కోపంతో అందం చెడిపోతుంది.. వృద్ధాప్య ఛాయలు తప్పవ్..

Webdunia
సోమవారం, 22 జూన్ 2015 (17:26 IST)
కోపంతో అందం చెడిపోతుంది.. వృద్ధాప్య ఛాయలు తప్పవు అంటున్నారు మానసిక నిపుణులు. సంతోషంగా ఉండటం.. ఇతరుల సాయాన్ని అర్ధించకుండా సమయపాలనతో ముందుకు దూసుకెళ్లడం ద్వారానే కోపాన్ని నియంత్రించుకోవచ్చు. సమయపాలన లేని పక్షంలో అనవసరంగా టెన్షన్‌కు గురికావడం.. తద్వారా లేనిపోని ఆరోగ్య సమస్యలే కాకుండా.. అతి పిన్న వయస్సులోనే వృద్ధాప్య ఛాయలు అలముకుంటాయని మానసిక నిపుణులు అంటున్నారు. 
 
ఆర్థిక ఇబ్బందులు ఇతరత్రా ఇబ్బందుల్ని ఎదుర్కొనే విధంగా తమను తాము సిద్ధం చేసుకుంటే సమస్యల్ని సునాయాసంగా పరిష్కరించుకోవచ్చు. అలాగే సమస్యల పరిష్కారాలపై పదే పదే ఆలోచించకూడదు. ఏది చేయాలనే దానిపై క్లారిటీ కావాలంటే నిర్ణయం తీసుకునే విషయంలో ఖరాఖండిగా ఉండాలి. 
 
నిర్ణయాలను అమలు చేయడంలోనూ రాజీపడకూడదు. సమయాన్ని కేటాయించుకుని పనుల్ని చేసుకోవాలి.. ఇలా షెడ్యూల్ ప్రకారం ముందుకు కదిలితే టెన్షన్ తగ్గుతుందని.. తద్వారా కోపంతో అధికంగా ఖర్చయ్యే సెల్స్ పనితీరు తగ్గి వృద్ధాప్య ఛాయలను తగ్గించుకోవచ్చునని మానసిక నిపుణులు అంటున్నారు.

కోపాన్ని నిగ్రహించుకోవడం.. నమ్మకంగా వుండేవారితో సమస్యలను పరిష్కరించుకోవడం.. ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అందాన్ని మెరుగుపరుచుకోవచ్చునని వారు సూచిస్తున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రేమ పేరుతో కుచ్చుటోపీ.. రూ.81లక్షలు కోల్పోయిన యువకుడు..

తెలంగాణ రైతులను ముంచేసిన అకాల వర్షాలు (video)

ఏపీలోనే కాదు.. దక్షిణాదిలో మధ్యప్రదేశ్‌ దొంగలతో జాగ్రత్త.. ముగ్గురి అరెస్ట్

బలమైన గాలులు, ఉరుములతో కూడిన వర్షాలు.. పిడుగుపాటుకు మహిళలు మృతి

ఇరాన్‌లో అంతర్గత విభేదాలు, అమెరికాతో మాట్లాడేవాళ్లెవరో చూస్తున్నా: ట్రంప్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Pallavi: హిందీతో సాయిపల్లవికి ఇబ్బందులు.. ట్రోల్స్ మొదలు

NTR, Charan: భారతీయ బాక్సాఫీస్‌ను ఏలడానికి రామ్ చరణ్, ఎన్.టి.ఆర్ మరోసారి కలుస్తున్నారా?

Anil Ravipudi: వెంకటేష్, కళ్యాణ్ రామ్ సినిమానుంచి అనిల్ రావిపూడి తప్పుకున్నాడా?

Mahesh Babu: పోకిరి లా 100 రోజుల చిత్రాలు ఇప్పుడు టాలీవుడ్ లో ఎందుకు రాలేకపోతున్నాయి?

Spirit: గొర్రెలు కాచుకునే మహిళ నిర్మించిన సినిమా స్పిరిట్ సిద్ధమవుతోంది

Show comments