మిమ్మల్ని మీరే తక్కువ అంచనా వేసుకున్నారో?

Webdunia
గురువారం, 14 ఆగస్టు 2014 (13:46 IST)
మిమ్మల్ని మీరే తక్కువ అంచనా వేసుకున్నారో? అంతేనని మానసిక వైద్యులు హెచ్చరిస్తున్నారు. మనం విజయం సాధించాలంటే అన్నిటికంటే ముందుగా ఆత్మవిశ్వాసం కావాలి. అనుకున్నంత సులభంగా దీనిని సంపాదించలేము.
 
ఎందుకంటే దీని కోసం పలు అంశాలను జయించాల్సి ఉంది. ఇది లేకపోవడాన్నే ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్ అని కూడా అంటారు‌. అసలు ఏంటీ ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్ ? ఎందుకు వస్తుంది ? కారణాలేంటి ? అధిగమించడానికి మార్గాలు ఉన్నాయా? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే.. ఈ స్టోరీ చదవండి. 
 
నేనేదీ సాధించలేను, నేను అందంగా లేను, నాకు ఏమీ తెలీదని ఇతరులను చూస్తే కలిగే భావనే ఇన్‌‌ఫీరియారిటీ కాంప్లెక్స్. అంటే ఆత్మవిశ్వాసం లోపించడం. ఏ పనిలో దిగినా ఈ ఆత్మవిశ్వాస లోపం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. దీనికి కారణం గతంలో ఏదో పనిలో మీరు విఫలం కావడమే. ఈ వైఫల్యమే భవిష్యత్తులో కూడా జరుగుతుందని మీ మనసులో ఏర్పడే భయమే దీనికి కారణం.
 
ముందుగా మిమ్మల్ని మీరు విశ్వసించండి. అంటే మీరే ఏ పనైనా చేయగలరు. ఎవరికీ తీసిపోరని మనసుకు గట్టిగా చెప్పుకోండి. మిమ్మల్ని ఎవరైనా నొప్పించే విధంగా ప్రవర్తిస్తే వారిని వెంటనే మన్నించండి. అలా చేయడంతో వారి తప్పు వారికే తెలిసొస్తుంది.
అలాగే మీ ప్రక్క వారిలో మంచి గుణాలు మీకు లేవని మీరు అనుకుంటే వాటిని సాధించడం కోసం ఏమి చేయాలో ఆలోచించండి. అంతే కానీ వారిపై ఈర్ష్యా, ద్వేషాలను పెంచుకోకండి.
 
విజయం సాధించడానికి తొలి మెట్టుగా "టేకిట్ ఈజీ" విధానాన్ని అలవర్చుకోవాలి. అంటే మీకు కావలసిన విషయాలను మెదడులోకి ఎక్కించండి. అక్కరలేని విషయాలను అక్కడే వదిలేయండి. లేదంటే వాటి గురించి ఆలోచిస్తే మనసు పాడవుతుంది. అనవసర విషయాలను మనసులోకి ఎక్కించుకోకుండా ప్రశాంతంగా ఉండగలిగితే అదే మీరు సాధించే తొలి విజయమవుతుందని మానసిక వైద్యులు చెబుతున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్‌లో ప్రధాని మోడి ఓంకార జపం

ఎర్రచందనం స్మగ్లర్లకు సమాచారం ఇచ్చాడు- డబ్బు సంపాదించాడు.. కానిస్టేబుల్ అరెస్ట్

Coldwave : సంక్రాంతి పండుగ.. తెలంగాణలో చలి తీవ్రత ఎలా వుంటుంది?

ఐపీఎస్ అధికారిణిపై వేధింపులు.. కుమారుడు పోయాక సగం చనిపోయా.. మంత్రి కోమటిరెడ్డి

అన్ని దేశాలు కలిసి అమెరికాను తంతాయేమో? ట్రంప్ చేష్టలతో విసిగిపోతున్న ఫ్రెండ్స్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mardaani 3: రాణి ముఖర్జీ నటిస్తున్న మర్దానీ 3 విడుదల తేదీ ప్రకటన

Samyuktha: బయోపిక్స్, కామెడీ క్యారెక్టర్స్ వంటి అన్ని రకాల పాత్రలంటే ఇష్టం : సంయుక్త

Maheshbabu: మహేష్ బాబు లాంచ్ చేసిన శ్రీనివాస మంగాపురం లోని జయ కృష్ణ ఫస్ట్ లుక్

Aishwarya Rajesh: ఓ..! సుకుమారి నుంచి దామినిగా ఐశ్వర్య రాజేష్ లుక్

AniL Ravipudi: సంక్రాంతి ముద్ర పడటం కూడా మంచిది కాదు : అనిల్ రావిపూడి

Show comments