ఆత్మహత్యకు దారితీసే మానసిక ఒత్తిడిని అధికమించడమెలా?

Webdunia
గురువారం, 28 ఆగస్టు 2014 (16:04 IST)
విరామం ఎరుగని యాంత్రిక జీవన ప్రయాణంలో అనేక రకాలైన ఆటుపోట్లకు ప్రజలు నిత్యం లోనవుతున్నారు. తమ రోజువారీ జీవన ప్రయాణంలో వివిధ సమస్యలను ఎదుర్కొంటున్న వారే.. ఇలాంటి ఒత్తిడులకు గురవుతున్నారు. శ్రమ అధికమవడంతో పాటు ఏదో సాధించాలనే తపన ఒక్కోసారి మానసికస్థిమితం లేకుండా చేస్తుంది. ఏదో జరిగిపోతున్నట్లు అనిపించడం, ఎంత ప్రయత్నించినా అందులోంచి బయటపడలేక పోవడం జరుగుతుంది. దీనికి తోడు ఆత్మన్యూనతాభావం, శారీరక సమస్యలు మనిషిని వెంటాను మరింతగా దిగజార్చుతాయి. ఇలాంటి పరిస్థితినే ఒత్తిడి అని చెప్పవచ్చు.
 
కొన్ని రకాల లక్షణాలను అంచనా వేసి లక్షణాల తీవ్రతను బట్టి డిప్రెషన్‌ను గుర్తించవచ్చు. అలాగే డిప్రెషన్ ఏ స్థాయిలో ఉందో కూడా తెలుసుకోవచ్చు. ఉదాహరణకు నీరసం, చికాకు, నిరాశ, అభద్రతాభావం, అంతా శూన్యమైపోతున్నట్లుగా అనిపించడం, తప్పు చేస్తున్నట్లు మనసుకు అనిపిస్తుండటం, ఏకాగ్రత కోల్పోవటం, జ్ఞాపకశక్తి లోపం, చెడు జరుగుతుందేమోనని భయాందోళనకు గురి కావడం, ఇష్టపడుతున్న వాటిని అయిష్టపడటం వంటి మానసికపరమైన అంశాలు డిప్రెషన్‌ ఉందని చెప్పడానికి లక్షణాలు.
 
అలాగే డిప్రెషన్‌కు గురి అయినప్పుడు మానసికంగానే కాక, శరీర అవయవాల్లోనూ మార్పులు జరిగి శారీరక సమస్యలకు కూడా కారణం అవుతోంది. ఉదాహరణకు.. తలనొప్పి, తలతిరుగుట, అతిగా తినడం, పూర్తిగా తిండి మానెయ్యటం, అజీర్ణం, సరైన సమయానికి నిద్రపట్టకపోవటం, లేక అతిగా నిద్రపోతుండటం, తలనొప్పి, తలతిరగటం, శక్తి తగ్గి నీరసించటం, లేదా శారీరక రుగ్మతలు తగ్గకపోవటం వంటి లక్షణాలు తలెత్తుతాయి.
 
అయితే ఇందులోంచి బయటపడాలంటే కొన్ని సూచనలను పాటించక తప్పదు. మనసు ప్రశాంతంగా ఉంచుకోవటం, పుస్తక పఠనం అలవాటు చేసుకోవటం, బాధ కలిగించే విషయాల నుంచి మనసును మళ్లించే ప్రయత్నం చేయటం, పిక్నిక్ వంటి వాటికి హాజరు కావటం, చిన్న విషయాల గురించి అనవసర ఆందోళనను వదిలిపెట్టడం, ప్రశాంత వాతావరణంలో సమస్యలను పరిష్కరించుకోవడం, బ్రీథింగ్ ఎక్సర్‌సైజులు చేస్తుండటం, తరుచూ పిల్లలతో బయటకు వెళ్లి సరదాగా గడపటం, ఇష్టమైన పనులు చేయడం వంటివి చేస్తే దాదాపు డిప్రెషన్ నుంచి విముక్తులు కావచ్చని నిపుణులు చెబుతున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

రూ. 950 కోట్ల అమెరికన్ విమానాన్ని పడగొట్టేసింది, క్షిపణితో 4,000 కి.మీ లక్ష్యంపై దాడి: ఇరాన్ శక్తికి నాటో షాక్

మాజీ డీజీపీ మనవరాలికి సైబర్ నేరగాళ్ల టోకరా - రూ.1.20 కోట్లు స్వాహా

తిరుమల పవిత్రతకు భంగం కలిగిస్తే కఠిన చర్యలే : సీఎం చంద్రబాబు

మీరు పనిమనిషిని పెళ్లి చేసుకోలేదు.. వంటపని, ఇంటిపని చెయ్యండి: సుప్రీం ఆదేశాలు

యుద్ధం సరిహద్దులను దాటింది... దేశ రక్షణకు సన్నద్ధంగా ఉండాలి : రాజ్‌నాథ్ సింగ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శకులను సూపర్ స్టార్లు తొక్కేస్తున్నారు : కంగనా రనౌత్

Kiran: అప్పట్లో టీవీకి ఉన్న ప్రాధాన్యత నేపథ్యంగా తిమ్మరాజుపల్లి టీవీ తీశాం

గద్దర్ అవార్డ్స్ వేడుకలో గడబిడలు - నిర్వాహకులపై విమర్శలు ?

PrakashRaj: ధురంధర్-2 పై ప్రకాష్ రాజ్ విమర్శ - రామ్ గోపాల్ వర్మ ప్రశంస

మా ప్రేయసిరావే రేంజ్‌లో పిఠాపురంలో... హిట్ అవ్వాలని కోరుకుంటున్నా: శ్రీకాంత్

Show comments