వరలక్ష్మీ వ్రతం.. పూజకు ఇలా సిద్ధం చేసుకోవాలి..

Webdunia
గురువారం, 4 ఆగస్టు 2022 (14:20 IST)
Varalakshmi
వరలక్ష్మీ వ్రతం ఆచరించే రోజున ఉదయాన్నే నిద్రలేచి తలంటు స్నానం చేయాలి. ఇంటిని శుభ్రం చేసుకోవాలి పూజా మందిరంలో ఒక మండపాన్ని తయారు చేసుకోవాలి. 
 
ఈ మండపం పైన బియ్యం పిండితో ముగ్గువేసి కలశం ఏర్పాటు చేసుకోవాలి. అమ్మవారి ఫోటో తయారు చేసి కలశానికి అమర్చుకోవాలి. పూజా సామాగ్రి, అక్షింతలు, తోరణాలు, పసుపు గణపతిని ముందుగానే సిద్ధం చేసుకుని పెట్టుకోవాలి. 
 
వరలక్ష్మీ దేవి అంటేనే వరాలిచ్చే తల్లి. తనను మనస్ఫూర్తిగా ఎవరైనా భక్తితో వేడుకుంటే చాలు మనం కోరిన వరాలన్నీ ఇచ్చేస్తుంది. కాబట్టి వరలక్ష్మీ వ్రతం ఆచరించడానికి ఎలాంటి నియమాలు, మడులు, నిష్టలు అవసరం లేదు. కాకపోతే నిగ్రహమైనభక్తి, ఏకాగ్రత ఉంటే చాలు. ఎందుకంటే వరలక్ష్మీ వ్రతం చాలా పవిత్రమైనది.
 
వరలక్ష్మీ వ్రతానికి ఆదిదేవతయైన లక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో కనిపించి, వ్రతానికి సంబంధించిన వివరాలను వివరించింది. సువాసినులందరూ చేసే ప్రాభవ వ్రతం. ‘శ్రీ వరలక్ష్మీ నమస్తు వసుప్రదే, సుప్రదే’ శుక్రవారం రోజున జరుపుకునే వరలక్ష్మీ వ్రతంతో ధన, కనక, వస్తు,వాహనాది సమృద్ధులకు మూలం. 
 
శ్రావణ శుక్రవార వ్రతాలతో పాపాలన్నీ తొలగిపోయి లక్ష్మీ దేవి అనుగ్రహం కలుగుతుందని చెప్పింది. అప్పటినుంచి ఈ వ్రతాన్ని వివాహిత మహిళలందరూ ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతం అయిపోయిన తర్వాత ముత్తైదువులకు తాంబూలాలు ఇవ్వాలి. అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చి, పూజ చేసిన వారు కూడా వాటిని తీసుకోవాలి. అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని వాళ్లే ఆరగించాలి. రాత్రి ఉపవాసం ఉండి, భక్తితో వేడుకుంటే మీరు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి.
 
శ్రావణమాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్నిఆచరించాలి. అయితే శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకోవడం వీలుకాకపోతే.. తరువాత వచ్చే శ్రావణ శుక్రవారాల్లో కూడా ఈవ్రతాన్ని చేయవచ్చును. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Amaravati: అమరావతి ఓఆర్ఆర్ ప్రాజెక్ట్ ప్రారంభానికి రెండేళ్లు పట్టే అవకాశం..

డిసెంబర్ 4 నుండి రెండు రోజుల పాటు భారత పర్యటనలో పుతిన్

మా ఫ్రెండ్స్‌తో ఒక్క గంట గడిపి వాళ్ల కోర్కె తీర్చు, ఏపీ మహిళా మంత్రి పీఎ మెసేజ్: మహిళ ఆరోపణ (video)

అమరావతి నిర్మాణానికి భూములిచ్చి రైతులు త్యాగం చేశారు.. నిర్మలా సీతారామన్

ఇకపై ఇంటి వద్దే ఆధార్ కార్డులో మొబైల్ నంబర్ అప్‌డేషన్

అన్నీ చూడండి

లేటెస్ట్

Kerala Sadya: శబరిమల అన్నదానంలో కేరళ సద్య.. పులావ్, సాంబార్, పాయసంతో పాటు..

వివాహ పంచమి.. అష్టోత్తర శతనామాలతో సీతారాములను పూజిస్తే?

25-11-2025 మంగళవారం ఫలితాలు - ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు...

సుబ్రహ్మణ్య షష్టి: ఓం శరవణభవ నమః

నవంబర్ 25 ధ్వజారోహణ.. రామభూమి అయోధ్యలో 100 టన్నుల పుష్పాలతో అలంకరణ

తర్వాతి కథనం
Show comments