Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుచీంద్రం హనుమంతుడి తోకకు వెన్నపూస రాస్తారెందుకు?

Webdunia
మంగళవారం, 11 నవంబరు 2014 (14:12 IST)
తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారి జిల్లాలో'సుచీంద్రం'లో కనిపిస్తుంది. త్రిమూర్తులు ఒకే లింగరూపంలో ఆవిర్భవించడం ఈ క్షేత్రం ప్రత్యేకత. లింగం పైభాగాన విష్ణుమూర్తి మధ్యభాగంలో శివుడు  క్రిందిభాగంలో బ్రహ్మదేవుడు ఉన్నారని స్థలపురాణం చెబుతోంది. అహల్య విషయంలో గౌతమమహర్షి శాపానికి గురైన దేవేంద్రుడు, ఇక్కడి త్రిమూర్తులను ఆశ్రయించి శాపవిమోచనాన్ని పొందాడని అంటారు.
 
ఇంతటి మహిమాన్వితమైన ఈ క్షేత్రంలో 18 అడుగుల హనుమంతుడి విగ్రహం కొలువై ఉంటుంది. ఇంతటి భారీ రూపాన్ని కొంచెం దూరం నుంచే పూర్తిగా చూడగలుగుతాం. సాధారణంగా హనుమంతుడి అనుగ్రహాన్ని పొందాలనుకునే వాళ్లు ఆయనకి సిందూర అభిషేకం చేయిస్తుంటారు. కానీ అందుకు భిన్నంగా ఈ క్షేత్రంలో స్వామివారి తోకకు స్వయంగా 'వెన్నపూస' రాస్తుంటారు.
 
ఈ ఆచారం రామాయణ కాలంతో ముడిపడివుందని ఇక్కడి వాళ్లు చెబుతుంటారు. సీతాన్వేషణ చేస్తూ లంకా నగరంలో అడుగుపెట్టిన హనుమంతుడు, కావాలనే రావణ సైన్యానికి పట్టుబడతాడు. రావణుడి ఆదేశం మేరకు ఆయన సైనికులు హనుమంతుడి తోకకు నిప్పుపెడతారు. ఆ సంఘటనని తనకి అనుకూలంగా మార్చుకున్న హనుమంతుడు తన తోకకి గల మంటను అక్కడి భవనాలకు అంటించి వాళ్లని భయభ్రాంతులకు గురిచేస్తాడు.
 
ఆ సంఘటనలో హనుమంతుడి తోక చాలావరకూ కాలిపోతుంది. ఆ బాధ నుంచి ఆయనకి ఉపశమనం కలగాలనే ఉద్దేశంతోనే ఇక్కడి స్వామి తోకకి 'వెన్నపూస' రాస్తున్నట్టుగా చెబుతారు. తరతరాలుగా వస్తోన్న ఈ ఆచారం వెనుక గల అర్థం ఇదేనని అంటారు. ఈ విధంగా హనుమంతుడి తోకకి వెన్నపూస రాస్తూ ఆయనకి ఉపశమనం కలిగించడం వలన, ఆ స్వామి ఆయురారోగ్యాలను ... అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడని భక్తులు విశ్వసిస్తారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మిథున్ రెడ్డికి షాకిచ్చిన సుప్రీంకోర్టు... సరెండర్‌కు కూడా నో టైమ్..

Hyderabad: పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారం చేశాడు..

Hyderabad: స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25- ఆరవ పరిశుభ్రమైన నగరంగా హైదరాబాద్

ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో లాలూకు చిక్కులు.. కేసు విచారణ వేగవంతం చేయాలంటూ...

భార్యాపిల్లలను బావిలో తోసేశాడు... ఆపై గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం

అన్నీ చూడండి

లేటెస్ట్

15-07-2025 మంగళవారం ఫలితాలు - ఓర్పుతో ముందుకు సాగండి...

గుడి చుట్టూ ప్రదక్షిణ అంతరార్థం ఏమిటో తెలుసా?

పగడ హనుమంతుని విశిష్టత ఏమిటి?

సంకష్ట హర చతుర్థి: విఘ్నేశ్వరునికి మోదకాలు సమర్పిస్తే..?

Shravana Masam: శ్రావణ సోమవారం ఆవు నెయ్యిని నైవేద్యంగా సమర్పిస్తే..

Show comments