సాయిబాబా పారాయణ మహత్యం...

పిలిస్తే పలికే దైవం సాయిబాబా. సాయిబాబా పారాయణం భక్తిని ప్రసాదిస్తుంది. షిర్డీ సాయిబాబా గ్రంథాలను పారాయణం చేయడం వల్ల మనసులో చెలరేగే కలతలు, కల్లోలాలు తగ్గుతాయి. సుఖశాంతులు అనుభూతికొస్తాయి. తన భక్తులను క

Webdunia
గురువారం, 31 మే 2018 (12:53 IST)
పిలిస్తే పలికే దైవం సాయిబాబా. సాయిబాబా పారాయణం భక్తిని ప్రసాదిస్తుంది. షిర్డీ సాయిబాబా గ్రంథాలను పారాయణం చేయడం వల్ల మనసులో చెలరేగే కలతలు, కల్లోలాలు తగ్గుతాయి. సుఖశాంతులు అనుభూతికొస్తాయి. తన భక్తులను కంటికి రెప్పలా కాపాడుకుంటారు.


బాబా పూజకు ఎలాంటి ఆడంబరాలు అక్కర్లేదు. తిథి, వార, నక్షత్రాలు చూడనవసరం లేదు. తేదీలతో, దిక్కులతో సంబంధం లేదు. వర్ణ, వర్గాలతో నిమిత్తం లేదు. ఎక్కడివారు, ఏ భాషవారు అని చూడనవసరం లేదు. సాయిబాబా పూజ ఎవరైనా, ఎపుడైనా ప్రారంభించవచ్చు.
 
సాయిబాబా చరిత్ర లీలలు మొదలైన పవిత్ర గ్రంధాలను పారాయణం చేయదలచుకున్నవారు గురువారం నాడు ప్రారంభించి బుధవారం నాటికి ముగించవచ్చు. ఒక సప్తాహంలో పూర్తిచేయలేనివారు రెండు లేదా మూడు వారాలలో పూర్తిచేయవచ్చును. నిత్య పారాయణం కూడా చేయవచ్చును. కానీ పారాయణం చేసేటప్పుడు శ్రద్ధ, భక్తి ముఖ్యం.
 
సాయిబాబా లీలలు పారాయణం చేయాలనుకుంటే గురువారం ప్రారంభించడం శ్రేష్టం. ఎందుకంటే షిర్డీ సాయి బాబాకు ఇష్టమైన రోజు గురువారం. అలాగే బాబాకు ప్రియమైన నైవేద్యం పాలకోవా కనుక పూజలో పాలకోవా నైవేద్యంగా సమర్పించి నలుగురికీ పంచవచ్చును.
 
సాయిబాబా పూజకు ఏ హంగులూ, ఆర్భాటాలూ అవసరం లేదు. ఫలానా సామగ్రి కావాలని, ఫలానా విధంగా పూజ చేయాలని నియమాలు, నిబంధనలు లేవు. సాయి బాబా గ్రంథ పారాయణకు కావలసిదల్లా భక్తిభావన. సాయిబాబాకు భక్తిగా రెండు కాసులు సమర్పించాలి. అందులో మొదటిది నిష్ఠ, రెండోది సబూరి. ఇవి మాత్రమే సాయిబాబా తన భక్తుల నుండి ఆశించేది. 
 
సాయిబాబా గ్రంథాలను పారాయణం చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. అనుకున్న పనులు నిర్విఘ్నంగా నెరవేరుతాయి. సాయిబాబా భక్త సులభుడు. భక్తిగా ప్రార్ధిస్తే మన చెంతనే ఉంటాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Rakul Preet Singh: హైకోర్టును ఆశ్రయించిన రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు

కొవ్వూరులో పెను ప్రమాదం తప్పింది.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది

పరకామణి కేసులో పోలీసులపై క్రిమినల్ కేసు నమోదు చేయండి : హైకోర్టు

పండక్కి ఊరెళుతున్నారా.. ప్రయాణికులకు షాకిచ్చిన ఏపీఎస్ ఆర్టీసీ

వంట చేయకపోతే విడాకులు కావాలా...? కుదరని తేల్చి చెప్పిన హైకోర్టు

అన్నీ చూడండి

లేటెస్ట్

04-01-2026 ఆదివారం ఫలితాలు - మొండి బాకీలు వసూలవుతాయి.. ఖర్చులు సంతృప్తికరం...

సంక్రాంతి గీతల ముగ్గులు- రథం ముగ్గు

03-01-2026 శనివారం ఫలితాలు - ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు...

Betel Leaf: కలలో తమలపాకులు కనిపిస్తే.. ఫలితం ఏంటో తెలుసా?

Heavy Rush: వైకుంఠ ద్వార దర్శనం.. తిరుమలలో పోటెత్తిన జనం

తర్వాతి కథనం
Show comments