లక్ష్మీ గవ్వలను పూజా మందిరంలో ఉంచి పూజిస్తే?

Webdunia
గురువారం, 24 జులై 2014 (17:25 IST)
గవ్వలకు చాలా ప్రాధాన్యత ఉండేది. గవ్వలు లేనివాళ్ళు నిరుపేదలు. ఇప్పటికీ బొత్తిగా డబ్బులేదని చెప్పడానికి చిల్లి గవ్వ కూడా లేదు అనడం ఎన్నోసార్లు వినే ఉంటాం. అందుచేత గవ్వలు పవిత్రమైనవి, లక్ష్మితో సమానమైనవి. గవ్వల్లో పసుపు రంగులో మెరిసే గవ్వల్ని లక్ష్మీ గవ్వలు అంటారు. లక్ష్మీ గవ్వలు, లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావించి పూజిస్తారు.
 
అసలు లక్ష్మీ గవ్వలు ఎక్కడివి, ఎలా వచ్చాయి అనే సందేహం కలుగుతోందా? అయితే ఈ స్టోరీ చదవండి. క్షీర సాగర మధనం సమయంలో అమృతం, హాలాహలంతో పాటు శంఖాలు, లక్ష్మీ గవ్వలు కూడా ఉద్భవించాయట. శంఖాన్ని లక్ష్మీదేవి సోదరునిగా, గవ్వను సోదరిగా భావిస్తారు. ఆ విధంగా లక్ష్మీ గవ్వలు, లక్ష్మీదేవికి ప్రతిరూపమయ్యాయి.
 
గవ్వను లక్ష్మీదేవి చెల్లెలిగా భావించేవారు కనుక, నాణేలు, రూపాయలు పుట్టకముందు వాటినే కాసులుగా వాడేవారు. ఆర్ధిక లావాదేవీల్లో గవ్వలనే మారకంగా వినియోగించేవారు. అంటే, ఒకప్పుడు డబ్బుకు మారుగా గవ్వలే ఉండేవన్నమాట. ఎవరి దగ్గర ఎక్కువ గవ్వలు ఉంటే వారే ధనవంతులు.
 
లక్ష్మీ గవ్వలు కనుక ఇంట్లో ఉంటే సంపదలు వచ్చిపడతాయి. ధనధాన్యాలు వృద్ది చెందుతాయి. అంటే, గవ్వలకు, లక్ష్మీదేవికి అవినాభావ సంబంధం ఉంది. ఎక్కడ లక్ష్మీ గవ్వలు ఉంటాయో, అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. అందుకే, మన పూర్వీకులు గవ్వలకు అంత ప్రాధాన్యత ఇచ్చారు.
 
అందుకే పూజామందిరంలో లక్ష్మీదేవి విగ్రహంతో పాటు శంఖాన్ని, లక్ష్మీ గవ్వలను కూడా పీఠంపై ఉంచి ప్రార్ధించడం ఆనవాయితీ. అందుచేత లక్ష్మీ గవ్వలను సంపాదించి పూజామందిరంలో పూజించే వారికి సిరిసంపదలను వెల్లివిరుస్తాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

నేను సింగిల్ లార్జెస్ట్ పార్టీ సభ్యుడిని, కానీ ప్రతిపక్షంలో వున్నా: నాటి లీడర్ ప్రమోద్ మహాజన్, వీడియో

విజయ్ సీఎం అయినా దిగిపోవాల్సిందే, త్రిష లేకుండా వుంటే విజయ్ జాతకం వేరే: వేణుస్వామి

మా పార్టీ మద్దతు టీవీకే విజయ్‌కు లేదు, ఎమ్మెల్యే సంతకం ఫోర్జరీ చేసారు: దినకరన్

విజయ్‌కు చుక్కలు చూపిస్తున్న వీసీకే పార్టీ, డిప్యూటీ సీఎం పోస్ట్ డిమాండ్

వామపక్షం అందించారు, ఇక తమిళనాడు సీఎంగా TVK విజయ్

అన్నీ చూడండి

లేటెస్ట్

మనిషి లోపల వున్న శత్రువులు అరిషడ్వర్గాలు, వీటిని జయించడం ఎలా?

మీరేమైనా దేశ ప్రధాన పురోహితులా? మీకు వేరే పనేమీ లేదా? సుప్రీం కోర్టు ఫైర్

05-05-2026 మంగళవారం ఫలితాలు - గిట్టని వ్యక్తులతో జాగ్రత్త

04-05-2026 సోమవారం ఫలితాలు - బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి...

03-05-2026 ఆదివారం ఫలితాలు - వస్త్రప్రాప్తి - ధనలాభం.. ఖర్చులు సామాన్యం....

Show comments