మా ప్రేమకు గుర్తుగా ఓసారి శారీరకంగా కలుద్దామంటున్నారు.. ఏం చెప్పను?

Webdunia
సోమవారం, 4 ఆగస్టు 2014 (17:39 IST)
నేను ఓ ప్రైవేట్ కంపెనీలో హెచ్ఆర్ విభాగంలో ఎగ్జిక్యూటివ్ విభాగంలో పని చేస్తున్నా. నా బాస్ చాలా అందంగా ఉంటాడు. దీంతో అతనిపట్ల ఆకర్షణ ఏర్పడటం అది ప్రేమగా మారింది. అతనికి కూడా నేనంటే అమిత ఇష్టం. అప్పటి నుంచి మేమిద్దరం ప్రేమికులుగా కలిసిమెలిసి తిరుగుతున్నాం. అయితే, నాకు ఇంకా వివాహం కాలేదు. మా బాస్‌కు అయింది. అయితే పిల్లలు లేరు. అలా రెండేళ్లు గడిచిన తర్వాత ఓసారి నన్ను పెళ్లి చేసుకుంటాననే ప్రతిపాదన తెచ్చాడు. వెంటనే నీ భార్యకు విడాకులు ఇవ్వమన్నా. అందుకు ఆయన సమ్మతించలేదు. రెండో భార్యగా ఉండమంటున్నాడు. నాకది ఇష్టం లేదు. కానీ నీవులేనిదే నేను జీవించలేనంటూ నాపై అలిగాడు. చివరకు నేనే బ్రతిమలాడి.. ఓ మంచి ప్రేమికులుగా విడిపోదామని సలహా ఇచ్చా. అయితే, మన ప్రేమకు గుర్తుగా ఓ రాత్రి శారీరకంగా కలిసివుందామని అభ్యర్థిస్తున్నాడు. ఏం చేయాలి. సలహా ఇవ్వండి?  
 
ఖచ్చితంగా మీ శారీరక సుఖాన్ని పొందాలన్న ధ్యాస, తపన మినహా.. మీ బాస్‌లో మరొకటి కనిపించడం లేదు. అతనిది నిజమైన ప్రేమ కాదు. మీ మీద వ్యామోహం మాత్రమే. ఆఫీసులో బాస్‌గా ఉంటూ చేదోడువాదోడుగా ఉంటున్నాడన్న సాఫ్ట్ కార్నర్‌ వల్లే మీరు అతనిపట్ల ఆకర్షితులయ్యారు. అంతేకానీ, ఇది మీ ఇద్దరి మధ్య ఉండే నిజమైన ప్రేమ కాదు. మొదటి భార్యకు విడాకులు ఇవ్వని వాడు మిమ్మలను మరో పెళ్లి ఎలా చేసుకుంటాడు.. రెండో భార్యగా ఎలా ఉంచుకుంటాడు. ఇక్కడ మీరిద్దరిదీ శారీరక ఆకర్షణ మాత్రమే. మీకు ఇంకా వివాహం కాలేదంటున్నారు. అందువల్ల మీరు అతనికి దూరంగా ఉండటం ఎంతో ఉత్తమం. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఢిల్లీ టు భోగాపురం : గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయిన తొలి ఫ్లైట్

అదిరిపోయే ఫీచర్లతో వందే భారత్ స్లీపర్ రైలు

కర్నాటకలో దారుణం : 13 యేళ్ల బాలికపై మైనర్ల గ్యాంగ్ రేప్

వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్స్‌

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను లేపేసిన భార్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nandini Reddy: మహిళలకు భద్రత లేదనిపిస్తోంది.. మహిళల దుస్తులపై నందినిరెడ్డి కామెంట్లు

Ghantasala Review: అందరూ చూడతగ్గ ఘంటసాల బయోపిక్ చిత్రం- ఘంటసాల రివ్యూ

Sumanth Prabhas : సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ జంటగా గోదారి గట్టుపైన

Chirag Jani: ద్రౌప‌ది 2 లో మహమ్మద్‌బీన్ తుగ్ల‌క్ పాత్ర‌లో చిరాగ్ జానీ

Raviteja: ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి లతో రవితేజ వామ్మో వాయ్యో సాంగ్

Show comments