డబ్బుంటే కాదు.. రాత్రికి రాత్రే విజయం సాధ్యం కాదు!

Webdunia
గురువారం, 8 జనవరి 2015 (16:55 IST)
ఒకేసారి పని పూర్తి చేయడం, రాత్రికి రాత్రి విజయం సాధించడం సాధ్యం కాదు. ఏదైనా చిన్నగా మొదలుపెట్టాలి. లక్ష్యానికి సంబంధించి రోజూ కొంత చొప్పున పని చేసుకోవాలి. అప్పుడే సరైన దిశలో వెళ్తున్నామా లేదా అన్న దానిపై అవగాహన వస్తుంది. అలాగే విజయ సాధనకు చాలా ముఖ్యమైంది... ప్రతికూల ఆలోచనలు లేకపోవడం, సందేహాలు, భయాలు, ఒత్తిడి, ఆందోళన లాంటివి పెరిగిపోతే మీరు మీ కలలు నెరవేర్చుకోలేకపోతారు. అందుకే సాధ్యమైనంతవరకు సానుకూల అంశాలకే ప్రాధాన్యం ఇవ్వండి. 
 
బాగా డబ్బుంటే విజయం వచ్చేస్తుందంటారు. ఇది నిజం కాదు. ఎవరైనా సరే కష్టపడాల్సిందే. అందుకే ఓసారి విజయం సాధించినవారితో మాట్లాడి చూడండి. వాళ్లెంత శ్రమపడ్డారో, ఎన్ని త్యాగాలు చేశారో, ఎలాంటి వైఫల్యాలు ఎదుర్కొన్నారో వివరిస్తారు. సాధించాలనుకున్న లక్ష్యానికి సంబంధించి మీకు అన్నీ తెలుసు అనుకుంటే మీరు దానిపై శ్రద్ధ పెట్టడం లేదని అర్థం. నిత్యం మారిపోయే పరిస్థితులూ, వ్యక్తులూ, సవాళ్లనూ దృష్టిలో పెట్టుకుని నేర్చుకుంటూ ముందుకు సాగాలి. దీనికోసం కొత్త నైపుణ్యాల్లో శిక్షణ తీసుకోండి. పుస్తకాలు చదవండి. డాక్యుమెంటరీలను చూడండి. అధ్యయనం చేయండి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

భార్యతో ప్రాణ స్నేహితుడి అఫైర్.. ఇంటికి భోజనానికి పిలిచి కాల్చిపారేశాడు..

ఎవరైనా హైదరాబాద్‌పై ఒక్క బాంబు వేస్తే అంతా మటాష్: కూనంనేని

శత్రుత్వం లేని నౌకలకు హోర్ముజ్ గుండా ప్రయాణానికి అనుమతి.. ఇరాన్

Andhra Pradesh: ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. ఉరుములు, ఈదురుగాలులతో..

పాములా పాకుడు.. నాగ దోషాలు తొలగిస్తాడు.. మార్కెట్లోకి కొత్త బాబా (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: బ్యాండ్ ఆర్టిస్ట్ కి గౌరవం తెచ్చేలా దేత్తడి ఉంటుంది : దిల్ రాజు

Sanjay Dutt: సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ భేటీ

'పంజుర్లి' హావభావాలు ప్రదర్శించి చిక్కుల్లో పడిన 'ధురంధర్' హీరో

Hrithik Roshan: ప్రాజెక్ట్ హెయిల్ మేరీ కోసం హృతిక్ రోషన్, ర్యాన్ గాస్లింగ్ ప్రత్యేక సంభాషణ

Anandhi: గరివిడి లక్ష్మి లో కోసింది కొయగూర సాంగ్ లో ఆకట్టుకున్న ఆనంది

Show comments