అలాంటి స్నేహం తప్పా... బలాలు.. బలహీనతలు చెప్పొద్దు!

Webdunia
గురువారం, 7 జనవరి 2016 (10:53 IST)
అబ్బాయిలతో స్నేహం తప్పా... అంటే కాదు కానీ దానికి పరిధి దాటని స్నేహబంధం మంచిదని ప్రతి ఒక్కరూ చెపుతుంటారు. అలానే స్నేహం పేరుతో వారి గురించి వెనకా ముందూ తెలుసుకోకుండా గుడ్డిగా అడుగులు వేయడం మరీ తప్పని పెద్దలు హితవు పలుకుతారు. 
 
సాధారణంగా కాలేజీల్లో, ఆఫీసుల్లో... ఇలా ఎక్కడో ఓ చోట అబ్బాయిలు స్నేహితులవుతారు. నిజానికి కొన్ని సందర్భాల్లో తోటి అమ్మాయిలతో ఉండే పోటీ వారితో కలవనివ్వదు. అప్పుడు మగపిల్లలతో స్నేహమే మేలనుకుంటాం. అయితే ఇంకా మన సమాజంలో ఆడా, మగా స్నేహాన్ని పూర్తిగా అంగీకరించలేని పరిస్థితి. కాదనడానికేం లేకపోయినా ఎవరి పరిధి వారు మరిచిపోకుండా ఉంటే అది మీకు మేలు చేస్తుంది. 
 
కాస్త ఎవరైనా సన్నిహితంగా మాట్లాడుతున్నప్పుడు... మీ బలాలూ, బలహీనతలూ చెప్పే ప్రయత్నం చేయొద్దు. వాటిని ఆసరాగా తీసుకుని మీకు హాని తలపెట్టే ప్రమాదం లేకపోలేదు. అలానే అవతలి వారిని నమ్మి మీ వ్యక్తిగత పాస్‌వర్డ్‌లూ, మెయిల్‌ ఐడీలూ చెప్పొద్దు. బ్యాంక్‌ ఖాతాలూ, ఇతర లావాదేవీల వంటివీ రహస్యంగా ఉంచుకోండి. 
 
ఇప్పుడు సామాజిక అనుసంధాన సైట్లదే హవా. వీటితో ఎంత సౌకర్యం ఉన్నా చాలాసార్లు మీ ఏకాంతాన్ని దూరం చేస్తుంటాయి. ఒకరిద్దరు అతి చనువు తీసుకునే స్నేహితులు తారసపడినా చాలా ఇబ్బందిపడుతుంటాం. అలాంటి పరిస్థితి ఎదురైతే వాళ్లని కట్టడి చేసేందుకు తగిన నిబంధనలు పెట్టుకోవాలి. ముక్కూముఖం తెలియని వారితో స్నేహానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

బ్రహ్మదేవుడి కంటే నాకే ఎక్కువ తెలుసు, నేను చెప్పింది వినిసావు: యువతితో వీడియోలో అన్వేష్

2026లో AI వెన్నుపోటు పొడిచే ఉద్యోగాల జాబితాలో నా ఉద్యోగం ఉందా?

సొరంగంలో ఢీకొన్న లోకోమోటివ్ రైళ్లు - 60 మందికి గాయాలు

పులిహోరలో నత్తను పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారనే అనుమానం: సింహాచలం ఈవో

ఫ్రెండ్స్, సింహాచలం ప్రసాదంలో నత్త కనబడింది: భక్తులు ఆరోపణ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంక్రాంతికి వస్తున్నాం చిత్రం కెరీర్‌ను మలుపుతిప్పంది : అనిల్ రావిపూడి

Sri Nandu: నాకు డబ్బు కంటే గౌరవం చాలా ముఖ్యం : సైక్ సిద్ధార్థ.హీరో శ్రీ నందు

'మన శంకర వరప్రసాద్ గారు' బుకింగ్స్ ఓపెన్

Chiranjeevi: 100 మిలియన్ వ్యూస్ దాటి చార్ట్‌బస్టర్‌గా నిలిచిన మీసాల పిల్ల

Raviteja: రవితేజ, ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి లపై వామ్మో వాయ్యో సాంగ్

Show comments