Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీవన విధానంపై డిప్రెషన్ ప్రభావం

Webdunia
బుధవారం, 6 ఫిబ్రవరి 2008 (19:38 IST)
విరామం ఎరుగని జీవన పయనంలో అనేక రకాలైన ఒత్తిళ్లకు ప్రజలు లోనవుతున్నారు. తమ రోజువారీ జీవన ప్రయాణంలో వివిధ సమస్యలను ఎదుర్కొంటున్న వారే.. ఇలాంటి ఒత్తిడులకు గురవుతున్నారు. శ్రమ అధికమవ్వడంతో పాటు ఏదో సాధించాలనే తపన ఒక్కోసారి మానసిక స్థిమితం లేకుండా చేయడం, ఏదో జరిగిపోతున్నట్లు అనిపించడం, ఎంత ప్రయత్నించినా అందులోంచి బయటికి రాలేకపోతున్నట్లుండటం, దీనికి తోడు ఆత్మన్యూనతా భావన, శారీరక సమస్యలు మరింత దిగజార్చుతాయి. ఇలాంటి పరిస్థితినే డిప్రెషన్ అని చెప్పవచ్చు.

కొన్ని రకాల లక్షణాలను అంచనా వేసి లక్షణాల తీవ్రతను బట్టి డిప్రెషన్‌ను గుర్తించవచ్చు. అలాగే డిప్రెషన్ ఏ స్థాయిలో ఉందో కూడా తెలుసుకోవచ్చు. ఉదాహరణకు నీరసం, చికాకు, నిరాశ, అభద్రతాభావం, అంతా శూన్యమైపోతున్నట్లుగా అనిపించడం, తప్పు చేస్తున్నట్లు మనసుకు అనిపిస్తుండటం, ఏకాగ్రత కోల్పోవటం, జ్ఞాపకశక్తి లోపం, చెడు జరుగుతుందేమనని భయాందోళనకు గురి కావడం, ఇష్టపడుతున్న వాటిని అయిష్టపడటం వంటి మానసికపరమైన అంశాలు డిప్రెషన్‌ ఉందని చెప్పడానికి లక్షణాలు.

అలాగే డిప్రెషన్‌కు గురి అయినప్పుడు మానసికంగానే కాక, శరీర అవయవాల్లోను మార్పులు జరిగి శారీరక సమస్యలకు కూడా కారణం అవుతోంది. ఉదాహరణకు.. తలనొప్పి, తలతిరుగుట, అతిగా తినడం, పూర్తిగా తిండి మానెయ్యటం, అజీర్ణం, సరైన సమయానికి నిద్రపట్టకపోవటం, లేక అతిగా నిద్రపోతుండటం, తలనొప్పి, తలతిరగటం, శక్తి తగ్గి నీరసించటం, లేదా శారీరక రుగ్మతలు తగ్గకపోవటం వంటి లక్షణాలు తలెత్తుతాయి.

అయితే ఇందులోంచి బయటపడాలంటే కాస్త కొన్ని సూచనలను పాటించక తప్పదు. మనసు ప్రశాంతంగా ఉంచుకోవటం, పుస్తక పఠనం అలవాటు చేసుకోవటం, బాధ కలిగించే విషయాల నుంచి మనసును మళ్లించే ప్రయత్నం చేయటం, పిక్నిక్ వంటి వాటికి హాజరు కావటం, చిన్న విషయాల గురించి అనవసర ఆందోళనను వదిలిపెట్టడం, ప్రశాంత వాతావరణంలో సమస్యలను పరిష్కరించుకోవడం, బ్రీథింగ్ ఎక్సర్‌సైజులు చేస్తుండటం, తరుచు పిల్లలతో బయటకు వెళ్లి సరదాగా గడపటం, మీకు ఇష్టమైన పనులు చేయడం వంటివి చేస్తే దాదాపు డిప్రెషన్ నుంచి విముక్తులు కావచ్చని నిపుణులు చెబుతున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

శ్రీవారికి మాత్రమే కాదు.. దుర్గమ్మ, శ్రీశైలం, కాణిపాకానికి కూడా కల్తీ నెయ్యి సరఫరా...

ఆరుసార్లు వాయిదాపడింది.. ఇపుడు ఏడోసారి కూడా... ఆక్సియమ్ మిషన్-4 వాయిదా

పెళ్లయిన ఆరు నెలలకే వేధింపులు - కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి టెక్కీ ఆత్మహత్య

బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి నీతా అంబానీ రూ.కోటి విరాళం

Vizag Beach Road: జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం.. వైజాగ్ ముస్తాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mahesh Babu: కుబేర చిత్రానికి మహేష్ బాబు విషెష్ - ఓవర్ బడ్జెట్ తిరిగి వస్తుందా?

Mega157: మెగాస్టార్ చిరంజీవి, నయనతారపై ముస్సోరీ షెడ్యూల్ పూర్తి

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

విష్ణు మంచు కన్నప్ప నుంచి అవ్రామ్ మంచు మేకింగ్ వీడియో

Show comments