Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్థిక ఇబ్బందులకు చెక్ పెట్టే వాస్తు టిప్స్: నీటిని వృధా చేస్తే.. ఆ మూడు రంగుల్లో?

ఆర్థిక ఇబ్బందులున్నాయా? ఎంత డబ్బు సంపాదించినా చేతిలో నిలవట్లేదా..? ఈతిబాధలు తొలగిపోవాలంటే.. వాస్తు ప్రకారం ఇంట్లో కొన్ని చిన్ని చిన్ని మార్పులు చేసి చూడండి. అవేంటంటే..? ఎరుపు, వంకాయ రంగు, పచ్చరంగుల్ని

Webdunia
బుధవారం, 25 ఏప్రియల్ 2018 (12:54 IST)
ఆర్థిక ఇబ్బందులున్నాయా? ఎంత డబ్బు సంపాదించినా చేతిలో నిలవట్లేదా..? ఈతిబాధలు తొలగిపోవాలంటే.. వాస్తు ప్రకారం ఇంట్లో కొన్ని చిన్ని చిన్ని మార్పులు చేసి చూడండి. అవేంటంటే..? ఎరుపు, వంకాయ రంగు, పచ్చరంగుల్ని వాస్తు రంగులంటారు. ఈ రంగుల్లో ఇంట్లో వస్తువులును అమర్చుకోండి. సోఫాలు, కర్టెన్లు ఎరుపు రంగుల్లో ఎంచుకోండి. ఇలా చేస్తే ఆర్థిక పరంగా ఇబ్బందులను దూరం చేసుకోవచ్చునని వాస్తు నిపుణులు సలహా ఇస్తున్నారు. 
 
ఇంటీరియర్ వస్తువులు ఈ రంగుల్లో వుంటే అదృష్టం మీ వెంటే వుంటుంది. గోడ రంగులు, ఫర్నీచర్లు వంటివి ఈ రంగులో వుంటే ధనానికి కొరత వుండదు. అలాగే ఇంటిని శుభ్రంగా వుంచుకోవాలి. ప్రధాన ద్వారం అతిథులను ఆకట్టుకునే రీతిలో వుండాలి. తేలికపాటి శబ్ధాన్నిచ్చే గంటలు ప్రధాన ద్వారానికి ముందు కట్టి పెట్టాలి. ప్రధాన తలుపులకు పైన కనువిందునిచ్చే వెలుతురునిచ్చే బల్బులను ఫిక్స్ చేసుకోవాలి. గోల్డెన్ కలర్‌లోని బొమ్మలతో ఇంటిని అలంకరించుకుంటే.. ఆదాయానికి మార్గాలుంటాయి. 
 
బుద్ధుని బొమ్మలు బంగారు వర్ణంలో తెచ్చుకుని ఇంట వుంచితే.. ఆర్థిక ఇబ్బందులు వుండవు. అలాగే కిచెన్‌ను ఎప్పుడూ శుభ్రంగా వుంచుకోవాలి. ఫలితం ఆశించకుండా కష్టపడి పనిచేయడం, ఇంటిని శుభ్రంగా వుంచుకోవడం ద్వారానే ఆర్థిక ఇబ్బందులు వుండవని వాస్తు నిపుణులు అంటున్నారు. పనిచేయని గడియారాలను ఇంటి నుంచి తొలగించాలి. సరైన సమయాన్ని సూచించే గడియారాలను ఇంట వుంచుకుంటే.. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇంకా ఆర్థికపరమైన సమస్యలుండవు. 
 
ముఖ్యంగా నీటిని వృధా చేయకండి. నీటిని వృధా చేస్తే ఆ ఇంట డబ్బు నిలవదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. మీరెంత నీటిని వృధా చేస్తున్నారో.. అంతగా డబ్బును కూడా వృధా అవుతుందని గమనించాలి. ట్యాప్‌ల్లో ఎప్పుడూ నీటిని వృధా కాకుండా చూడాలి. నీటి వినియోగంలోను పొదుపు పాటించాలి. అశుభ్రమైన నీటిని బకెట్లలో వుంచకుండా అప్పటికప్పుడే పారబోయాలి.
 
అలాగే మీ ఇంట మనీ ప్లాంట్‌ను పెంచుకోండి. ఆ మొక్కల సంరక్షణ ద్వారా ఆ ఇంట సంతోషంతో పాటు ఆర్థిక సమస్యలుండవని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. చాలాకాలం పాటు ఉపయోగించే వస్తువులు ఇంట వుండకుండా చూసుకోవాలి. ఉపయోగం లేని వస్తువులు ఇంట వుండకూడదు. ఈ చిట్కాలు పాటిస్తే.. ఆ ఇంట ఈతిబాధలు, ఆర్థిక ఇబ్బందులంటూ వుండవని వాస్తు నిపుణులు సలహా ఇస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: మూడు సంవత్సరాలు ఓపిక పట్టండి, నేను మళ్ళీ సీఎం అవుతాను.. జగన్ (video)

ట్రంప్ ఆంక్షల దెబ్బ: అమెరికాలో గుడివాడ టెక్కీ సూసైడ్

Amaravati Or Vizag?: ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతి గుడ్ ఛాయిస్!?

Pawan Kalyan: నాకు డబ్బు అవసరమైనంత కాలం, నేను సినిమాల్లో నటిస్తూనే వుంటా: పవన్

Betting Apps: బెట్టింగ్ యాప్‌ల కేసులో పోలీసుల కీలక అడుగు.. ఆ జాబితాలో?

అన్నీ చూడండి

లేటెస్ట్

కాలాష్టమి రోజు కాలభైరవ పూజ.. రాహు, కేతు దోషాల నుంచి విముక్తి

22-03-2025 శనివారం మీ రాశిఫలాలు : ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు...

Mobile Wallpaper Vastu: మొబైల్ వాల్‌పేపర్‌ను ఇలా సెట్ చేస్తే దురదృష్టం పట్టుకుంటుందా?

Sheetala Saptami 2025: శీతల సప్తమి నాడు శీతల దేవిని ఎందుకు పూజిస్తారంటే?

21-03-2025 శుక్రవారం మీ రాశిఫలాలు : పిల్లల భవిష్యత్తుపై దృష్టి పెడతారు...

తర్వాతి కథనం
Show comments