Webdunia - Bharat's app for daily news and videos

Install App

పని ఒత్తిడి నుంచి బయటపడటం ఎలా..!

Webdunia
శనివారం, 1 నవంబరు 2008 (05:22 IST)
ఇటు కెరీర్‌లోనూ అటు ఇంటి పనులలోనూ పని భారంతో సతమతమవుతున్న మహిళలు తీవ్రమైన ఒత్తిళ్లకు గురవుతున్నారనేది నిజం. ఇలా నిత్య జీవితంలో ఎదుర్కొనే ఎదుర్కొనే ఇబ్బందులు, పనిభారం వల్ల టెన్షన్ కలగటం, దాంతో నలుగురిలో మెలిగే తీరు మారిపోవడం.. ఇవి మరింత టెన్షన్‌కు దారితీయడం.

ఏదేమైనా ఒత్తిడి మనందరి జీవితంలో భాగం. ఒత్తిడినుంచి బయటపడేందుకు ప్రయత్నపూర్వకంగా మార్గాలు వెతికితే తప్ప బయటపడలేం. ఒత్తిడిని భరించడానికి మనస్తత్వ నిపుణుల వద్దకు పోవడం ఒక పద్ధతయితే ఇంట్లో మనకు అందుబాటులో ఉన్న వాటి సాయం తీసుకోవడం మరో మార్గం. అదేంటో చూద్దామా..

ఏ మనిషయినా శారీకరంగా ఉపశమనం పొందితే మానసికంగా కూడా ప్రశాంతంగా ఉంటారు. త్వరత్వరగా, వేగంగా, ఆదుర్దాగా మొదలు పెట్టి ఉద్రక్తంగానే పనులు ముగించే చోట ఒత్తిడి తను తోడున్నానని పిలవకున్నా వచ్చి మనలో దూరుతుంది. అందుకే వీలైనంత వరకు ప్రతిపనినీ కంగారు పడకుండా తాపీగా ముగించే అలవాటు చేసుకోవాలి.

శ్వాస బలంగా తీసుకోవడం వల్ల మనసులో ఒత్తిడి మటుమాయమవుతుంది. పనిలో పనిగా యోగ ధ్యానం అలవాటు చేసుకుంటే ఏ రకమైన టెన్షనూ ఉండదు. మనసులో భక్తి భావం ఉండి దైవ ప్రార్థన చేస్తే కూడా ఒత్తిడి ఓ మేరకు తగ్గుతుందని నిపుణుల ఉవాచ.
నింపాదితనం... ఒత్తిడి...
  జీవితంలో నింపాదితనం పోయి వేగం అడుగు పెట్టిన తర్వాతే ఒత్తిడి కూడా ఉరుకులు పరుగులు పెడుతూ వచ్చేసింది. మనం దేన్ని కోల్పోయామో దాన్ని తిరిగి తీసుకోవడానికి ప్రయత్నించడమే ఒత్తిడిని జయించే మంచి మార్గమవుతుంది...      


మనసు ఆహ్లాదంగా ఉంటే అన్ని రకాల ఒత్తిళ్లు మాయమవుతాయి. మరి మీకు గతంలో బాగా నచ్చి మరిచిపోయిన, పనుల ఒత్తిడిలో వదిలివేసిన హాబీలను మళ్లీ ఆరంభించి చూడండి. నచ్చిన పుస్తకాలు చదవటం, కుట్లు, అల్లికలు, తోటపని, పెయింటింగ్, వంట, సంగీతం, ఈత వంటి పనులను మళ్లీ మొదలెట్టండి. ఒత్తిడి మటుమాయం మరి...

తిండి పద్ధతులకు సంబంధించి చూస్తే హడావుడిగా కాకుండా ఆహారాన్ని తాపీగా, మనసులో ఆస్వాదిస్తూ తినడం మొదలెట్టండి. తిన్నగా నిటారుగా నడవడం కూర్చోవడం వంటి అలవాట్లు కూడా మనలోని మూడీనెస్‌ను పోగొడతాయి మరి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

విశాఖ - హైదరాబాద్ వందే భారత్ ప్రయాణికులకు శుభవార్త!!

క్రీడాకారిణిపై 62 మంది అత్యాచారం ... కోచ్‍‌ - సహ ఆటగాళ్ళు కూడా...

కార్చిచ్చులో కాలిపోయిన hollywood సెలబ్రిటీల ఆస్తులు, పదివేల ఇళ్లకు పైగా బుగ్గి (video)

Rahul Gandhi: తెలంగాణలో జనవరి 27న మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ పర్యటన

బోయ్‌ఫ్రెండ్ కష్టాల్లో వున్నాడని భర్త డబ్బును ట్రాన్స్‌ఫర్ చేసింది... ఆ తర్వాత? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్ద నటులతో నటించా, ఆత్మహత్య చేసుకునే స్థితిలో వున్నా: పావలా శ్యామల (video)

ది రైజ్ ఆఫ్ అశోక నుంచి సతీష్ నీనాసం ఫస్ట్ లుక్

టెక్నాలజీ కీలకపాత్రతో నూతన చిత్రం షూటింగ్

సంక్రాంతికి వస్తున్నాం అందరూ ఎంజాయ్ చేస్తారు: వెంకటేష్

తెలంగాణలో కల్లు, మటన్: తెలంగాణ కల్చర్‌ను అవమానిస్తానా: దిల్ రాజు (video)

Show comments