Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీ వేంకటేశ్వర స్వామిని వేడుకుంటే చాలు... అన్నీ..?

Webdunia
శనివారం, 17 జనవరి 2015 (15:37 IST)
శ్రీ వేంకటేశ్వరుడు నిత్యకళ్యాణం.. పచ్చతోరణం అనే మాటను నిజం చేస్తుంటాడు. సౌందర్యమంటే శ్రీనివాసుడిదే, సంపదంటే శ్రీనివాసుడిదే, సూర్యభగవానుడితో సమానమైన తేజస్సు ఆయనదే అన్నట్టుగా ఆ స్వామి కనిపిస్తుంటాడు. గర్భాలయం నిండుగా కళకళలాడుతూ ఆయన దర్శనమిస్తూ వుంటే, కష్టాలు చెప్పుకోవడానికి వచ్చిన వాళ్లు సైతం ఆ విషయాన్ని మరిచిపోయి అలాగే చూస్తుండిపోతారు.
 
అలాంటి విశిష్టమైన ఆలయాలలో ఒకటి మనకి 'మిర్యాలగూడెం'లో దర్శనమిస్తుంది. నల్గొండ జిల్లా పరిధిలో గల ఈ క్షేత్రంలో అలమేలుమంగ - పద్మావతీ సమేత వేంకటేశ్వరస్వామి కొలువుదీరి కనిపిస్తుంటాడు.
 
గర్భాలయంలో గల మూలమూర్తి నిలువెత్తు రూపం భక్తులను మంత్రముగ్ధులను చేస్తుంది. గర్భాలయానికి ఇరువైపులా గల ప్రత్యేక మందిరాలలో అమ్మవార్లు కొలువై పూజలందుకుంటూ వుంటారు. ఆలయ ప్రాంగణంలోనే ఓ వైపున హనుమంతుడు ... నాగేంద్రుడు దర్శనమిస్తూ వుంటారు.  
 
ప్రతి శనివారంతో పాటు విశేషమైన పర్వదినాల్లో ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య అధికంగా వుంటుంది. ఎవరు ఎలాంటి కష్టాల్లో వున్నా ఈ వేంకటేశ్వరుడిని వేడుకుంటే చాలట. అనతికాలంలోనే అవన్నీ తొలగిపోతాయనీ, ఆనందకరమైన జీవితం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తుంటారు.

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

సిగ్నల్ లైట్‌కు బురద పూసి రైలు దోపిడీకి యత్నం!!

సింగపూర్‌లో మళ్లీ కోవిడ్ విజృంభణ.. వారం రోజుల్లో 26 వేల మందికి...

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

16-05-2024 గురువారం దినఫలాలు - రాజకీయాలలోని వారికి మెళకువ అవసరం...

15-05-202 బుధవారం దినఫలాలు - డిపాజిట్ల సొమ్ము చేతికందుతుంది...

14-05-202 మంగళవారం దినఫలాలు - సంగీత సాహిత్య సదస్సులలో మంచి గుర్తింపు...

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

Show comments