ఒంటరితనం చాలా ప్రమాదకరం!!

Webdunia
సోమవారం, 14 జులై 2014 (17:20 IST)
ఒంటరితనం చాలా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది ఒక్కోసారి మానసికంగా కుంగదీయడమే కాదు. మీ వ్యాధి నిరోధక శక్తిని కూడా బలహీనపరుస్తుందని తేలింది. అసలు ఒంటరితనంలోకి వెడుతున్నారంటేనే దానర్థం మీ శరీరంలో ఏవో అవాంఛనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాని గ్రహించాలి. దాన్ని మీరు అలాగే కొనసాగిస్తే అది మీ మొత్తం వ్యాధి నిరోధక శక్తిని దెబ్బతీయడం, అంటే ఆరోగ్యాన్ని క్షీణింపజేయడం ఖాయమని ఆరోగ్యం నిపుణులు హెచ్చరించారు. 
 
ఒంటరితనం ఫీలవడం ప్రారంభమయ్యేసరికి శరీరంలో అప్పటి వరకూ నిద్రాణంగా ఉన్న కొన్ని రకాల వైరస్‌లు విజృంభించడం ఆరంభిస్తాయి. కొన్ని అవాంఛనీ ప్రొటీన్లు శారీరకంగా, మానసికంగా ఒత్తిడిని కూడా తెస్తాయి. అందువల్ల కలుపుగోలుగానూ, అందరితోనూ కలివిడిగానూ ఉండడం ఆరోగ్యానికి మంచిదని ఒంటరితనంపై పరిశోధనలు జరిపిన అనేక వర్శిటీల పరిశోధకులు చెపుతున్నారు. 
 
కలుపుగోరుగా ఉండేవారి కన్నా ఒంటరితనం ఫీలయ్యేవారిలో మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని తేలింది. వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతున్న కారణంగా ఒత్తిడి ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. ఒంటరితనం ఫీలయ్యేవారు సాధారణంగా అర్థాయుష్కులు అని ఆమె ఒక్క మాటలో చెప్పారు. చివరికి స్థూల కాయం ఉన్నవారు, బ్రెస్ట్ క్యాన్సర్‌తో అవస్థలు పడుతున్నవారిలో కూడా ఎక్కువ మంది ఒంటరితనం ఫీలవుతున్నవారేనని ఆమె తెలిపారు. అందువల్ల ప్రతి ఒక్కరితోనూ కలుపుగోలుగా, కలివిడిగా ఉండడంలోనే ఆరోగ్య రహస్యం దాగి ఉందని ఆమె తెలిపారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

మహిళా ఐఏఎస్ అధికారులను కించపరిచిన వారిపై కఠిన చర్యలు : పొన్నం ప్రభాకర్

జగనన్న ప్రభుత్వం వస్తే రప్పా రప్పా నరికేస్తాం.. ఇంటి పునాదులు కూడా లేకుండా పెకలిస్తాం...

కొన ఊపిరితో ఉన్న కన్నతల్లిని బస్టాండులో వదిలేసిన కుమార్తె

డోనాల్డ్ ట్రంప్‌కు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్ టీవీ.. ఈ సారి గురి తప్పదంటూ కథనం

ఇరాన్ - అమెరికా దేశాల మధ్య యుద్ధ గంటలు... ఇరాన్‌కు వెళ్లొద్దంటూ భారత్ విజ్ఞప్తి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో సంక్రాంతి సందడి... కొత్త సినిమా పోస్టర్లు రిలీజ్

జన నాయగన్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు - హైకోర్టులోనే తేల్చుకోండి..

ఏనుగుల వేట ప్రేరణ తో కటాలన్ - ఆంటోనీ వర్గీస్‌ను ఫస్ట్ లుక్‌

ఆకాష్ - భైరవి అర్థ్యా జంటగా కొత్త మలుపు లుక్

పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కలయికలో చిత్రం

Show comments