Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లలు మొగ్గల్లాంటి వారు

Webdunia
పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించే తల్లిదండ్రులు వారిని పూలకన్నా జాగ్రత్తగా చూసుకోవాలి. కాని ఆదినుంచే పిల్లలపట్ల వివక్షత ప్రదర్శిస్తే వారి ఎదుగుదలలో పెద్దగా మార్పులుండవని మానసిక శాస్త్రజ్ఞలు అంటున్నారు. వారిలో సామాజిక భద్రత కరువవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం నేటి సమాజంలోని పిల్లలు మానసికమైన అనారోగ్యాలబారిన పడుతున్నారని లండన్‌కు చెందిన ప్రముఖ మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞుడు డాక్టర్. సేరీ పావర్ అన్నారు. పిల్లల పెంపకం బాధ్యత కేవలం తల్లిదేనని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇది చాలా తప్పు అని పిల్లల పెంపకంలో తల్లిదండ్రులిరువురుకూడా బాధ్యులేనని ఆయన అభిప్రాయపడ్డారు.

తల్లిదండ్రులు చిన్నపిల్లల మానసిక పరిస్థితిపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలి. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లలపై చూపే ప్రేమే వారి మానసిక పరిస్థితిపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. కాబట్టి వారితో ఎల్లప్పుడూ ప్రేమతో వ్యవహరిస్తూ, వారికి కావలసిన, అవసరమైన విషయాలగురించి వివరించాలంటున్నారు మానసిక వైద్య నిపుణులు.

తల్లిదండ్రులు పిల్లల పెంపకంలో వారికి ప్రేమ పంచడంతోపాటు సామాజికపరిస్థితిపైకూడా అవగాహన కల్పించగలిగితే అలాంటి పిల్లలు మానసిక పరమైన జబ్బులబారిన పడరని నిపుణులు సూచిస్తున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పవన్ కల్యాణ్‌ను డిప్యూటీ సీఎం నుంచి తొలగిస్తే ఎట్లుంటుంది? (Video)

Republic Day: గణతంత్ర దినోత్సవం.. ఆగస్టు 15.. జెండా ఆవిష్కరణలో తేడా ఏంటంటే? (video)

Mumbai crime: 75ఏళ్ల వృద్ధురాలిపై 20 ఏళ్ల వ్యక్తి అత్యాచారం.. ఇంట్లోకి చొరబడి?

YS Sharmila: జగన్ బీజేపీ దత్తపుత్రుడు.. ఇకనైనా విజయసాయి నిజాలు చెప్పాలి.. షర్మిల

DJ Tillu Song: DJ టిల్లు పాటకు స్టెప్పులేసిన మంత్రి సీతక్క.. వీడియో వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Trisha : త్రిష సంచలనం నిర్ణయం.. సినిమాలను పక్కనబెట్టి విజయ్‌తో పొలిటికల్ జర్నీ?

టికెట్ రేట్లు పెంచడంకంటే కంటెంట్ చిత్రాలు తీయండి : కోమటిరెడ్డి వెంకటరెడ్డి

కానిస్టేబుల్స్ అంటే నాకు చాలా ఇష్టం : కమీషనర్ సి.వి.ఆనంద్

సంబరాల ఏటిగట్టు సెట్ లో సాయిదుర్గ తేజ్ ఫ్యాన్స్ కు ఏంచెప్పారో తెలుసా

శివరాత్రికి ప్రజ్వల్ దేవరాజ్ రాక్షస సిద్ధమైంది

Show comments