Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతీ శనివారం నాడు ఇలా చేస్తే..?

Webdunia
శుక్రవారం, 15 ఫిబ్రవరి 2019 (14:30 IST)
ఆంజనేయ స్వామిని ఎప్పుడు, ఎలా పూజించాలో తెలుసుకోవాలంటే.. ఈ కథనం చదవాలి. ఆరోగ్యానికి, శారీరక దృఢత్వానికి, స్థిరత్వానికి చిహ్న మూర్తి హనుమంతుడు. అలాంటి ఆంజనేయుడిని ప్రతిరోజూ పూజిస్తే శుభ ఫలితాలుంటాయి. అలానే వారాల్లో శనివారం, మాసంలో వచ్చే అమావాస్య నాడు హనుమంతుడిని కొలిచే వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.
 
హనుమంతుడిని పూజించడానికి స్వామివారి పటం ఎంచుకోండి. పువ్వులు, పండ్లు, బియ్యం, దీపం, మిఠాయిలు, మట్టికండ అవసరం. శనివారం రోజున గోధుమలు, పప్పు, బెల్లం, నెయ్యి, ఉప్పు, పసుపుకొమ్ములు, బంగాళాదుంపలు, ఏదైనా ఆకుపచ్చని కూరగాయల్ని బ్రాహ్మణులకు దానం చేయాలి.
 
హనుమంతుడి పటాన్ని లేదా విగ్రహాన్ని ఓ ప్రదేశంలో ఉంచి అలంకరించాలి. దీపం వెలిగించి పువ్వులు, బియ్యం సమర్పించి పూజ చేయాలి. ఇకపోతే.. హనుమంతుడికి సిందూరం అంటే మహాప్రీతి. సీతమ్మ తల్లిని నుదుటిపై సిందూరం పెట్టుకునే సంగతిని ఆరాతీయగా, శ్రీరాముడి అనుగ్రహం కోసమని సమాధానమిచ్చిందని, శ్రీరాముడి కోసం హనుమంతుడు శరీరం అంతా సిందూరం అద్దుకున్నాడని చెప్తారు.
 
అనేకమంది భక్తులు బ్రాహ్మణులకు సిందూరం దానం చేస్తారు. హనుమంతుడిని పూజించేటప్పుడు హనుమాన్ చాలీసా, సుందరకాండ పారాయణం చేయడం మంచిది. శనివారం రోజున మిఠాయిలను నైవేద్యం పెడితే శుభం కలుగుతుందని విశ్వాసం. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

తర్వాతి కథనం
Show comments