ఏ రోజు ఏ రంగు దుస్తులు ధరిస్తే ఎలాంటి ఫలితం?

Webdunia
శుక్రవారం, 23 ఆగస్టు 2019 (19:37 IST)
ప్రతి రంగుకు ఓ గొప్పతనం ఉంది. రంగులు వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి. మనిషిని సంతోషంలో ముంచెత్తుతాయి. ఈ రంగులు మనసులోని భావాలను తెలుపుతాయి. చాలా రంగుల్లో జబ్బులను నయం చేసే గుణం ఉంది. దీనినే కలర్ థెరపీ అంటారు. అంతేకాదు రోజులను అనుసరించి రంగులను ఎంచుకోండి. ఫలితం కనపడుతుందంటున్నారు జ్యోతిష్కులు.
 
సోమవారం: సోమవారం అంటే చంద్రునికి ప్రతీక. కాబట్టి ఈ రోజున తెల్లటి వస్త్రాలను ధరించండి. 
 
మంగళవారం: మంగళవారం హనుమంతుని రోజుగా భావిస్తారు. హనుమంతుని విగ్రహాలను కాషాయం రంగులో చూస్తుంటాం. కాబట్టి మంగళవారంనాడు ప్రత్యేకంగా కాషాయం రంగు కలిగిన వస్త్రాలను ధరించండి. ఫలితం ఉంటుందంటున్నారు జ్యోతిష్యులు.
 
బుధవారం: వారంలో మూడవ రోజు గణాధిపతికి సంబంధించిన రోజు. విఘ్నాలకు అధిపతైన విఘ్నేశ్వరునికి ఆకుపచ్చ రంగు అంటే చాలా ఇష్టం. కాబట్టి బుధవారం నాడు పచ్చరంగు కలిగిన వస్త్రాలను ధరించండి. 
 
గురువారం: గురువారాన్ని బృహస్పతి వారం అనికూడా అంటారు. ఈ రోజున గురువులకు అధిపతైన బృహస్పతి దేవుడు అలాగే షిరిడీ సాయిబాబాకు మహా ప్రీతి. బృహస్పతి దేవునికి పసుపు రంగంటే చాలా ఇష్టం. కాబట్టి ఈ రోజున పసుపు రంగు వస్త్రాలను ధరించండి. 
 
శుక్రవారం: శుక్రవారం దేవీ (అమ్మవారు)కి సంబంధించిన రోజు. అమ్మవారు జగజ్జననీ. ఆమె సర్వాంతర్యామి. కాబట్టి ఈ రోజున అన్ని రంగుల మిశ్రమమున్న వస్త్రాన్ని ధరించండి. 
 
శనివారం: శని దేవునికి సమర్పించే ఈ రోజున నీలి రంగు కలిగిన వస్త్రాలను ధరించండి. 
 
ఆదివారం: ఆదివారంనాడు సూర్యుడిని ప్రార్థిస్తారు. ఈ రోజున గులాబీ రంగు కలిగిన వస్త్రాలను ధరించండి. కొన్ని రంగులు మనకు నచ్చుతుంటాయి. అనాయాసంగా ఆయా రంగుల పట్ల ఆకర్షితులమౌతుంటాము. దీనినే కలర్ సైన్స్ అంటారు. కాని జ్యోతిష్యాన్ని నమ్మేవారు రోజుననుసరించి రంగు దుస్తులను ధరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ముప్పు పొంచివుంది.. భారత్‌తో యుద్ధం జరిగితే పాక్ గెలుపు తథ్యం : ఆసిఫ్

జూబ్లీహిల్స్ ఉప పోరు : కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరు ఖరారు

హవ్వ... కారుపై కూర్చుని నడిరోడ్డుపై వెళ్తూ జంట రొమాన్స్ (video)

కోల్డ్‌రిఫ్ దగ్గుమందు తయారీ కంపెనీపై చర్యలేవి? తమిళనాడు సర్కారుపై కేంద్రం ఆగ్రహం

ఢిల్లీ - కోల్‌కతా హైవేపై 4 రోజులుగా భారీ ట్రాఫిక్ జామ్ - ఆకలితో అలమటిస్తున్న ప్రయాణికులు (వీడియో)

అన్నీ చూడండి

లేటెస్ట్

06-10-2025 సోమవారం ఫలితాలు - దంపతులు ఏకాభిప్రాయానికి వస్తారు...

05-10-2025 ఆదివారం దిన ఫలితాలు - ఆర్థికస్థితి నిరాశాజనకం.. దుబారా ఖర్చులు విపరీతం...

05-10-2025 నుంచి 11-10-2025 వరకు మీ వార రాశిఫలాలు

అక్టోబరు 2025లో జాక్‌పాట్ కొట్టనున్న 4 రాశుల వారు

ఈ రోజు శని మహా ప్రదోషం.. శివాలయానికి వెళ్లి పూజ చేయడం తప్పనిసరి

తర్వాతి కథనం
Show comments