స్నేహితులు, దంపతులు కొట్లాడుకుంటున్నారా? ఒక్క నిమిషం ఆగండి!

Webdunia
శనివారం, 18 అక్టోబరు 2014 (16:48 IST)
స్నేహితులు, దంపతులు కొట్లాడుకుంటున్నారా? ఒక్క నిమిషం ఆగండి!.. ఆవేశంలో మాట అనేస్తే ఆ తర్వాత వెనక్కి తీసుకోలేమని మానసిక నిపుణులు అంటున్నారు. స్నేహితులు, దంపతుల మధ్య కొట్లాటలు సహజం. అయితే ఆ గొడవ తీవ్రరూపం దాల్చకుండా ఉండాలంటే కొన్ని అంశాలను గుర్తించుకోవాలి. ఆవేశంలో మాటలు రానీయకూడదు. 
 
మాటకు విలువ ఇవ్వండి. కోపంలో అయినా సరే మాటలు అదుపులో పెట్టుకోండి. నీ నుంచి విడిపోవాలనుకుంటున్నాననో, లేక.. విడాకులు తీసుకోవాలనుకుంటున్నాననో అన్న తర్వాత మీరు ఎన్నిసార్లు క్షమాపణలు చెప్పినా ఫలితం ఉండదు. ఒకవేళ పొరబాటున ఆవేశంలో అనేస్తే, వెంటనే క్షమాపణ కోరడం మంచిది. మరోసారి అలా జరగదని భాగస్వామికి సంజాయిషీ ఇవ్వాలి. అలా మీ స్నేహం లేదా వివాహ బంధంపై నమ్మకం కలిగించాలి. 
 
కొన్ని సందర్భాల్లో మౌనం వహించండి. ఎదుటివారి ఆవేశం తగ్గాక నెమ్మదిగా మాట్లాడటం చేయాలి. ఎవరిపై తప్పుందో ఆత్మపరిశీలన చేసుకుని, ఇద్దరూ లోటుపాట్లు చర్చించుకోవడం ఎంతో మంచిదని మానసిక నిపుణులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

షాకింగ్‌రా బంటి, ఇండిగో-ఎయిర్ ఇండియా విమానాలు ఢీకొన్నాయ్, ఎలాగంటే?

అసలు ధరలకే మద్యం అమ్మాలి.. ఎమ్మార్పీ కంటే ఎక్కువ వసూలు చేయొద్దు.. పవన్ కల్యాణ్

Pawan Kalyan: వరంగల్‌లోని భద్రకాళి ఆలయాన్ని సందర్శించిన అన్నా లెజ్‌నోవా

చంద్రబాబుకు మంచి బుద్ధి ఇవ్వాలని పూజలు చేసేందుకు వెళితే కేసులు పెట్టారు : విడదల రజనీ

మైనర్‌పై అత్యాచారం.. ఆపై బ్లాక్ మెయిల్.. నిందితుడుకి దేహశుద్ధి చేసిన లాయర్లు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆనంద్ దేవరకొండ చీకటి లోకంలో దేనికోసం నీ వెతుకులాటా?

Sharwanand: బైకర్ ఇంజన్ సిద్దమైంది. రేపు గ్లింప్స్ రాబోతోంది

Raviteja: సుమతీ శతకం ట్రైలర్ బాగా నచ్చింది, చిత్రం విజయవంత కావాలి: రవితేజ

పళ్లిచట్టంబి నుంచి కయదు లోహర్ ఫస్ట్ లుక్ విడుదల

కుమార్తె సుస్మితతో చిరంజీవిని కలిసిన కొండా సురేఖ.. హనుమంతుడి చిత్రం గిఫ్ట్

Show comments