శుక్రవారం లక్ష్మీదేవిని గులాబీ పూలతో అర్చిస్తే..?

Webdunia
సోమవారం, 22 డిశెంబరు 2014 (18:51 IST)
లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే అష్టైశ్వర్యాలు లభించినట్లే. సకలసంపదలను ప్రసాదించే లక్ష్మీదేవి అందరిపట్ల ఎంతో దయకలిగి ఉంటుంది. అందరినీ చల్లగా చూడటం కోసమే ఆరాటపడుతూ ఉంటుంది. కాకపోతే తాను ఉండాలనుకునే చోట ప్రశాంతత ... పవిత్రత ఉండాలని కోరుకుంటుంది. 
 
అందుకే పనికిరాని వస్తువులు ... అనవసరమైన వస్తువులు ఇంట్లో ఉంచరాదని పెద్దలు చెబుతుంటారు. అలాంటివి లేకుండా పరిశుభ్రంగా ఉండే ఇంట్లోకి లక్ష్మీదేవి తప్పక అడుగుపెడుతుందని అంటారు. అలా వచ్చిన అమ్మవారి మనసు గెలుచుకోవాలంటే అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ తల్లిని పూజిస్తూ ఉండాలి. ముఖ్యంగా ప్రతి శుక్రవారం అమ్మవారిని 'గులాబి' పూలతో అర్చిస్తూ ఉండాలి.
 
అమ్మవారికి గులాబీలు ఎంతో ప్రీతికరమైనవి. ఈ పూలతో ప్రతి శుక్రవారం అమ్మవారిని పూజించడం ఆ తల్లికి ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. సంతృప్తి చెందిన అమ్మవారు తన భక్తులను ఆనందంతో అనుగ్రహిస్తుంది. ఫలితంగా ఆదాయమార్గాలు పెరిగి ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోతాయని పండితులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉభయ గోదావరి జిల్లాలో హడలెత్తిస్తున్న పెద్దపులి

డిజిటల్ అరెస్టులతో భయపెట్టేవారి తాట తీయండి : సీఎం చంద్రబాబు ఆదేశం

యూఎస్-ఇరాన్ యుద్ధం తాత్కాలిక విరమణ ఒప్పందంపై సంతకం పెట్టకుండా లేచెళ్లిపోయిన ట్రంప్, ఏం జరుగుతుంది?

ఇష్టపూర్వకంగా చేసే సె.. క్స్ వర్క్ నేరంకాదు.. కేసులు పెట్టొద్దు : సుప్రీంకోర్టు

క్రైమ్ షోలు చూసి నలుగురిని హత్య చేసి కారులో సజీవదహనం చేసిన కుమారుడు - సహకరించిన తల్లీచెల్లి

అన్నీ చూడండి

లేటెస్ట్

30-05-2026 శనివారం ఫలితాలు - కార్యసాధనకు మరింత శ్రమించాలి.. ఓర్పుతో పనిచేయండి...

శుక్రవారం ఫలితాలు - ఆర్థికంగా విశేష ఫలితాలున్నాయి

28-05-2026 గురువారం ఫలితాలు - ధనం మితంగా ఖర్చు చేయండి

మూడేళ్లకు ఒకసారి వచ్చే పద్మిని ఏకాదశి.. తులసి దళాలతో అర్చన చేస్తే?

27-05-2026 బుధవారం ఫలితాలు- దంపతుల మధ్య అకారణ కలహం

Show comments