బలహీనత గురుంచి ఆలోచిస్తే ఇంకా బలహీనులవుతారు

Webdunia
శుక్రవారం, 14 సెప్టెంబరు 2012 (20:50 IST)
WD
మీరు దేనిని గురించి ఆలోచిస్తే అదే విధంగా తయారవుతారు. బలహీనతను గురించి ఆలోచిస్తే బలహీనులుగా తయారవుతారు. బాలాన్ని గురించి ఆలోచిస్తే బలవంతులుగా తయారవుతారు. కానీ బలాన్ని గురించి ఆలోచించాలంటే అందుకు తగినవిధంగా నిరంతరం మనకు బలాన్ని గుర్తుచేస్తూ, ఆ బలానికి చిహ్నమైన ఒక ఆదర్శం మనకు అవసరం.

ఒక ఆదర్శాన్ని ఎదురుగా వుంచుకొని దానిని అనుసరించేటపుడు మనం తప్పు చేసేందుకు అవకాశం తక్కువ. ఆ ఆదర్శనం మనకు అందనంత ఎత్తులో, చేరుకోలేనంత దూరంలో ఉండవచ్చుగాక. కానీ దానిని తప్పక పొంది తీరాలని మనం అనుకోవాలి. నిజానికి మనం ఎంచుకునే ఆదర్శం అయివుండాలి. అటువంటి ఆదర్శాన్ని మాత్రమే వ్యక్తులు. సమాజం తమ ముందు వుంచుకోవాలి.

దురదృష్టవశాత్తు అధిక శాతం మంది మనుష్యులు తమ తమ జీవితాల్లో అసలు ఎటువంటి ఆదర్శాన్ని ఏర్పరుచుకోకుండానే చీకటిలో తడుముకుంటూ జీవితమంతా గడుపుతుంటారు.

జీవితంలో ఏదో ఒక ఆదర్శాన్ని తన ముందు వుంచుకుని దానిని సాధించాలని ఆరాటపడే వ్యక్తి, తపనపడే వ్యక్తి, వెయ్యి తప్పులు చేస్తే, అసలు ఆదర్శమే లేకుండా జీవితాన్ని గడిపే వ్యక్తి యాభై వేల తప్పులు చేస్తాడు. కాబట్టి ఏదో ఒక ఆదర్శాన్ని కలిగి వుంచటమే మేలు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పరకామణిలో తప్పు చేసాను, నేను చేసింది మహా పాపం: వీడియోలో రవి కుమార్ కన్నీటి పర్యంతం

Jogi Ramesh: లిక్కర్ కేసు.. జోగి రమేష్‌పై ఛార్జీషీట్ దాఖలు చేసిన సిట్

అందుకే నేను చెప్పేది, పవన్ సీఎం అయ్యే వ్యక్తి, జాగ్రత్తగా మాట్లాడాలి: ఉండవల్లి అరుణ్ కుమార్

బాబాయ్ హత్యే జగన్‌కు చిన్న విషయం, ఇక పరకామణి చోరీ ఓ లెక్కనా: సీఎం చంద్రబాబు

AI దుర్వినియోగం, పాకిస్తాన్ పార్లమెంట్ లోకి దూసుకొచ్చిన గాడిద, కిందపడ్డ సభ్యులు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

ఘంటసాల ది గ్రేట్ మూవీ మరో శంకరాభరణం అవుతుందన్న ప్రముఖులు

నేను నమ్మితే షూటింగ్ కు కూడా ఎప్పుడో గానీ వెళ్లను : నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్

Akhil Akkineni : ప్రశాంత్ నీల్ తో అఖిల్ అక్కినేని చిత్రం ?

Show comments