గర్ల్ ఫ్రెండ్ మిమ్మలను మోసం చేస్తుందని తెలుసుకునేదెలా?

Webdunia
సోమవారం, 16 జూన్ 2014 (16:10 IST)
చాలా మంది యువతీ యువకులు గాఢంగా ప్రేమించుకుంటారు. మరికొందరైతే ప్రాణ స్నేహితుల్లా మెలుగుతారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేరు. అయితే, కొన్ని రోజులకు బాయ్ ఫ్రెండ్‌పై ఏర్పడిన అయిష్టతో.. మరే ఇతర కారణమో తెలియదు గానీ అతనిని నుంచి దూరమయ్యేందుకు మోసం చేస్తుంటారు. అయితే, బాయ్ ఫ్రెండ్‌ను గర్ల్ ఫ్రెండ్ మోసం చేస్తున్నట్టయితే దాన్ని ఇట్టే పసిగట్టవచ్చని మానసిక నిపుణులు చెపుతున్నారు. అవేంటో ఒకసారి చూద్ధాం. 
 
మీ పట్ల శ్రద్ధ తగ్గిపోవడం... గతంలో కంటే ఇపుడు మీ పట్ల శ్రద్ధ చూపక పోవడం. మీరు స్పందించినా.. అటు వైపు నుంచి స్పందనలు లేకపోవడం, చాలావరకు పట్టించుకోకపోవడం. అలాగే, మీ పట్ల అన్యోన్యంగా నడుచుకుంటుందా లేదో గ్రహించాలి. 
 
మీతో గడిపేందుకు ఆసక్తి చూపక పోవడం... ఒకప్పుడు మీరు లేకుండా ఏదీ చేయని వారు.. ఇప్పుడు మిమ్మల్ని చూడటానికి కూడా సమయం లేదని చెప్పడం. కనీసం రోజులో ఒక అర్థగంట సమయం కూడా మీతో గడిపేందుకు కేటాయించలేక పోవడం. 
 
ఫోన్ నిరంతరం బిజీగా ఉండటం... మీ వెంట ఉన్న సమయంలో ఎన్నడూ బిజీగా లేని మీ గర్ల్ ఫ్రెండ్ ఫోన్.. మీ నుంచి దూరమైన తర్వాత నిరంతరం బిజీగా ఉండటం. దాన్ని గురించి మీరు ప్రస్తావిస్తే.. మా స్నేహితురాలితో లేక ఇంట్లో వారో లేక బంధువులు ఫోన్ చేస్తే మాట్లాడుతున్నట్టు సమాధానమివ్వడం. ఇలా ఒక రోజు కాదు.. ప్రతి రోజూ.. బిజీగా ఉండటం. 
 
ఆన్‌లైన్ చాటింగ్‌లో ఉన్నా స్పందన లేక పోవడం.. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఆన్‌లైన్ చాటింగ్‌లో నిత్యం బిజీగా ఉంటారు. మీరు ఉన్నట్టుగానే మీ గర్ల్ ఫ్రెండ్ కూడా ఆన్‌లైన్‌ చాటింగ్‌లో ఉన్నపుడు మీరు హాయ్ చెప్పినా.. అటు వైపు నుంచి స్పందన రాకపోవడం. ఇది మీ పట్ల ఆమె ఆసక్తి చూపడం లేదని గ్రహించవచ్చు. 
 
శృంగారానికి నిరాకరించడం.. మీరు కలిసివున్నపుడు మీరు కోరినపుడల్లా శృంగారానికి సమ్మతం తెలిపే గర్ల్‌ఫ్రెండ్.. మునుపటిలా మీతో శృంగారంలో కలవడానికి ఇష్టపడక పోవడం. ఇలాంటి అనేక సంకేతాలు, చర్యల ద్వారా మీ గర్ల్ ఫ్రెండ్ మీ నుంచి దూరమైందని ఖచ్చితంగా చెప్పొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

నేను మహిళా జర్నలిస్టునే కదా, నన్నెందుకు వేధిస్తున్నారు: NTV జర్నలిస్ట్ దేవి (video)

అర్థరాత్రి వీధికుక్కల ఊళలు, కరుస్తున్నాయని 600 కుక్కల్ని చంపేసారు?!!

సంక్రాంతి కోడిపందెం.. రూ.1.53 కోట్లు గెలుచుకున్న గుడివాడ వాసి

బ్యాకేజీ కంటెయిన్‌ను లాగేసుకున్న ఎయిరిండియా ఫ్లైట్ ఇంజిన్

స్వగ్రామంలో సంక్రాంతి సంబరాలు.. కుటుంబంతో పాల్గొన్న సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో సంక్రాంతి సందడి... కొత్త సినిమా పోస్టర్లు రిలీజ్

జన నాయగన్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు - హైకోర్టులోనే తేల్చుకోండి..

ఏనుగుల వేట ప్రేరణ తో కటాలన్ - ఆంటోనీ వర్గీస్‌ను ఫస్ట్ లుక్‌

ఆకాష్ - భైరవి అర్థ్యా జంటగా కొత్త మలుపు లుక్

పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కలయికలో చిత్రం

Show comments