పోర్నోగ్రఫీకి బానిసనయ్యా.. చూడకూడదు అనుకుంటూనే చూస్తున్నా.. బయటపడటమెలా?

Webdunia
శనివారం, 12 డిశెంబరు 2015 (19:02 IST)
నా వయస్సు 24 యేళ్లు. నేను కొన్ని రోజుల క్రితం ఇంటర్నెట్ సెంటర్‌కెళ్లి.. అశ్లీల చిత్రాలను చూశాను. అప్పటినుంచి తరచుగా చూడటం అలవాటైంది. రేపటి నుంచి చూడకూడదు అనుకుంటాను. కానీ మరుసటిరోజు ఉదయం నిద్రలేవగానే మనస్సు ఆ వైపు లాగేస్తోంది. ఒక్కో రోజు పగలంతా అలానే చూస్తుండిపోతున్నా... ఈ అలవాటు నుంచి బయటపడటం ఎలా?
 
సాధారణంగా యుక్త వయస్సులో ఉండే యువకుల్లో అశ్లీల చిత్రాలు చూడాలన్న కుతూహలం ఎక్కువగా ఉంటుంది. అవకాశం దొరికినప్పుడు పోర్నోగ్రఫీ చూస్తుంటారు. అయితే, దానికోసమే వెంపర్లాడటం వేరు. ఇది కాస్త మోతాదుకు మించిన ప్రవర్తనే. ఇంటి ఆర్థిక పరిస్థితి బాగున్నప్పటికీ మీ కాళ్ల మీద మీరు నిలబడటం అవసరం. స్వతంత్ర జీవనం కోసం, మంచి జీవితం కోసం అది తప్పనిసరి. 
 
జీవితంలో పైకిరావాలన్న లక్ష్యంతో ముందుకుసాగినట్టయితే ఈ తరహా వ్యసనం నుంచి బయటపడగలం. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగం గానీ, ఉపాధిగానీ దొరికినట్టయితే పోర్నోగ్రఫీ అలవాటు దానంతట అదే తగ్గిపోతుంది. కానీ రోజుకు ఆరేడు గంటలు పోర్నో చూడటం అనేది మీ సమయాన్ని వృథా చేయడమేగాక... కొన్ని మానసిక, శారీరక సమస్యలూ రావొచ్చు. అప్పటికీ ఈ వ్యసనం నుంచి బయటపడలేకుంటే కౌన్సెలింగ్ తీసుకోండి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఎర్రచందనం స్మగ్లర్లకు సమాచారం ఇచ్చాడు- డబ్బు సంపాదించాడు.. కానిస్టేబుల్ అరెస్ట్

Coldwave : సంక్రాంతి పండుగ.. తెలంగాణలో చలి తీవ్రత ఎలా వుంటుంది?

ఐపీఎస్ అధికారిణిపై వేధింపులు.. కుమారుడు పోయాక సగం చనిపోయా.. మంత్రి కోమటిరెడ్డి

అన్ని దేశాలు కలిసి అమెరికాను తంతాయేమో? ట్రంప్ చేష్టలతో విసిగిపోతున్న ఫ్రెండ్స్

తెలంగాణ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయనున్న జనసేన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mardaani 3: రాణి ముఖర్జీ నటిస్తున్న మర్దానీ 3 విడుదల తేదీ ప్రకటన

Samyuktha: బయోపిక్స్, కామెడీ క్యారెక్టర్స్ వంటి అన్ని రకాల పాత్రలంటే ఇష్టం : సంయుక్త

Maheshbabu: మహేష్ బాబు లాంచ్ చేసిన శ్రీనివాస మంగాపురం లోని జయ కృష్ణ ఫస్ట్ లుక్

Aishwarya Rajesh: ఓ..! సుకుమారి నుంచి దామినిగా ఐశ్వర్య రాజేష్ లుక్

AniL Ravipudi: సంక్రాంతి ముద్ర పడటం కూడా మంచిది కాదు : అనిల్ రావిపూడి

Show comments