Webdunia - Bharat's app for daily news and videos

Install App

డాక్టర్ కుమార్తె వివాహం: అతిథులంతా ఉత్తచేతులతోనే..

Webdunia
మంగళవారం, 2 డిశెంబరు 2014 (14:34 IST)
గుజరాత్ వడోదరలోని డాక్టర్ ఆర్.బి.భిసానియా వెరీ పాపులర్. ఇటీవలే ఆయన కుమార్తె వివాహం జరిగింది. పెళ్లికి వచ్చిన అతిథులంతా ఉత్తచేతులతోనే వచ్చారు. గిఫ్టులేమీ పట్టకెళ్లలేదు. కానీ, వారు వధూవరులను ఆశీర్వదించిన తర్వాత పెళ్లికి వెళ్లిన వారు  ఏం చేశారో తెలుసా?... రక్తదానం చేశారు.
 
దాంతోపాటే, అవయవదానం ప్రతిజ్ఞ చేశారు. ఆ విధంగా, మానవత్వాన్నే బహుమతులుగా ఇచ్చారు. దీనికంతటికీ వధువు తండ్రి డాక్టర్ భిసానియానే కారణం. ఆయన అతిథులందరికీ ముందే చెప్పారు... గిఫ్టులు ఏవీ వద్దని, చేయదలిస్తే రక్తదానం, అవయవదానం ప్రతిజ్ఞ చేయమని విజ్ఞప్తి చేశారు. 
 
దీనిపై డాక్టర్ భిసానియా మాట్లాడుతూ, రక్తదానం, అవయవదానంపై చైతన్యం తీసుకువచ్చేందుకు ఈ ఆలోచన చేశామని చెప్పారు. తన కుమార్తె డాక్టర్ ధ్వని, అల్లుడు డాక్టర్ జయ్ పాండ్య కూడా దానానికి ముందుకువచ్చారని పేర్కొన్నారు. 
 
కాగా, ఈ వివాహంలో ముస్లింలు కూడా రక్తదానం చేసి మతసామరస్యాన్ని చాటారు. నగర శివార్లలో జరిగిన ఈ వివాహంలో 370 మంది వరకు రక్తదానం చేశారట.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

జనసేన సంస్థాగత బలోపేతం కోసం త్రిశూల్ వ్యూహం : పవన్ కళ్యాణ్

బీహార్‌లో ఒక్క ఓటు కూడా చోరీ కానివ్వం : రాహుల్ గాంధీ

యూపీఎస్పీ అభ్యర్థుల కోసం ప్రతిభా సేతు పోర్టల్

ఏలూరు జిల్లాలో కానిస్టేబుల్‌ అదృశ్యం.. ఫోన్‌ సిగ్నల్‌ కట్‌!

సోషల్ మీడియాలో బ్లాక్ చేసిందనే కోపంతో అమ్మాయి గొంతు కోసిన ఉన్మాది

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మంచి విషయం గురించి చెప్పినా విమర్శలు తప్పట్లేదు : హీరో నాని

'ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు'... రజనీకాంత్

సినీ నిర్మాణ కార్మికులకు వేతనాలు పెంచిన తెలుగు ఫిల్మ్ చాంబర్

Balakrishna: బాలకృష్ణకు సత్కారం.. సీఎం సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం- ప్రముఖుల కితాబు (video)

లోకేష్ కనగరాజ్ హీరోగా రచితా రామ్ నాయిక గా చిత్రం..

Show comments