శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం...

ఒక వైపున ఆధ్యాత్మిక సంపద, మరోవైపున చారిత్రక వైభవం కలిగిన క్షేత్రాలు విశిష్టమైనవిగా వెలుగొందుతూ ఉంటాయి. అలాంటి ఆధ్యాత్మిక చారిత్రక నేపథ్యం కలిగిన పుణ్యక్షేత్రంగా కడప జిల్లాలో దర్శనమిస్తుంటారు ఆంజనేయస్వ

Webdunia
శనివారం, 4 ఆగస్టు 2018 (12:08 IST)
ఒక వైపున ఆధ్యాత్మిక సంపద, మరోవైపున చారిత్రక వైభవం కలిగిన క్షేత్రాలు విశిష్టమైనవిగా వెలుగందుతూ ఉంటాయి. అలాంటి ఆధ్యాత్మిక చారిత్రక నేపథ్యం కలిగిన పుణ్యక్షేత్రంగా కడప జిల్లాలో దర్శనమిస్తుంటారు ఆంజనేయస్వామివారు. కడప జిల్లాలోని ఈ దివ్యక్షేత్రం భక్తుల హృదయాలపై చెరగని ముద్ర వేస్తుంది. దేవాలయ నిర్మాణం కోసం కేటాయించిన స్థలాలు గతవైభవానికి నిదర్శనమై నిలుస్తుంటాయి.
 
పూర్వం ఇక్కడ హనుమంతుని ఆలయం మాత్రమే ఉండేది. శ్రీ వేంకటేశ్వర స్వామి ఇక్కడ ఆవిర్భవించిన తీరు ఆసక్తికరంగా ఉంటుంది. పవిత్రమైన ఈ ప్రదేశంలో శ్రీ వేంకటేశ్వర స్వామి కూడా ఉంటే బాగుంటుందని భావించిన ఓ భక్తుడు, ఆ స్వామి గురించి అదే పనిగా ధ్యానం చేసేవాడు. ఆ భక్తుని విన్నపం మేరకు లక్ష్మీ సమేతుడై స్వామి ఇక్కడికి ఆవిర్భవించారు.
 
ఆనాటి నుండి లక్ష్మీ వేంకటేశ్వరుడు భక్తులను అనుగ్రహిస్తూ వస్తున్నాడు. శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయ నిర్మాణానికి ముఖ్య పాత్రను పోషించారు. అందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి. గర్భాలయంలో స్వామివారు దివ్యమైన తేజస్సును వెదజల్లుతూ ఉండగా, పద్మావతి అమ్మవారు గోదాదేవి ప్రత్యేక మందిరాలలో దర్శనమిస్తుంటారు.
 
శ్రీ వేంకటేశ్వర స్వామి సైన్యాధిపతి అయిన విష్వక్సేనుల వారు కూడా ఈ ఆలయ పూజలను అందుకుంటుంటారు. తిరుమల బాలాజీకి అనుకున్న మెుక్కులను, వీలునుబట్టి ఈ క్షేత్రంలో చెల్లించుకుంటారు. అంతేకాకుండా ఇక్కడి లక్ష్మీ వేంకటేశ్వర స్వామిని దర్శించడం వలన దారిద్య్రం, దుఃఖం నశించి, సిరిసంపదలు, సంతోషాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బెంగుళూరు మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికలపై సీఎం విజయ్ దృష్టి!

ఎబోలా వైరస్ విజృంభణ : ఆ నాలుగు దేశాలకు వెళ్లవద్దంటున్న భారత్

హర్మోజ్‌ను తెరుస్తాం.. ఆంక్షలు ఎత్తివేయండి : ఇరాన్ సరికొత్త ప్రతిపాదన

జగన్‌.. గత చరిత్ర తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది... బీటెక్ రవి వార్నింగ్

కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచింది - మోడీ వరుస విజయాలకు కాంగ్రెస్ అసమర్థత : ఉదయనిధి స్టాలిన్

అన్నీ చూడండి

లేటెస్ట్

25-05-2026 సోమవారం ఫలితాలు - ఖర్చులు అదుపులో ఉండవు.. ముఖ్యుల కలయిక వీలుపడదు...

24-05-2026 ఆదివారం ఫలితాలు - సంతోషకరమైన వార్త వింటారు

24-05-2026 నుంచి 30-05-2026 వరకు ఫలితాలు - రుణ ఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదు

23-05-2026 శనివారం ఫలితాలు.. దంపతుల మధ్య అకారణ కలహం

Lakshmi Puja: శుక్రవారం, శుక్రపూజ.. లక్ష్మీపూజ చేస్తే?

తర్వాతి కథనం
Show comments