Webdunia - Bharat's app for daily news and videos

Install App

మానసిక వ్యాధులు - చికిత్సా పద్దతులు

Webdunia
శనివారం, 14 జులై 2007 (14:07 IST)
ప్రపంచంలో ఎన్ని రకాల వ్యాధులున్నప్పటికీ, మనిషి జీవన శైలిలో అసాధారణ మార్పులను కలగ జేసేవే మానసిక వ్యాధులు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం జనాభాలో నూటికి ఒకరు తీవ్ ర… మైన మానసిక రుగ్మతలతో, పది నుంచి 20 మంది సాధారణ మానసిక జబ్బులతో బాధపడుతున్నారు. మానసిక రోగులకు ఇతరత్రా ఏ జబ్బులు లేక పోవచ్చు కాని అంత మాత్రాన వారు ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క కాదు.

మానసిక వ్యాధి అంటే ఏమిటి ?
మనిషి ఆలోచన, జ్ఞాపక శక్తులలో మార్పులు రావటం, ఉద్వేగాలు, భావాలలో తేడా రావటమే మానసిక వ్యాధి. ఈ వ్యాధికి గురైన రోగుల దినచర్యల్లో తీవ్ర మార్పులు సంభవిస్తాయి. దీని మూలంగా రోగి తన చుట్టు పక్కల వారందరికీ అసౌకర్యంగా తయారవుతాడు.

మానసిక వ్యాధి ముఖ్య లక్షణాలు :
ఈ వ్యాధి సోకిన రోగుల ప్రవర్తనలో భారీగా మార్పులు సంభవిస్తాయి. ఈ తరహా రోగులు సాధారణ ప్రవృత్తిని దాటి మరీ ఎక్కువగా మాట్లాడటం, లేదా మౌనం పాటించటం చేస్తారు. ఎల్లప్పుడు అనుమానాలు వ్యక్త పరచటం, గొప్పలు చెప్పుకోవటం, భ్రాంతులకు గురికావటం, కనిపించనివాటిని కన్పిస్తున్నాయని, వినిపించని మాటలను వినిపిస్తున్నాయని భ్రాంతికి గురవటం వీరి లక్షణం. మానసిక రోగుల నిద్రలో మార్పులు రావచ్చు. నిద్ర సక్రమంగా లేకపోవటం లేదా ఎక్కువగా నిదురించటం, రోగికి ఆకలి వుండకపోవచ్చు లేదా అతిగా భోజనం చేయవచ్చు. మలబద్దకం లేదా విరోచనాలు కలుగవచ్చు. సెక్స్‌కు సంబంధించిన సమస్యలు కూడా తలెత్తుతాయి. పైగా జ్ఞాపకశక్తిలో మార్పులు, తదితర లక్షణాలు వీరిలో ప్రధానంగా కనిపిస్తాయి.

మానసికవ్యాధి కారణాలు :
మెదడులో రసాయన మార్పులు కలగటం, అనువంశీకతకు గురవటం, బాధాకరమైన బాల్య అనుభవాలు, కుటుంబ వాతావరణం, లైంగిక పరమైన కారణాలు, పేదరికం, నిరుద్యోగం, అసమానతలు వంటి కారణాలు మానసిక వ్యాధులకు దారి తీస్తుంటాయి.

మానసిక వ్యాధుల రకాలు :
సైకోసిస్‌ : తీవ్రమైన మానసిక రుగ్మతలను సైకోసిస్‌ అంటారు. ఉదాహరణకు స్కిజోఫ్రేనియా, డిప్రెషన్‌, మానియా.....

న్యూరోసిస్‌ : తీవ్రతరం కానటువంటి మానిసిక వ్యాధులనే న్యూరోసిస్‌ అంటారు. ఉదాహరణకు ఆంక్జయిటీ న్యూరోసిస్‌, డిప్రెషన్‌ న్యూరోసిస్‌, హిస్టీరియా, అబ్ససివ్‌, కంపల్సివ్‌ న్యూరోసిస్‌, ఫోబియా.......

మానసిక వ్యాధికి చికిత్సా విధానాలు :
1. మందులు, 2. కరెంటు చికిత్స (షాక్‌ ట్రీట్‌మెంట్‌), 3. సైకో థెరపీ, 4. రిహాబిలిటేషన్‌.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?