలాగే ఉండిపోతే ఎలా? దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగిసిఎగిసి పడుతుంటే...
 
తలచుకుంటే నీ తలరాత ఇంతే అన్నవాళ్ళు కూడా నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా నీది, అలాంటిది ఇప్పుడొచ్చిన ఆ కాస్త కష్టానికే తలొంచేస్తే ఎలా?
 
పారే నది..... వీచే గాలి.... ఊగే చెట్టు.... ఉదయించే సూర్యుడు.... అనుకున్నది సాధించాలని నీలో కసికసిగా ప్రవహిస్తుందే ఆ నెత్తురుతో సహా, ఏదీ ఏది ఆగిపోడానికి వీల్లేదు.. లే బయలుదేరు, నిన్ను కదలనివ్వకుండా చేసిన ఆ మానసిక భాదల సంకెళ్ళను తెంచేసుకో, పడ్డ చోటు నుండే పరుగు మొదలుపెట్టు.
 
నువ్వు పడుకునే పరుపు నిన్ను చీదరించుకోకముందే బద్దకాన్ని వదిలేయ్, నీ అద్దం నిన్ను ప్రశ్నించకముందే సమాధానం వెతుక్కో, నీ నీడ నిన్ను వదిలేయకముందే వెలుగులోకి వచ్చేయ్.., మళ్ళీ చెప్తున్నా కన్నీళ్ళు కారిస్తే కాదు... చెమట చుక్కని చిందిస్తేనే చరిత్రను రాయగలవని తెలుసుకో..
 
** చదివితే ఇవి పదాలు మాత్రమే, ఆచరిస్తే అర్జునుడి గాండీవం నుండి దూసుకుని వచ్చే అస్త్రాలు **
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Vizag Beach Road: జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం.. వైజాగ్ ముస్తాబు

జగన్ తీరు అలీబాబా 40 దొంగల మాదిరిగా ఉంది : ఫోన్ ట్యాపింగ్‌పై వైఎస్ షర్మిల

నా దారి రహదారి అని ఏపీ పోలీసులకు తెలియదనుకుంటా: హెల్మెట్ లేకుండా యువతి వీడియో తీస్తూ డ్రైవింగ్ (video)

FASTag: ఫాస్ట్‌ట్యాగ్ వార్షిక టోల్ పాస్‌లు.. పవన్ కల్యాణ్ స్పందన ఏంటి?

కొండా సురేఖకు కేటాయించిన శాఖలో పైసలు రావు .. ఖర్చులకు నేనే ఇస్తా : కొండా మురళి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

విష్ణు మంచు కన్నప్ప నుంచి అవ్రామ్ మంచు మేకింగ్ వీడియో

అనంత పద్మనాభ స్వామి టెంపుల్ సెట్‌లో విరాట్ కర్ణ చిత్రం నాగబంధం

సుహాస్ , కీర్తి సురేష్ నటించిన ఉప్పు కప్పురంబు ట్రెయిలర్ లాంచ్

Show comments