Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాట్లాడటం ఒక కళ-దాన్ని పెంపొందించుకోవాలి!

Webdunia
బుధవారం, 27 జూన్ 2012 (17:31 IST)
FILE
మీరు మాట్లాడటమే కాదు. ఎదుటివారు చెప్పేవి కూడా వినాలి. విసుగు కలిగించినా, మధ్యలో వారు చెప్పేదాన్ని ఆపండి అనవద్దు. ఎంతటి ఉద్రేక పూరిత విషయమైనా కంగారుగా చెప్పవద్దు. వీలైనంత ప్రశాంతంగా చెప్పండి. ఎదుటివారు మీకు తెలియని కొత్త విషయాలు చెబుతున్నారేమో గమనించండి.

మీ కంఠస్వరం మొరటుగా వుంటే మృదువుగా మాట్లాడటానికి ప్రయత్నించి అలవాటు చేసుకోండి. మీకు యాసగా మాట్లాడటం ఊత పదాలు మాట్లాడటం అలవాటు వుంటే క్రమంగా తగ్గించుకోవడానికి ప్రయత్నించండి.

ఎదుటివారు ఇష్టపడని అంశాలను మాట్లాడకూడదు. ఎదుటివారికి అర్థం కాని విషయాలను మాట్లాడవద్దు. మీరేం చెప్పదలుచుకున్నారో స్పష్టంగా అర్థమయ్యేటట్లు వివరించండి. ఎదుటివారు బాధపడేటట్లుగా ప్రత్యక్షంగా అంశాన్ని ప్రస్తావించవద్దు. ముందుగా ఆలోచించకుండా అనవసరమైన వాదనకు దిగవద్దు.

ఎవరి గురించైనా విమర్శించేటప్పుడు ఆ సంభాషణ నోట్లో నుంచి బయటకు రాకుండా కనీసం పది నిమిషాలు గడువిచ్చి మాట్లాడండి. ఇతరుల అభిరుచులను, వారి ప్రవర్తనను మరింత నిశింతంగా పరిశీలించండి. మీరు కొంత సేపు మాట్లాడిన తర్వాత ఎదుటివారు కూడా మాట్లాడటానికి అవకాశం ఇవ్వండి. ఎదుటివారికి ఆసక్తి కలిగించే విషయాలపై ఎక్కువగా మాట్లాడండి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Three Capitals: 2029 తర్వాత తాడేపల్లి నుంచే జగన్ కార్యకలపాలు- సజ్జల మాటల అర్థం ఏంటి?

India First AI Village: భారతదేశంలోనే మొట్టమొదటి ఏఐ గ్రామం ఎక్కడుందో తెలుసా?

86 శాతం పనులు పూర్తి చేసుకున్న భోగాపురం ఎయిర్ పోర్ట్-రామ్మోహన్ నాయుడు

Amaravati: అమరావతిలో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో నోవోటెల్ హోటల్

శ్మశానవాటిక లోపల ఓ మహిళ సెక్స్ రాకెట్ నడిపింది.. చివరికి?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Tej: పేరెంట్స్‌తో విషయాలు పంచుకునేలా పిల్లలుండాలి - సాయి దుర్గ తేజ్

విశ్వప్రసాద్, డైరెక్టర్ కార్తీక్ రెండు పిల్లర్ లా మిరాయ్ రూపొందించారు : తేజ సజ్జా

Kantara 1: రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 కోసం సాంగ్ రికార్డ్ చేసిన దిల్‌జిత్

Komati reddy: సినెటేరియా ఫిలిం ఫెస్టివల్ వెబ్ సైట్ ప్రారంభించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Manoj: నన్నే కాదు నా కుటుంబాన్ని నిలబెట్టి ఆయనే : మంచు మనోజ్

Show comments