కోపాన్ని తగ్గించుకోవాలంటే నూడిల్స్ తీసుకోండి.

Webdunia
మంగళవారం, 2 డిశెంబరు 2014 (16:08 IST)
చీటికి మాటికి కోప్పడుతున్నారా? పని ఒత్తిడి, ఇంటి పనితో సతమతమవుతున్నారా? ఇతరుల పట్ల గల కోపంతో ఒత్తిడికి లోనవుతున్నారా? అయితే ఈ ఫుడ్స్ తీసుకోండి. కోపాన్ని అదుపు చేసుకోవాలంటే డైట్ ప్లాన్ మార్చాల్సిందేనని తాజా అధ్యయనంలో తేలింది. 
 
అందుచేత అరటి పండ్లను రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోండి. ఇందులోని విటమిన్ బి, పొటాషియం మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. అంతేగాకుండా కోపాన్ని నియంత్రిస్తుంది. అలాగే వాల్ నట్స్‌ కూడా కోపాన్ని అదుపుచేస్తాయి. ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎప్పటికీ మనస్సును కూల్ అండ్ హ్యాపీగా ఉంచుతాయి. 
 
ఇకపోతే.. న్యూడిల్స్ తీసుకుంటే కోపాన్ని కంట్రోల్ చేసుకోవచ్చట. వీటిని చాలామంది పక్కనపెట్టేస్తారు. అయితే కోపాన్ని తగ్గించుకోవాలంటే న్యూడిల్స్ తీసుకోవాల్సిందే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కానీ తీసుకునే న్యూడిల్స్‌లో స్పైసీ, గ్రేవీలను మాత్రం జోడించకుండా ప్లైన్ న్యూడిల్స్ తీసుకోవాలని.. వాటిలో మిరియాల పొడి.. కూరగాయల తురుమును యాడ్ చేసుకుంటే సరిపోతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
 
వీటితో పాటు పీనట్ బటర్, గ్రిల్డ్ చీజ్, బేక్డ్ పొటాటోస్ వంటివి తీసుకోవాలి. ఈ డైట్ ప్లాన్‌తో పాటు వ్యాయామం, యోగా వంటివి చేస్తే ఆరోగ్యంగా ఉండటంతో పాటు అందంగానూ ఉండవచ్చునని న్యూట్రీషన్లు అంటున్నారు. ఒత్తిడి, కోపాన్ని తగ్గిస్తేనే ముఖం ప్రత్యేక అందాన్ని సంతరించుకుంటుందని వారు చెబుతున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కాలువలో శవమై తేలిన యువ గాయని... ఎవరు?

పూణెలో దారుణం : కదులుతున్న కారులో మహిళా లాయర్‌పై అత్యాచారం..

దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లనుంది : రాహుల్ గాంధీ

అక్రమ సంబంధాన్ని నిలదీసిన భర్త - పెట్రోల్ పోసి సజీవదహనం చేసిన భార్య - అత్త

ప్రభుత్వ ఉద్యోగాలు.. వయోపరిమితిని 44కి పెంచనున్న తెలంగాణ సర్కారు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐక్య నా బిడ్డ లాంటిది, మా ఈ ట్రస్ట్ వాయిస్‌లెస్‌కి వాయిస్‌గా ఉంటుంది: మనోజ్ మంచు

Yash: టాక్సిస్ సెట్ నుండి రాయ గా యష్ లుక్

నారా లోకేష్‌కు ఎక్కువ మంది పిల్లలు వుండాలని భావిద్దాం, బావ ఫోటో పెట్టావు: పూనమ్ కౌర్ ట్వీట్

Yash: టాక్సిక్ సెట్ నుండి రాయా గా అద్భుతమైన స్టిల్‌ తో యష్

Purusha : ఆద్యంతం వినోదభరితంగా పురుష:ట్రైలర్

Show comments