Webdunia - Bharat's app for daily news and videos

Install App

28-10-2018 నుంచి 03-11-2018 వరకూ మీ వార రాశి ఫలితాలు(Video)

Webdunia
శనివారం, 27 అక్టోబరు 2018 (18:25 IST)
కర్కాటకంలో రాహువు, తులలో రవి, వక్రి కుజుడు, వృశ్చికంలో గురు, బుధులు, ధనస్సులో శని, మకరంలో కుజ, కేతువులు.  వృషభ, మిధున, కర్కాటకం, సింహంలలో చంద్రుడు. 28వ తేదీన సంకట హర చతుర్థి. 31న శుక్ర మౌడ్యమి త్యాగం. 3న స్మార్త ఏకాదశి. 
 
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
ఆత్మీయులతో సంప్రదింపులు జరుపుతారు. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆరోగ్యం సంతృప్తికరం. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. సంతానం అత్యుత్సాహం అదుపు చేయండి. అనుకోని సంఘటనలెదురవుతాయి. అంచనాలు ఫలించవు. ఖర్చులు విపరీతం. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం నిరుత్సాహపరుస్తుంది. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. పదవుల నుండి తప్పుకోవలసి వస్తుంది. వ్యాపారాల్లో లాభాలు, అనుభవం గడిస్తారు. పెట్టుబడులకు అనుకూలం. స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన మంచిది. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. 
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
ఈ వారం కొత్త పనులు ప్రారంభిస్తారు. ఖర్చులు విపరీతం. కుటుంబీకుల కోసం బాగా వ్యయం చేస్తారు. చెల్లింపుల్లో జాగ్రత్త. ఊహించని సంఘటనలెదురవుతాయి. వ్యవహారాలతో తీరిక ఉండదు. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆప్తుల సలహా పాటించండి. గృహమార్పు ఫలితం నిదానంగా కనిపిస్తుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. కార్యక్రమాలు వాయిదాపడుతాయి. నోటీసులు అందుకుంటారు. ప్రముఖుల ఇంటర్వ్యూ సాధ్యం కాదు. మీ శ్రీమతి వైఖరి అసహానం కలిగిస్తుంది. ఓర్పుతో వ్యవహరించండి. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి అధికం. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. పెద్దమెుత్తం సరుకు నిల్వలో జాగ్రత్త.     
 
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. కష్టానికి ప్రతిఫలం ఉంటుంది. పరిస్థితుల అనుకూలత ఉంది. అనుకున్నది సాధిస్తారు. వ్యాపకాలు పెంపొందుతాయి. ఆది, సోమ వారాల్లో దుబారా ఖర్చులు విపరీతం. శ్రమాధిక్యతతో పనులు పూర్తిచేస్తారు. గృహం సందడిగా ఉంటుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు వస్తాయి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. ఒక వ్యవహారంలో మీ జోక్యం తగదు. సన్నిహితులకు చక్కని సలహాలిస్తారు. గృహ నిర్మాణానికి అనుకూలం. రుణ యత్నాలు ఫలిస్తాయి. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు కొత్త బాధ్యతలు, స్థానచలనం. 
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. దుబారా ఖర్చులు విపరీతం. రాబడిపై దృష్టి పెడతారు. సాయం అర్థించేందుకు మనసు అగీకరించదు. నగదు, ఆభరణాలు జాగ్రత్త. గత తప్పిదాలు పునరాతృం కాకుండా జాగ్రత్త వహించండి. ఎవరినీ తక్కువ అంచనా వేయెుద్దు. మంగళ, బుధ వారాల్లో కొత్త సమస్యలెదురయ్యే సూచలున్నాయి. అప్రమత్తంగా వ్యవహరించండి. పనులు ప్రారంభంలో ఇబ్బందులెదుర్కుంటారు. మీపై శకునాల ప్రభావం అధికం. మీ శ్రీమతి సలహా పాటించండి. సంతానం భవిష్యత్తుపై దృష్టిపెడతారు. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. బంధుత్వాలు, వ్యాపకాలు పెంపొందుతాయి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. పట్టుదలతో ఉద్యోగయత్నం సాగించండి. ఏజెన్సీలు, కాంట్రాక్టులు దక్కకపోవచ్చు.   
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. ధనలాభం ఉంది. చాకచక్యంగా వ్యవహిరిస్తారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. కీలక పదవులు అందుకుంటారు, పలుకుబడి పెరుగుతుంది. వ్యతిరేకులను ఆకట్టుకుంటారు. విలాసాలకు బాగా వ్యయం చేస్తారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ప్రముఖులను కలుసుకుంటారు. సంతానం దూకుడుకు కళ్లెం వేయండి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ప్రింటింగ్ రంగాల వారికి ఆశాజనకం. కంప్యూటర్ రంగాల వారికి కొత్త సమస్యలెదురవుతాయి. వ్యాపారాభివృద్ధఇకి పథకాలు రూపొందిస్తారు. షాపుల స్థలమార్పు కలిసివస్తుంది. సరుకు నిల్వలో జాగ్రత్త. వాహనం ఇతరులకివ్వడం క్షేమం కాదు.  
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2, 3 పాదాలు
గత తప్పిదాలు పునరావృతం కాకుండా జాగ్రత్త వహించండి. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. ఖర్చులు పెరిగినా వెసులుబాటు ఉంటుంది. అయిన వారికి సాయం అందిస్తారు. బంధుత్వాలు, వ్యాపకాలు పెంపొందుతాయి. ఆత్మీయులకు చక్కని సలహాలిస్తారు. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. శనివారం నాడు పనులు హడావుడిగా సాగుతాయి. సంతానం ద్వారా శుభవార్తలు వింటారు. గృహనిర్మాణాలు వేగవంతమవుతాయి. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. విందులు, వినోదాల్లో అతిగా వ్యవహరించవ్దదు. సాంకేతిక, వైద్య రంగాలవారికి ఆదాయాభివృద్ధి. విదేశీ విద్యాయత్నం నిరుత్సాహపరుస్తుంది.  
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. వృత్తి, వ్యాపారాల్లో రాణిస్తారు. పెట్టుబడులకు అనుకూలం. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వివాదాలు సద్దుమణుగుతాయి. మానసికంగా కుదుటపడుతారు. రోజువారి ఖర్చులే ఉంటాయి. పనులు సానుకూలతకు విశ్రాంతంగా శ్రమిస్తారు. ఆది, సోమ వారాల్లో బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. పరిచయం లేని వారితో జాగ్రత్త. శ్రీమతి లేక శ్రీవారి వైఖరిలో మార్పు గమనిస్తారు. అవివాహితుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. సంతానం కదలికలపై కన్నేసి ఉంచండి. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకుంటారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. సేవ, పుణ్యకార్యంలో పాల్గొంటారు.  
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట
ప్రతికూల పరిస్థితులెదుర్కుంటారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. ఆకస్మిక ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. ధనసహాయం అర్థించేందుకు మనస్కరించదు. రుణ ఒత్తిళ్లు అధికం. మీ శ్రీమతి సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. పనులు మెుండిగా పూర్తిచేస్తారు. ప్రముఖుల కలయిక వలన ఏమంత ప్రయోజనం ఉండదు. మంగళ, బుధ వారాల్లో బంధువులతో మనస్పర్థలు తలెత్తుతాయి. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. ఆప్తుల కలయికతో కుదుటపడుతారు. గృహమార్పు అనివార్యం. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. వృత్తుల వారికి సామాన్యం. ప్రింటింగ్ రంగాలవారికి ఒత్తిడి, పనిభారం. వాహనం ఇతరులకివ్వవద్దు.  
 
ధనస్సు: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
ఖర్చులు అంచనాలకు భిన్నంగా ఉంటాయి. రాబడిపై దృష్టిపెడతారు. అవసరాలు వాయిదా పడుతాయి. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. అనవసర జోక్యం తగదు. ఆది, గురు వారాల్లో పరిచయం లేని వారితో జాగ్రత్త. సందేశాలు, ప్రకటనలను విశ్వసించవద్దు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. కుటుంబ విషయాలపై శ్రద్ధ వహిస్తారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆలోచింపచేస్తుంది. తొందరపడి హామీలివ్వవద్దు. పెద్దల సలహా పాటించండి. గృహ నిర్మాణాలు, మరమ్మత్తులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. అధికారులకు ధనప్రలోభం తగదు. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణావకాశం లభిస్తుంది. వ్యాపారాల్లో ఒడిదుడుకులను దీటుగా ఎదుర్కుంటారు. 
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
వ్యవహారా ఒప్పందాల్లో మెళకువ వహించండి. మెుహమ్మాటాలు, భేషజాలకు పోవద్దు. మీ ఇష్టాయిష్టాలను కచ్చితంగా వ్యక్తం చేయండి. వివాహ యత్నం ఫలిస్తుంది. వివాహ వేదికలు అన్వేషిస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఆకస్మికంగా అవకాశాలు కలిసివస్తాయి. పదవులు, బాధ్యతలు స్వీకరిస్తారు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు అధికం. ప్రయోజనకం. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. రశీదులు, పత్రాలు జాగ్రత్త. పనులు నిదానంగా సానుకూలమవుతాయా. మంగళ, శని వారాల్లో అనవసర బాధ్యతలు చేపట్టి అవస్థలెదుర్కుంటారు. వ్యాపారాభివృద్ధికి రూపొందిస్తారు. హోల్‌సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. సరుకు నిల్వలో జాగ్రత్త. వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ప్రయాణం చేయవలసి వస్తుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఆప్తులకు సాయం అందిస్తారు.  
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఆర్థికలావాదేవీలు లాభిస్తాయి. కొంతమెుత్తం ధనం అందుతుంది. అవసరాలు నెరవేరుతాయి. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. ప్రైవేటు సంస్థల్లో మదుపు తగదు. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. గృహంలో స్తబ్ధత తొలగుతుంది. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. గురు, శుక్ర వారాల్లో గుట్టుగా యత్నాలు సాగించండి. కుటుంబ విషయాలు వెల్లడించవద్దు. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. ఆరోగ్యం మందగిస్తుంది. అతిగా ఆలోచింపవద్దు. విశ్రాంతి అవసరం. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. కత జ్ఞాపకాలు ఉత్సాహాన్నిస్తాయి. విదేశీ విద్యాయత్నం నిరుత్సాహపరుస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ఉద్యోగస్తులు అధికారులకు చేరువవుతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. కంప్యూటర్, ప్రింటింగ్ రంగాల వారికి పురోభివృద్ధి.  
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
గృహమార్పు కలిసివస్తుంది. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ఆత్మీయులను సంప్రదిస్తారు. పరిచయాలు బలపడుతాయి. కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. పనులు సానుకూలమవుతాయి. ఖర్చులు సామాన్యం. సన్నిహితులకు సాయం అందిస్తారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. శనివారం నాడు బాధ్యతలు అప్పగించవద్దు. అపరిచితులతో మితంగా సంభాషించండి. ఆభరణాలు, విలువైన వస్తువులు జాగ్రత్త. ఉద్యోగ ప్రకటనలపై అవగాహన ప్రధానం. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. అధికారులకు హోదా మార్పు, స్థానచలనం. ఉపాధి పథకాల్లో రాణిస్తారు. వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. సేవ, పుణ్య కార్యాల్లో పాల్గొంటారు. వీడియో...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఢిల్లీలోని భవనంపై టెర్రస్ నుంచి నవజాత శిశువు మృతదేహం.. ఎలా వచ్చింది?

మాదాపూర్ బార్ అండ్ రెస్టారెంట్‌‌లో అగ్నిప్రమాదం... (video)

KTR: కేటీఆర్‌‌కు ఓ స్వీట్ న్యూస్ ఓ హాట్ న్యూస్.. ఏంటది?

గంటలో శ్రీవారి దర్శనం.. ఎలా? వారం రోజుల పాటు పైలెట్ ప్రాజెక్టు!

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం... ఉత్తారంధ్రకు భారీ వర్ష సూచన!

అన్నీ చూడండి

లేటెస్ట్

17-12-2024 మంగళవారం దినఫలితాలు : చిత్తశుద్ధితో శ్రమిస్తే విజయం తథ్యం...

కలలో గణేషుడు కనబడితే ఏం జరుగుతుంది?

ఇళయరాజాకు ఆలయంలో అవమానం.. వీడియో వైర‌ల్

Daily Astro 16-12-2024 సోమవారం దినఫలితాలు : ఏకాగ్రతతో వాహనం నడపండి...

Today Daily Astro 15-12-2024 ఆదివారం దినఫలితాలు : సంకల్పం సిద్ధిస్తుంది...

తర్వాతి కథనం
Show comments