రోజుకోసారైనా భార్యాభర్తలు ఫోనులో మాట్లాడుతున్నారా?

Webdunia
మంగళవారం, 10 నవంబరు 2015 (17:05 IST)
భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేస్తున్నారా? రోజుకోసారైనా ఫోనులో మాట్లాడుతున్నారా? లేదా భార్యాభర్తలు దూరంగా ఉన్నవేళ కనీసం బాగున్నావా? అని మొబైల్ సందేశమైనా ఇస్తున్నారా? ఇవేవీ చేయకపోతే.. మీ వివాహ బంధానికి బ్రేక్ పడే సమయం దగ్గర్లో ఉందని భావించాల్సిందేనని మానసిక నిపుణులు అంటున్నారు. 
 
అలాగే వైవాహిక బంధానికి నిలిపివుంచే లైంగిక సంబంధం విషయంలో అంటీముట్టనట్లుంటే కూడా భార్యాభర్తల సంబంధానికి బ్రేక్‌లు పడే అవకాశాలు లేకపోలేదని వారంటున్నారు. అలాగే రోజువారీ పనులతో యాంత్రికంగా మారిపోవడం.. జీవిత భాగస్వామి పట్ల పెద్దగా ఆసక్తి చూపకపోవడం.. ఆఫీసు పనులతో బిజీ అయిపోవడం వంటివి జరుగుతుంటే కాస్త అప్రమత్తంగా ఉండాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. 
 
ఆధునికత పేరుతో భాగస్వాముల మధ్య సులభంగా పొరపొచ్ఛాలు వచ్చేస్తున్నాయని తద్వారా విడాకుల సంఖ్య పెరిగిపోతున్నాయి. వీటిని పరిష్కరించుకోవాలంటే... భార్యాభర్తలు చిన్న చిన్న విషయాలకు గొడవపడటాన్ని నిలపాలి. చర్చలతో సమస్యలను పరిష్కరించుకోవాలి. పురుషులైతే బావమరిదిని, మహిళలైతే ఆడపడుచును తిట్టిపోయడం వంటివి పక్కనబెట్టాలి.
 
ఒకరిని ఒకరు పట్టించుకోకుండా ఉండకూడదు. ఎక్కడికెళ్లినా.. భాగస్వామితో ఫోన్‌లోనైనా టచ్‌లో ఉండాలి. ఆఫీసుకు వెళ్తే కనీసం ఒక్కసారైనా ఫోనులో మాట్లాడి బాగోగులు అడిగి తెలుసుకోండి. భార్యాభర్తలిద్దరూ కలిసి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Prabhala Utsavam: కోనసీమ జిల్లాలో సంక్రాంతి ప్రభల ఉత్సవం

Jagan Padayatra 2.0: జగన్ పాదయాత్ర 2.0కి ముహూర్తం ఖరారు?

గ్రీన్‌ల్యాండ్ బూమ్ రాంగ్, ట్రంప్‌కి పిచ్చెక్కిస్తున్న నాటో దేశాలు

తెలంగాణ అభివృద్ధిలో రాజకీయం లేదు.. మోడీ - షా ద్వయాన్ని కలుస్తా : సీఎం రేవంత్ రెడ్డి

ఆ వెబ్‌సైట్లపై కేంద్రం కొరఢా - 242 వెబ్‌సైట్స్ బ్లాక్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టి.. బాక్సాఫీస్ రికార్డులు షేక్ చేస్తున్న 'మన శంకరవరప్రసాద్ గారు'

Nagavamsi: ఆరేళ్ళ తర్వాత నాకు సంతృప్తిని ఇచ్చిన సంక్రాంతి ఇది: సూర్యదేవర నాగవంశీ

Devi Sri Prasad: ఎల్లమ్మ తో రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ హీరోగా అరంగేట్రం

రాహుల్ సిప్లిగంజ్ పాట, ఆనీ మాస్టర్ డాన్స్ తో ట్రెండింగ్‌లో అమీర్ లోగ్ సాంగ్

Arjun: అర్జున్ చిత్రం సీతా పయనం నుంచి బసవన్న యాక్షన్ సాంగ్