Webdunia - Bharat's app for daily news and videos

Install App

#WeeklyHoroscope 21-06-2020 నుంచి 27-06-2020 వరకు మీ వార రాశి ఫలితాలు..

Webdunia
శనివారం, 20 జూన్ 2020 (17:34 IST)
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం 
ఈ వారం అనుకూలదాయకమే. లావాదేవీలు కొలిక్కివస్తాయి. రుణ విముక్తులవుతారు. ఆదాయం సంతృప్తికరం. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ఇంటి విషయాలపై దృష్టిసారిస్తారు. ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. పనులు సానుకూలమవుతాయి. పత్రాల రెన్యువల్‌లో మెలకువ వహించండి. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. శుభకార్యానికి సన్నాహాలు చేస్తారు. బంధుత్వాలు బలపడతాయి. మీ జోక్యం అనివార్యం. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఉద్యోగ బాధ్యతల్లో మార్పులుంటాయి. ఉపాధ్యాయులు, విద్యార్థులకు ఒత్తిడి అధికం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. సంస్థల స్థాపనలకు తరుణం కాదు. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. 
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు 
అవకాశాలు చేజారిపోతాయి. నిస్తేజానికి లోనవుతారు. మీపై శకునాల ప్రభావం అధికం. రావలసిన ధనం లౌక్యంగా వసూలు చేసుకోవాలి. వాగ్వాదాలకు దిగవద్దు. పనులు మొండిగా పూర్తిచేస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. అయినవారితో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. ఏకపక్ష నిర్ణయాలు తగవు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. పిల్లల ఉన్నత చదవులపై దృష్టిపెడతారు. గృహంలో మార్పులు, చేర్పులకు అనుకూలం. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. అధికారులతో సమస్యలెదురవుతాయి. సహోద్యోగులతో జాగ్రత్త. నిరుద్యోగులకు ఆశాజనకం. ప్రయాణానికి సిద్ధమవుతారు. కోర్టు వాయిదాలు నిరుత్సాహపరుస్తాయి. 
 
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు 
భేషజాలకు పోవద్దు. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. మీ శ్రీమతి సలహా పాటించండి. సోదరులతో విభేదాలు తలెత్తుతాయి. సౌమ్యంగా మెలగండి. ఆదాయ వ్యయాలకు పొంతనవుండదు. మంగళ, బుధ వారాల్లో ఆకస్మిక ఖర్చులుంటాయి. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. ఆరోగ్యం మందగిస్తుంది. విశ్రాంతి అవసరం. పనులు వాయిదాపడతాయి. సంతానం కదలికలపై దృష్టిపెట్టండి. ఏ విషయాన్ని తేలికగా తీసుకోవద్దు. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. అధికారులకు పనిభారం, విశ్రాంతి లోపం. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. సరకు నిల్వలో జాగ్రత్త. ట్రాన్స్‌పోర్టు, ట్రావెలింగ్ రంగాల వారికి ఆదాయాభివృద్ధి. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమ సమాచారం తెలుసుకుంటారు. 
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష 
ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు. తెలియని వెలితి వెన్నాడుతూ ఉంటుంది. ఖర్చులు సామాన్యం. పెట్టుబడులపై దృష్టిపెడతారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. పనులు చురుకుగా సాగుతాయి. ప్రముఖులను కలుసుకుంటారు. గురు, శుక్రవారాల్లో అపరిచితులతో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. ఆత్మీయులరాక ఉత్సహాన్నిస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడుతారు. వ్యాపకాలు అధికమవుతాయి. కాంట్రాక్టులు, పదువులు దక్కపోవచ్చు. పిల్లల ఉన్నత చదువులను వారి ఇష్టానికే వదిలివేయండి. ఉపాధ్యాయులకు ఒత్తిడి, శ్రమ అధికం. అధికారులకు కొత్త బాధ్యతలు, స్థానచలనం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. చిరు వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం 
ప్రతికూలతలు అధికం. సంప్రదింపులు సాగవు, ఆలోచనలతో సతమతమవుతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. ఖర్చులు అధికం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. అవసరాలు నెరవేరుతాయి. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. శనివారం నాడు ముఖ్యుల ఆత్మీయుల హితవు మీపై సత్ప్రభావం చూపుతుంది. ఇంటి విషయాలు పట్టించుకోవద్దు. ఎవరినీ తక్కువగా అంచనా వేయొద్దు. ఈ చికాకులు తాత్కాలికమే. త్వరలో పరిస్థితులు చక్కబడాయి. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులెదుర్కొంటారు. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు 
సంతోషకరమైన వార్తలు వింటారు. మనస్సు కుదుటపడుతుంది. అవకాశాలు కలిసివస్తాయి. ధనలాభం, వాహనయోగం ఉన్నాయి. విలాసాలకు వ్యయం చేస్తారు. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. ఉల్లాసంగా గడుపుతారు. ఆది, సోమవారాల్లో పనులు మందకొడిగా సాగుతాయి. లైసెన్సులు పర్మిట్ల రెన్యువల్‌లో అలక్ష్యం తగదు. బ్యాంకు వ్యవహారాల్లో మెలకువ వహించండి. ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు. పరిచయాలు బలపడతాయి. పెట్టుబడులకు అనుకూలం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలుగుతుంది. దైవ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు 
పరిస్థితులు మునుపటి కంటే మెరుగ్గా ఉంటాయి. ఆందోళన తగ్గి కుదుటపడుతారు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. తప్పిదాలను సరిదిద్దుకుంటారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. పనులు వేగవంతం అవుతాయి. ఖర్చులు అధికం. ప్రయోజనకరం. కొంతమొత్తం ధనం అందుతుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. నమ్మకస్తులే మోసగించేందుకు యత్నిస్తారు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఒంటెద్దుపోకడ తగదు. మంగళ, బుధవారాల్లో ప్రకటనలు, సందేశాలను విశ్వసించవద్దు. సంతానం చదువులపై దృష్టిపెడతారు. ప్రియతముల ఆరోగ్యం కుదుటపడుతుంది. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ప్రయాణానికి అనుకూలం. 
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. వ్యవహారాలతో తీరిక ఉండదు. అకాల భోజనం, నిద్రలేమి. ఖర్చులు అంచనాలను మించుతాయి. చేతిలో ధనం నిలువదు. గురు, ఆదివారాల్లో పెద్ద ఖర్చు తగిలే సూచనలున్నాయి. పనులు మొండిగా పూర్తిచేస్తారు. ప్రముఖుల సందర్శనం కోసం పడిగాపులు తప్పవు. సన్నిహితుల సాయం అందుతుంది. ఆందోళన తొలగి కుదుటపడతారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆరోగ్యం సంతృప్తికరం. కుటుంబ విషయాలపై శ్రద్ధ వహిస్తారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. సరకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. అధికారులకు హోదా మార్పు. ఉపాధి పథకాల్లో స్థిరపడతారు. 
 
ధనస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం 
ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ప్రతికూలతలను అధికమిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. చాకచక్యంగా వ్యవహరించాలి. శుక్ర, శనివారాల్లో చెల్లింపులు జరుపవద్దు. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. మనోధైర్యంతో ముందుకుసాగండి. సలహాలు, సహాయం ఆశించవద్దు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. అయినవారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. ప్రముఖుల కలయిక వల్ల ఏమంత ప్రయోజనం ఉండదు. సంతానం చదువులపై దృష్టిపెడతారు. ఉపాధ్యాయులకు కొత్త సమస్యలెదురవుతాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. పారిశ్రామిక రంగాల వారికి ఆశాజనకం. 
 
మకరం: ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు 
పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతాయి. కష్టం ఫలిస్తుంది. అనుకున్నది సాధిస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. అవకాశాలను దక్కించుకుంటారు. ఊహించని ఖర్చులే ఉంటాయి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఆది, సోమవారాల్లో పనులు సాగవు. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వొద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. పత్రాల రెన్యువల్‌లో అలక్ష్యం తగదు. నోటీసులు అందుకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. పెట్టుబడులకు తరుణం కాదు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే కొనసాగించండి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. ఆధ్యాత్మిక పెంపొందుతుంది. స్పెక్యులేషన్ రంగాల వారికి ఆశాజనకం. 
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు 
లక్ష్యాన్ని సాధిస్తారు. మీ పట్టుదల మార్గదర్శకమవుతుంది. ప్రశంసలు అందుకుంటారు. గృహంలో స్తబ్దత తొలగుతుంది. ఖర్చులు అధికం. సంతృప్తికరం. మంగళ, బుధవారాల్లో బ్యాంకు వ్యవహారాల్లో మెలకువ వహించండి. ఆర్థిక విషయాలు వెల్లడించవద్దు. గుట్టుగా యత్నాలు సాగించండి. విమర్శలకు ధీటుగా స్పందిస్తారు. అభియోగాలు తొలగిపోగలవు. ఆత్మీయులను కలుసుకుంటారు. పనులు చురుకుగా సాగుతాయి. సంతానం కదలికలపై దృష్టిపెట్టండి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. పెట్టుబడులకు తరుణం కాదు. పత్రాలు అందుకుంటారు. అధికారులకు హోదా మార్పు. ఉద్యోగస్తులకు యూనియన్‌లో గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కొంటారు. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. 
 
మీనం: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి 
కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. అవకాశాలు చేజారినా ఒకందుకు మంచిదే. యత్నాలు విరమించుకోవద్దు. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఆదాయ, వ్యయాలకు పొంతన ఉండదు. బుధవారం నాడు ఆకస్మిక ఖర్చులు ఉంటాయి పొదుపు ధనం గ్రహిస్తారు. చెల్లింపుల్లో జాగ్రత్త. ప్రకటనలు, సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. శుభకార్యానికి సన్నాహాలు చేస్తారు. వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. ఉద్యోగస్తులకు పదోన్నతి, ధనలాభం. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉమ్మడి వ్యాపారాలకు అనుకూలం. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అయ్య బాబోయ్..అదానీ గ్రూప్‌తో ప్రత్యక్ష ఒప్పందం కుదుర్చుకోలేదు.. వైకాపా

అదానీ దేశం పరువు తీస్తే జగన్ ఏపీ పరువు తీశారు : వైఎస్.షర్మిల (Video)

ఎగ్జిట్ పోల్ ఫలితాలు 2024 : ఆ రెండు రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందంటే...

పెరుగుతున్న సముద్ర నీటి మట్టాలు.. ప్రమాదం ముంగిట తీర ప్రాంతాలు!

కారు యజమానిని వణికించిన కాకులు - వీడియో వైరల్

అన్నీ చూడండి

లేటెస్ట్

భైరవ అష్టమి మహోత్సవం, 2024 రకాల మిఠాయిల భోగం, 84,000 చదరపు అడుగుల రంగోలీ ప్రపంచ రికార్డు

20-11-2024 బుధవారం ఫలితాలు - గృహం ప్రశాంతంగా ఉంటుంది...

19-11-2024 మంగళవారం ఫలితాలు - పిల్లల దూకుడు కట్టుడి చేయండి....

సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే?

మంగళవారం సంకష్ట హర చతుర్థి.. కుజదోషాలు మటాష్

తర్వాతి కథనం
Show comments