లక్ష్మీదేవి ఎక్కడ నివాసముంటుంది?

Webdunia
గురువారం, 7 ఆగస్టు 2014 (15:50 IST)
లక్ష్మీదేవి ఎక్కడ నివాసముంటుందంటే.. గోవులు, తామరపుష్పాలు, పాడిపంటలు, ఏనుగులు, గుర్రాలు, రత్నాలు, అద్దాలు, శంఖనాదం, ఘంటారావం, హరిహరార్చన, పూజామందిరం, సర్వదేవతలనూ అర్చించే వారి స్వరం, తులసి ఉన్న ప్రదేశం, పూలు, పండ్లతోటలు, మంగళకరమైన వస్తువులు, మంగళవాద్యాలు, దీపకాంతులు, కర్పూర హారతి, చెట్లలోని హరిత వర్ణం, స్నేహం, ఆరోగ్యం, ధర్మబుద్ధి, న్యాయస్థానాలు, శుచి, శుభ్రత, సదాచార పరాయణత, సౌమ్యగుణం, స్త్రీలు ఎటువంటి చీకూచింతా లేకుండా హాయిగా ఉండే ఇండ్లు, బ్రాహ్మణులు, విద్వాంసులు, పెద్దలు, పండితులకు సన్మాన సత్కారాలు జరిగే ప్రదేశాలు, వేదఘోష, సత్వగుణ సంపదలు, క్రమశిక్షణ, కార్యశూరత్వం, సమయపాలనలోనూ మహాలకి నివసిస్తుంది.
 
లక్ష్మీ స్వరూపమైన సంపదలు యేవి?
సాధారణంగా మనం ధనం అంటే డబ్బు ఒక్కటే అనుకుంటాము. అయితే ఆయుష్షు, ఆరోగ్యం, ఐశ్వర్యం, ధైర్యం, స్థ్యైర్యం, విజయం, వీర్యం, అభయం, శౌర్యం, సౌభాగ్యం, సాహసం, విద్య, వివేకం, ధనం, ధాన్యం, సంపద, బంగారం, వెండి, ఆభరణాలు, వస్తువులు, వాహనాలు, ఆయుధాలు, పశువులు, పుత్రపౌత్రాదులు, కీర్తిప్రతిష్ఠలు, సుఖసంతోషాలు మొదలైనవన్నీ సంపదలే. వీటన్నింటికీ అధినేత్రి ఆ తల్లే.ఆమె అనుగ్రహంతోటే సాధ్యం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ -పాకిస్థాన్ కాల్పుల విరమణ వెనుక ఎవరి జోక్యం లేదు : భారత్

ఎంత ఖర్చయినా ఫర్వాలేదు, రైతు పుస్తకాల నుంచి జగన్ ఫోటోను తీసేయండి: సీఎం చంద్రబాబు

ముందు వెళుతున్న వాహనాన్ని ఢీకొన్న బొలెరో వ్యాను... డ్రైవర్ సజీవదహనం

కొత్త సంవత్సర సంబరాలు... మందుబాబులకు ఉచిత రవాణా సేవలు.. ఎక్కడ?

కస్టమర్ల పేరుపై 3 కోట్లు లోన్ తీసుకుని బ్యాంక్ మేనేజర్ పరార్

అన్నీ చూడండి

లేటెస్ట్

28-12-2025 నుంచి 03-01-2026 వరకు మీ వార రాశిఫలాలు

28-12-2025 ఆదివారం ఫలితాలు - శ్రమించినా ఫలితం శూన్యం...

2026-2027: శ్రీ పరాభవ నామ సంవత్సర ఫలితాలు - మీనరాశికి ఆదాయం-14

2026-2027: శ్రీ పరాభవ నామ సంవత్సర ఫలితాలు- కుంభరాశికి సంవత్సరం శుభ ఫలితాలు

2026-27: శ్రీ పరాభవ నామ సంవత్సర ఫలితాలు - మకరరాశికి ఈ సంవత్సరం యోగదాయకం

Show comments