ఆడ పిల్లల మనస్తత్వం మారిపోవడం ఎందుకో తెలుసా?

Webdunia
బుధవారం, 9 జనవరి 2013 (18:32 IST)
FILE
తల్లిదండ్రులంటే ఆడ పిల్లలకు ఎక్కువ ప్రేమ ఉంటుంది. మగ పిల్లలకంటే.. ఆడపిల్లలే పెళ్లయి అత్తారింటికి వెళ్లినా తల్లిదండ్రులకు అండగా నిలుస్తున్నారు. అత్తగారింటి సమస్యలను అనుకూలంగా మలచుకుని పుట్టింటికి, తల్లిదండ్రులకు సాయం చేయడంలో ముందుంటున్నారు. కానీ ప్రస్తుత సామాజిక పరిస్థితుల కారణంగా ఆడ పిల్లల మనస్తత్వం మారిపోతోంది.

ఎందుకని ఆరాతీస్తే.. తల్లిదండ్రులు కష్టపడి చదివించడం కోసం నానా తంటాలు పడుతుంటే.. పాశ్చాత్య మోజు, చెడు స్నేహం, స్వేచ్ఛ ముసుగులో విచ్చలవిడిగా ఉండటానికి అలవాటు పడిపోతున్నారని సర్వేలో తెలుస్తోంది. ఇంకా ప్రేమ అనే పేరుతో తమ జీవితాన్ని మహిళలే అధికంగా నాశనం చేసుకుంటున్నారని సర్వే తేల్చింది.

ముఖ్యంగా ఆడపిల్ల మనస్తత్వం మారిపోయేందుకు కారణాలు ఏమిటని ఆరాతీస్తే.. తల్లిదండ్రులు ఘర్షణలకు దిగుతున్న ఆడపిల్లలు తమపై ప్రేమ చూపేందుకు వేరొకరిపై ఆధారపడుతున్నారట. తనను ప్రేమగా చూసుకునే వారి కోసం ఆరాటపడుతున్నారట. ఈ క్రమంలోనే బాయ్ ఫ్రెండ్‌ ఎంచుకుంటున్నారట. తనపై ప్రేమగా చూసుకునే వ్యక్తి వుంటాడా అనే అన్వేషణలో ప్రేమలో పడిపోతున్నారట.

అయితే పెంపకం పరంగా చూస్తే.. మునుపంతా పాఠశాల నుంచి ఇంటికొచ్చిన తర్వాత తల్లిదండ్రులతో ఆడపిల్లలు గడిపే సమయం ఎక్కువగా ఉండేది. ఇప్పుడంతా తల్లిదండ్రులకు ఓ గది, పిల్లలకు ప్రత్యేక గదులు ఏర్పాటు చేయడం ద్వారా ఆడపిల్లలు చిన్న వయస్సులోనే ఒంటరితనానికి అలవాటు పడిపోతున్నారు. ఒకవేళ తల్లిదండ్రులతో సమయం వెచ్చించినా అది టీవీలు చూడటానికే సరిపోతుందని సర్వే తేల్చింది.

ఈ కారణాలతో తల్లిదండ్రులతో మనసు విప్పి మాట్లాడే సమయం తగ్గిపోయిందని, అందుకే మహిళలు బయటి వ్యక్తులతో మాటా మంతీ సాగిస్తూ.. వారితో సంభాషణలు స్నేహంతో మొదలై ప్రేమతో ముగస్తుందని సర్వే తేల్చింది. అంతేకాదు.. ఈ స్నేహాలు కొన్ని సుఖాంతమైతే... మరికొన్ని విషాదాంతంగా మిగిలిపోతున్నాయి. అందుచేత ప్రస్తుత సామాజిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రులు పిల్లల పెంపకంలో అధిక శ్రద్ద తీసుకోవాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Bharat Future City: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025కు అంతా సిద్ధం

కార్మికులు ఢిల్లీ వెళ్లి కొట్లాడేందుకు రూ.10 లక్షలు ఇస్తా : మాజీ మంత్రి మల్లా రెడ్డి

అందుకే పుతిన్ భారత్ వెళ్తాడు, పాకిస్తాన్‌కు రాడు: పాక్ జర్నలిస్ట్, షాక్‌లో పాక్ జనం

డీప్‌ఫేక్ చిత్రాలను నిషేధించేలా లోక్‌సభలో బిల్లు

కేరళ తరహాలో ఏపీలో విద్యావిధానం అవసరం.. పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మణికంఠ తీసిన కొత్తపెళ్లికూతురు షార్ట్ ఫిలిం చాలా ఇష్టం : మెహర్ రమేష్

వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర ల పోలీస్ కంప్లెయింట్

మహిళగా పుట్టినందుకు గర్వంగా ఉంది : జాన్వీ కపూర్

Sharva: సంక్రాంతికి శర్వా చిత్రం నారి నారి నడుమ మురారి గ్రాండ్ రిలీజ్

NTR, Balayya: ఒకప్పడు అబ్బాయి, ఇప్పుడు బాబాయ్ కి సినిమా రిలీజ్ కస్టాలు

Show comments