Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంచముఖ ఆంజనేయ స్వామిని ఇంట ఉంచుకుంటే..? ''శ్రీరామజయం'' 108 సార్లు రాసి?

ఆంజనేయస్వామి నవావతారాలు ప్రసన్నాంజనేయస్వామి, వీరాంజనేయస్వామి, వింశతి భుజ ఆంజనేయస్వామి, పంచముఖ ఆంజనేయస్వామి, అష్టాదశ భుజ ఆంజనేయస్వామి, సువర్చల ఆంజనేయస్వామి, చతుర్భుజ ఆంజనేయస్వామి, ద్వాత్రింశద్భుజ ఆంజనే

Webdunia
మంగళవారం, 26 జులై 2016 (12:07 IST)
ఆంజనేయస్వామి నవావతారాలు ప్రసన్నాంజనేయస్వామి, వీరాంజనేయస్వామి, వింశతి భుజ ఆంజనేయస్వామి, పంచముఖ ఆంజనేయస్వామి, అష్టాదశ భుజ ఆంజనేయస్వామి, సువర్చల ఆంజనేయస్వామి, చతుర్భుజ ఆంజనేయస్వామి, ద్వాత్రింశద్భుజ ఆంజనేయస్వామి, వానరాకార ఆంజనేయస్వామిగా పిలుస్తారు. ఇక ఆంజనేయస్వామి నవావతారాలలో పంచముఖ ఆంజనేయస్వామి శ్రీ విష్ణుమూర్తి అంశంతో ఉద్భవించాడని.. పురాణాలు చెప్తున్నాయి.
 
అలాంటి పంచముఖ ఆంజనేయ స్వామిని ఇంట ఉంచుకుంటే దృష్టి, శత్రుభయం తొలగిపోతుందని విశ్వాసం. అలా పంచముఖ ఆంజనేయ స్వామిని తూర్పు ముఖముగా ఉంచితే.. పాపాలను హరించి, చిత్తశుద్ధిని ప్రసాదిస్తాడు. దక్షిణముఖంగా ఉంచితే శతృభయాన్ని పోగొట్టి, విజయాన్ని కలుగజేస్తాడు. పడమర ముఖంగా ఉంచినట్లైతే దుష్ట ప్రభావలను పోగొట్టి, శరీరానికి కలిగే విష ప్రభావలనుండి రక్షిస్తాడని పండితులు అంటున్నారు. ఉత్తర ముఖముగా లక్ష్మీవరాహమూర్తి గ్రహ చెడు ప్రభావాలను తప్పించి, అష్టైశ్వర్యాలు కలుగజేస్తాడు.
 
అలాగే శని, మంగళవారాల్లో ఆంజనేయ స్వామికి తమలపాకుల మాల, వెన్న సమర్పించిన వారికి సకలసంపదలు చేకూరుతాయి. అలాగే ఆంజనేయ స్వామికి "శ్రీరామజయం" అనే మంత్రాన్ని 108 సార్లు పేపర్‌పై రాసి మాలగా వేసిన వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇష్టం లేని పెళ్లి చేయొద్దంటే వింటే కదా! 27మందికి పాలలో ఎలుకల మందు కలిపిచ్చిన యువతి!

Amaravati: అమరావతికి 20,494 ఎకరాల భూ సమీకరణకు సీఆర్డీఏ ఆమోదం

అక్రమ సంబంధం.. ప్రియుడి కోసం భర్తను గొంతు నులిమి చంపేసిన భార్య

Navi Mumbai: భార్య, అత్తలతో నగ్నంగా క్షుద్రపూజలు.. ఆపై ఫోటోలు లీక్ చేశాడు..

Microsoft: పాకిస్తాన్‌లో మైక్రోసాఫ్ట్ ఆఫీసుకు తాళం.. కారణం ఇదే..

అన్నీ చూడండి

లేటెస్ట్

03-07-2025 గురువారం దినఫలితాలు - పట్టుదలతో శ్రమిస్తే విజయం తథ్యం...

Mustard Oil Lamp: ఆదివారం పూట ఈ దీపాన్ని వెలిగిస్తే.. వాస్తు దోషాలు పరార్

జనవరి 29-31 వరకు ఆసియాలోనే అతిపెద్ద గిరిజన మేడారం మహా జాతర

TTD: దర్శన టిక్కెట్ల కోసం మధ్యవర్తుల బారిన పడవద్దు.. టీటీడీ

02-07-2025 బుధవారం దినఫలితాలు : ఆరోగ్యం మందగిస్తుంది.. జాగ్రత్త

తర్వాతి కథనం
Show comments