శ్రీవారి నేత్ర దర్శనం రోజున.. తప్పులు చేస్తే శిక్ష తప్పదట..!

Webdunia
శుక్రవారం, 8 ఆగస్టు 2014 (16:57 IST)
కలియుగ వైకుంఠం, శ్రీ వేంకటేశ్వరుని ఆలయంలో గురు, శుక్రవారాలు ప్రత్యేకమని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. గురువారం రోజున శ్రీవారి నేత్ర దర్శనం చేసుకునే వారికి సకల సంపదలు చేకూరి, సజ్జనులుగా జీవిస్తారనే తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులు అంటున్నారు. 
 
ఈ నేపథ్యంలో గురువారం రోజున ధవళ వస్త్రాలతో, నేత్ర దర్శనమిచ్చే వెంకన్న స్వామిని దర్శించుకునే వారికి మనోధైర్యం, భోగభాగ్యాలు, సిరిసంపదలు చేకూరుతాయని తితిదే పురోహితులు చెబుతున్నారు. ఇంకా శుక్రవారం పూట శ్రీవారికి ఆగమ శాస్త్రోక్తంగా అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించే వారికి ఈతిబాధలు తొలగిపోయి శ్రీమన్నారాయణ, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని వారు చెబుతున్నారు.
 
గురువారం ధవళ వస్త్రాలతో దర్శనమిచ్చే శ్రీవారికి శుక్రవారం పూట అభిషేకాలు నిర్వహించి, పట్టు వస్త్రాలను సమర్పించే భక్తులను కోటి జన్మల పుణ్య ఫలాలు, భోగ భాగ్యాలు, లక్ష్మీ కటాక్షం చేకూరుతుందని తితిదే అర్చకులు సూచిస్తున్నారు.
 
గురువారం నాడు తిరుమల కొండమీద క్రమశిక్షణ:
గురువారం నాడు శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులకు శ్రీవారి నేత్ర దర్శనం రోజున తిరుమల కొండమీద క్రమశిక్షణ కనబడుతోందని మీడియాలో వార్తలొస్తున్నాయి. స్వామివారి నేత్ర దర్శనం రోజున తప్పులు చేస్తే శిక్షలు తప్పవని విశ్వాసంతో.. కొండమీద క్రమశిక్షణ నెలకొంటుంది. గురువారం రోజున తిరుమల ఏడు కొండలపై వ్యాపారులు లాభాపేక్ష లేకుండా ధర్మబుద్ధితో వ్యాపారం చేస్తున్నారు. ఇంకా లాభం చూసుకున్నా అది నామమాత్రమేనని వారు అంటున్నారు. 
 
ఇదేవిధంగా.. టీటీడీ సిబ్బంది కూడా భక్తుల పట్ల సాత్విక శైలితో వ్యవహరిస్తోంది. గురువారం నాడు తప్పులు చేస్తే వెంకన్న స్వామి కన్నెర్ర చేస్తాడనే నేత్ర దర్శనం సెంటిమెంట్‌తో అందరూ క్రమశిక్షణతో ప్రవర్తిస్తున్నారు.  
 
శుక్రవారం శ్రీవారి నిజపాద దర్శనం: 
ఇకపోతే.. తిరుమల ఏడు కొండలపై శుక్రవారం శ్రీవారి నిజపాద దర్శనం ఉంటుంది. గురువారం స్వామి వారికి ధరించే ధవళ వస్త్రాలను తొలగించి అభిషేక, ప్రత్యేక పూజలకు అనంతరం పట్టు వస్త్రధారణ జరుగుతుంది. దీనితో పాటు స్వామివారి నిజపాద దర్శనం కూడా ఉంటుంది. 
 
ఈ రోజున పట్టు పంచె, ఏడు కొండల ఏలికకు పట్టు తలపాగా, బుగ్గన చుక్కతో గోకుల విహారి అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. భక్తుల కొంగు బంగారమైన వేంకటాచలపతి శుక్రవారం పూట దర్శించుకునే వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని తితిదే పురోహితులు చెబుతున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇష్టపూర్వకంగా చేసే సె.. క్స్ వర్క్ నేరంకాదు.. కేసులు పెట్టొద్దు : సుప్రీంకోర్టు

క్రైమ్ షోలు చూసి నలుగురిని హత్య చేసి కారులో సజీవదహనం చేసిన కుమారుడు - సహకరించిన తల్లీచెల్లి

అప్పు అడిగితే ఇవ్వలేదన్న అక్కసుతో ఒంటిరి మహిళను అంతమొందించారు...

2,500 కిలోమీటర్ల వ్యాసార్థంలో విస్తరించి ఉన్న భారీ మేఘాల సమూహం, ఏం చేయబోతోంది?

నెల్లూరులో 1000 మంది నివాసితులకు వేదాంత పవర్ మీనాక్షి ఎనర్జీ సురక్షిత తాగునీటి సదుపాయం

అన్నీ చూడండి

లేటెస్ట్

30-05-2026 శనివారం ఫలితాలు - కార్యసాధనకు మరింత శ్రమించాలి.. ఓర్పుతో పనిచేయండి...

శుక్రవారం ఫలితాలు - ఆర్థికంగా విశేష ఫలితాలున్నాయి

28-05-2026 గురువారం ఫలితాలు - ధనం మితంగా ఖర్చు చేయండి

మూడేళ్లకు ఒకసారి వచ్చే పద్మిని ఏకాదశి.. తులసి దళాలతో అర్చన చేస్తే?

27-05-2026 బుధవారం ఫలితాలు- దంపతుల మధ్య అకారణ కలహం

Show comments