Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంగళవారం అమావాస్య... హనుమంతుని పూజిస్తే...

నెలలో ప్రతి అమావాస్య రోజున హనుమంతునిని ప్రార్థిస్తే.. సకల సంపదలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. రుద్రాంశ సంభూతుడైన ఆంజనేయుడిని సింధూరంతో అర్చించడం ద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని ప్రతీతి. ముఖ్యంగా హనుమంతుని జయంతిని చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు వైభవ

Webdunia
సోమవారం, 28 నవంబరు 2016 (19:15 IST)
నెలలో ప్రతి అమావాస్య రోజున హనుమంతునిని ప్రార్థిస్తే.. సకల సంపదలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. రుద్రాంశ సంభూతుడైన ఆంజనేయుడిని సింధూరంతో అర్చించడం ద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని ప్రతీతి. ముఖ్యంగా హనుమంతుని జయంతిని చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు వైభవంగా జరుపుకుంటారు. శ్రీరామనవమితో పాటు కొందరు హనుమంత జయంతిని జరుపుకుంటారు. 
 
ఈ పండుగను జరుపుకోలేని వారు ప్రతి మాసంలో వచ్చే అమావాస్య రోజున నిష్టతో ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించుకోవడం ద్వారా అనుకున్న కార్యాలను దిగ్విజయంగా పూర్తవుతాయని విశ్వాసం. అందుచేత అమావాస్య సాయంత్రం పూట మహిళలు, పురుషులు ఆంజనేయ స్వామికి నేతితో దీపమెలిగించి.. హనుమంతుడి ఆలయాన్ని 18 సార్లు ప్రదక్షిణ చేయడం ద్వారా మనోధైర్యం, సకలసంపదలు, ఉన్నత పదవులు లభిస్తాయని పండితులు అంటున్నారు. 
 
"అసాధ్య సాధక స్వామిన్
అసాధ్యమ్ తవకిన్ వధ 
రామదూత కృపా సింథో 
మత్‌కార్యమ్ సాధయ ప్రభో"- అనే మంత్రాన్ని 9 సార్లు పఠించి.. కర్పూర హారతులు సమర్పించుకున్న వారికి ఈతిబాధలు, గ్రహదోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.

EVMను ధ్వంసం చేసిన వైసిపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి - video

అమలాపురం మహిళ కడుపులో 570 రాళ్లు.. అవాక్కైన వైద్యులు!!

జూన్ 4న వచ్చే ఫలితాలతో జగన్ మైండ్ బ్లాంక్ అవుతుంది : ప్రశాంత్ కిషోర్

జూన్ 8వ తేదీ నుంచి చేప ప్రసాదం పంపిణీ

బోలారం ఆస్పత్రి.. బైకులో కూలిన చెట్టు.. వ్యక్తి మృతి

19-05-2004 నుంచి 25-05-2024 వరకు మీ వార రాశిఫలాలు

అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయా.. మట్టపల్లి నరసింహుడిని దర్శించుకోండి..

18-05-202 శనివారం దినఫలాలు - దంపతుల మధ్య పరస్పర అవగాహన సంతృప్తి...

17-05-2024 శుక్రవారం దినఫలాలు - అభివృద్ధికై చేయు ప్రయత్నాలు నెమ్మదిగా...

రాగి ఆభరణాలు ధరిస్తే.. సూర్య గ్రహ, వాస్తు దోషాలు పరార్

తర్వాతి కథనం
Show comments