మంగళవారం : అమ్మవారికి నైవేద్యం ఎలా సమర్పించాలి?

Webdunia
సోమవారం, 21 జులై 2014 (17:43 IST)
పేదవాడైన కుచేలుడు సమర్పించిన అటుకులను శ్రీకృష్ణుడు ప్రేమగా అందుకున్నాడు. భక్త కన్నప్ప అందించిన మాంసాన్ని మహాశివుడు నిస్సంశయంగా అందుకున్నాడు. కాబట్టి నైవేద్యంగా ఏం అర్పిస్తున్నామనే దానికంటే భక్తి శ్రద్ధలతో సమర్పిస్తున్నామనేదే ముఖ్యమని పురోహితులు చెబుతున్నారు. ఇందులో మహాకాళి అమ్మవారైనా అంతే. అమ్మవారికి మంగళవారం, శుక్రవారాల్లో పండో, పాయసమో ఎదైనా నైవేద్యంగా పెట్టవచ్చు. అవకాశం ఉంటే ఎన్ని పదార్ధాలను అయినా అర్పించవచ్చు.
 
నానోపహార రూపంచ ||
నానా రస సమన్వితం |
నానా స్వాదుకరం చైవ |
నైవేద్యం ప్రతిగృహ్యతాం ||
 
అనే శ్లోకాన్ని స్మరించుకుంటూ నివేదించిన పదార్ధాలపై నీటిని ప్రోక్షించి "సత్యం త్వర్తేనా పరిషించామి అమృతమస్తు.. అమ్రుతోవస్తరణమసి" అంటూ పదార్థాల చుట్టూ ఔపోసనవిధిగా నీరు చిలకరించాలి. తర్వాత 
 
"ఓం అపానాయస్వాహా
ఓం వ్యానాయస్వాహా 
ఓం ఉదానాయస్వాహా
ఓం సమానాయస్వాహా"
 
అంటూ ఐదుసార్లు అమ్మవారికి నివేదనము చేసి నమస్కరించాలి. "మధ్యే మధ్యే పానీయం సమర్పయామి" అంటూ నీటిని పదార్థాలపై ప్రోక్షించాలి. "ఉత్తరాపోసనం సమర్పయామి", "హస్తౌ ప్రక్షాళయామి", "పాదౌ ప్రక్షాళయామి", "శుద్ధ ఆచమనీయం సమర్పయామి" - ఇలా పలుకుతూ నాలుగుసార్లు నీటిని సపర్పించాలి. ఇలా పై మంత్రాన్ని పఠిస్తూ నైవేద్యం సమర్పిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా జరుగుతాయని పండితులు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

జొమాటోలో ఆర్డర్ చేసిన బిర్యానీలో కుక్క కాలు.. వీడియో వైరల్

పెయింట్ డబ్బా మీద భార్య పడిందన్నాడు.. కానీ సుత్తితో తలపై కొట్టాడు.. కూతుళ్లు?

తెలంగాణ వ్యాప్తంగా పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం

మొంథా తుఫానుతో ఏపీకి నష్టం.. రూ.341.48 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించిన కేంద్రం

ఫైనాన్షియర్ వేధింపులు.. రుణాన్ని తిరిగి ఇవ్వాలని నలుగురి ముందు..?

అన్నీ చూడండి

లేటెస్ట్

రాత్రిపూట బట్టల్ని శుభ్రం చేయొచ్చా.. వాషింగ్ మెషీన్‌ను ఏ దిశలో వుంచాలంటే?

ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు

10-03-2026 మంగళవారం ఫలితాలు : దుబారా ఖర్చులు విపరీతం....

ఈ దొంగ సన్యాసిని బయటకు గెంటండి: సాయిబాబా

ఆదాయం పెరగాలంటే.. ధనవంతులు కావాలంటే.. చాణక్య నీతిని..?

Show comments