పూజకు అనువైన వేళలు ఏంటి?

Webdunia
బుధవారం, 13 ఆగస్టు 2014 (18:07 IST)
దేవతా పూజలు ఎప్పుడంటే అప్పుడు చేయకూడదు. ప్రభాతకాలం, మధ్యాహ్న, సాయంకాలాలలో ప్రశాంత మనస్కులమై, శుచిగా పరమాత్మను పూజించాలి. దీన్ని బాహ్యపూజగా పరిగణిస్తారు. ఇది లోనికి మళ్లితే మానసిక పూజగా మారుతుంది. దానికి సమయాలుండవు. 
 
చివరకు "యద్యత్ కర్మకరోమి తత్తదఖిలం శంభో తవారాధనమ్" అన్నట్లు ఏ పని చేసినా పూజయన్న భావం స్థిరపడాలి. అట్లే జపం కూడా. ప్రారంభంలో ఈ  జపం మూలకూర్చుని, మూలపట్టుకుని జపంచేస్తూ చేస్తూ చివరకు మూల, మాలలు వదిలి మనలో నిరంతరమూ జపం కొనసాగే స్థితికి చేరుకోవాలి. దానికే "అజపాజపస్థితి" అని పిలుస్తారు.
 
అలాగే భగవంతునికి మనము అర్పించవలసినవి పదార్థాలు కావు. మనలోని ఆహంకారాలు, కామనలు వంటివే. అలాగే హారతులంటే కేవలం కర్పూరం వెలిగించడమే కాదు. 
 
మనలోని అహంకారాన్ని కర్పూరంలా వెలిగించి, పరమాత్మకు సమర్పించడం, పుష్పం సమర్పయామి అని పువ్వులకు మనలోని దుర్వాసనలను పట్టించి స్వామి పాదాల మీద సమర్పిస్తే ఆ పాదాలు ఆ దుర్వాసనలను శుద్ధం చేసి మళ్లీ మనకిస్తే వాటిని శిరస్సున ధరిస్తామని పురోహితులు చెబుతున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

నన్ను క్షమించకపోతే ఈ ఏడాది అంతా అష్టదరిద్రాలతో సర్వనాశనం అవుతారు: యూ ట్యూబర్ అన్వేష్

హిజ్రాలకు శుభవార్త చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి... వంద శాతం రాయితీతో రుణాలు

Kavitha: 2025 సంవత్సరం నాకు చాలా చెడు సంవత్సరం.. కల్వకుంట్ల కవిత

అమెరికాలో మంచి ఉద్యోగం.. పెళ్లి పీటలెక్కాల్సిన యువకుడికి గుండెపోటు

అక్రమంగా జింక మాంసం వ్యాపారం.. రెడ్ హ్యాండెడ్‌గా వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు

అన్నీ చూడండి

లేటెస్ట్

28-12-2025 ఆదివారం ఫలితాలు - శ్రమించినా ఫలితం శూన్యం...

2026-2027: శ్రీ పరాభవ నామ సంవత్సర ఫలితాలు - మీనరాశికి ఆదాయం-14

2026-2027: శ్రీ పరాభవ నామ సంవత్సర ఫలితాలు- కుంభరాశికి సంవత్సరం శుభ ఫలితాలు

2026-27: శ్రీ పరాభవ నామ సంవత్సర ఫలితాలు - మకరరాశికి ఈ సంవత్సరం యోగదాయకం

27-12-2025 శనివారం ఫలితాలు - నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త...

Show comments