శ్రావణ మంగళవారం.. దుర్గాదేవిని పూజిస్తే?

Webdunia
సోమవారం, 4 ఆగస్టు 2014 (19:11 IST)
శ్రావణ మంగళవారం.. దుర్గాదేవిని పూజిస్తే ఎలాంటి ఫలితాలు దక్కుతాయో చూద్దాం.. పూర్వము త్రిపురాసురుని సంహరించేందుకు పరమేశ్వరుడు సర్వశక్తి సంపన్నురాలైన గౌరీదేవిని పూజించి విజయుడైనాడు. అదేవిధంగా.. గౌరీదేవిని నిష్టతో పూజించిన నవగ్రహముల్లో ఒకడైన "కుజుడు" మంగళవారమునకు అధిపతి అయినాడు. 
 
అట్టి మహిమాన్వితమైన గౌరీదేవిని శ్రావణ మంగళవారం కొత్తగా పెళ్లైన స్త్రీలు పూజిస్తే సకల సంపదలు, దీర్ఘసుమంగళీ ప్రాప్తం లభిస్తుందని పురోహితులు అంటున్నారు.
 
అందుచేత శ్రావణమాసంలో వచ్చే మంగళవారం పూట మహిళలు శుచిగా స్నానమాచరించి ఇంటిని, పూజగదిని శుభ్రం చేసుకుని, గడపకు, గుమ్మాలకు పసుపు కుంకుమ తోరణాలు, రంగవల్లికలతో అలంకరించుకోవాలి. సాయంత్రం పూట నిష్టతో దీపమెలిగించి అమ్మవారిని ప్రార్థించాలి. చక్కెరపొంగలిని నైవేద్యంగా పెట్టి, కర్పూర హారతులు సమర్పించుకోవాలి. 
 
ఇంకా శ్రావణ మంగళవారం పూట అమ్మవారి ఆలయాలను సందర్శించుకునే వారికి పుణ్యఫలాలు సిద్ధిస్తాయని విశ్వాసం. అంతేగాకుండా ఆలయాల్లో అమ్మవారికి నేతితో దీపమెలిగించడం ద్వారా వంశాభివృద్ధి, సర్వమంగళం చేకూరుతుందని పండితులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

సముద్రంలో కలిసే నీళ్లు ఎవరైనా వాడుకోవచ్చు : ఏపీ సీఎం చంద్రబాబు

iBomma Ravi: ఐబొమ్మ రవికి నాంపల్లి కోర్టులో పెద్ద ఎదురుదెబ్బ

వెనెజులా అధ్యక్షుడు మదురోను ఎలా నిర్భంధంచారో తెలుసా? (Video)

అసెంబ్లీ కౌరవ సభగా మారిపోయింది.. కేసీఆర్‌ను కాదు రాహుల్‌ను అలా చేయండి.. కేటీఆర్

కుక్క ఏ మూడ్‌లో ఉందో ఎవరూ ఊహించలేరు : సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

అన్నీ చూడండి

లేటెస్ట్

05-01-2026 సోమవారం ఫలితాలు - ధనసహాయం, చెల్లింపులు తగవు...

04-01-2026 నుంచి 10-01-2026 వరకు మీ వార రాశిఫలాలు

04-01-2026 ఆదివారం ఫలితాలు - మొండి బాకీలు వసూలవుతాయి.. ఖర్చులు సంతృప్తికరం...

సంక్రాంతి గీతల ముగ్గులు- రథం ముగ్గు

03-01-2026 శనివారం ఫలితాలు - ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు...

Show comments