Webdunia - Bharat's app for daily news and videos

Install App

"అన్నపూర్ణాష్టకం"తో అమ్మవారిని ప్రార్థించండి

Webdunia
నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ
నిర్దూతాఖిల ఘోరపాపనికరీ ప్రత్యక్షమాహేశ్వరీ,
ప్రాలేయాచల వంశపావనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ.

నానారత్న విచిత్రభూషణకరీ హేమాంబరాడంబరీ
ముక్తాహార విడంబమాన విలసద్వక్షోజ కుంభాంతరీ
కాశీరాగరు వాసితాంగ రుచిరా (కబరీ) కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ.

యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైకనిష్ఠాకరీ
చంద్రార్కానల భాసమానలహరీ త్రైలోక్యరక్షాకరీ,
సర్యైశ్వర్యకరీ తపఃఫలకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ.

కైలాసాచల కందరాలయకరీ గౌరీ హ్యుమా శాంకరీ
కౌమారీ నిగమార్థగోచరకరీ హ్యోంకారబీజాక్షరీ,
మోక్షద్వార కవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ.

దృశ్యాదృశ్యవిభూతి పావన(వాహన)కరీ బ్రహ్మాండభాండోదరీ
లీలానాటకసూత్రఖేలనకరీ విఙ్ఞానదీపాంకురీ,
శ్రీవిశ్వేశమనః ప్రమోదనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ.

ఆదిక్షాంతసమస్తవర్ణనికరీ శంభుప్రియే శాంకరీ
కాశ్మీరే త్రిపురేశ్వరీ త్రినయని విశ్వేశ్వరీ శ్రీధరీ,
స్వర్గద్వారకవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ.

ఉర్వీసర్వజయేశ్వరీ జయకరీ మాతా కృపాసాగరీ
నారీ నీలసమానకుంతలధరీ నిత్యాన్నదానేశ్వరీ,
సాక్షాన్మోక్షకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ.

దేవీ సర్వవిచిత్రరత్నరచితా దాక్షాయణీ సుందరీ
వామా స్వాదుపయోధరప్రియకరీ సౌభాగ్యమాహేశ్వరీ,
భక్తాభీష్టకరీ దశా(సదా)శుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ.

చంద్రార్కానలకోటికోటిసదృశా చంద్రాంశుబింబాధరీ
చంద్రార్కాగ్ని సమానకుండలధరీ చంద్రార్కవర్ణేశ్వరీ,
మాలాపుస్తకపాశసాం(మం)కుశధరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ.

క్షత్రత్రాణకరీ మహాభయకరీ మాతా కృపాసాగరీ
సాక్షన్మోక్షకరీ(సర్వానందకరీ) సదాశివకరీ విశ్వేశ్వరీ శ్రీధరీ
దక్షాక్రందకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ.

అన్నపూర్ణే! సదాపూర్ణే! శంకరప్రాణవల్లభే!
ఙ్ఞానవైరాగ్యసిద్థ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి!

మాతా చ పార్వతీ దేవీ పితా దేవో మహేశ్వరః,
బాంధవాః శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం.

ఇత్యన్నపూర్ణాష్టకం సంపూర్ణం.

ఈ అన్నపూర్ణ అష్టకంతో అమ్మవారిని ప్రతిరోజు స్తుతించే వారికి సకల సంపదలతో పాటు భోగభాగ్యాలు ప్రాప్తిస్తాయని పండితులు అంటున్నారు. అంతేగాకుండా ఈ స్తోత్రమును పఠించేవారి గృహమందు ఎల్లప్పుడు సిరిసంపదలు వెల్లివిరుస్తాయని చెబుతున్నారు.

ఇంకా ప్రతి శుక్రవారం మహిళలు శుచిగా స్నానమాచరించి పై మంత్రముతో అమ్మవారిని స్తుతించి, కర్పూర హారతులు సమర్పిస్తే ఆ ఇంట్లో అన్నపూర్ణమ్మ తల్లి కొలువుంటుందని విశ్వాసం. అంతేగాకుండా.. ఆ గృహంలో దారిద్యము తొలగిపోయి, సుఖసంతోషాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

IMD News: హైదరాబాద్-తెలంగాణ జిల్లాలకు గుడ్ న్యూస్.. ఉష్ణోగ్రతలు తగ్గిపోతాయట

సింధు జలాలను ఆపేస్తారు సరే, ఆ నీటిని ఎటు పంపుతారు?: అసదుద్దీన్ ఓవైసి ప్రశ్న

పహల్గాం దాడికి ఎలాంటి ప్రతీకారం తీర్చుకున్నా సంపూర్ణ మద్దతు : రాహుల్ గాంధీ

పహల్గాం దాడితో ఆగిన పెళ్లి - భారత భూభాగంలో వరుడు .. పాకిస్థాన్ గ్రామంలో వధువు

Asaduddin Owaisi: పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా హైదరాబాదులో ముస్లింల నిరసన (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

Akshaya Tritiya 2025: అక్షయ తృతీయ నాడు ఈ రాశుల్లో అరుదైన యోగాలు.. తెలిస్తే ఎగిరి గంతేస్తారు!

23-04-2025 బుధవారం ఫలితాలు - కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి...

మంగళవారం కుమార స్వామి పూజతో కలిగే ఫలితం ఏంటి?

22-04- 2025 మంగళవారం ఫలితాలు - కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి...

21-04-05 సోమవారం రాశి ఫలాలు - సన్మాన, సంస్మరణ సభల్లో పాల్గొంటారు...

Show comments