Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముక్కోటి ఏకాదశి రోజున జాగరణ ఎప్పుడు.. ఎలా చేయాలి?

Webdunia
మంగళవారం, 18 డిశెంబరు 2018 (12:45 IST)
ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనంతో జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని, పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. ముక్కోటి ఏకాదశి రోజు విష్ణు దర్శనం తర్వాత పూజ చేసి ఉపవాసం ఉంటే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఏడాది మొత్తంలో వచ్చే 24 ఏకాదశుల్లో ముక్కోటి ఏకాదశి రోజున చేసే ఉపవాసం విశేషమైన ఫలితాలను ఇస్తుంది. 
 
అలాగే వైకుంఠ ఏకాదశి రోజున శ్రీమన్నారాయణుడికి దీపారాధన చేస్తే ఉత్తమ ఫలితాలు చేకూరుతుంది. ఈ రోజున చేసే పూజలు, దానాల వల్ల ఏడాదిలో ప్రతి ఏకాదశికి చేసినంత పుణ్యం దక్కుతుంది. ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో సకల అలంకరణలు చేసుకొని ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనం ఇస్తారు. ఈ ఏడాది ఏకాదశి తిథి.. డిసెంబర్ 18వ తేదీ ఉదయం 07.57 గంటల నుంచి ప్రారంభం అవుతుంది. అలాగే డిసెంబర్ 19 ఉదయం 07.35 గంటలకు ముగుస్తుంది. 
 
అలాగే ఏకాదశికి ముందు రోజు ఒంటి పూట భోజనం చేయాలి. ఏకాదశి రోజున పండ్లు, ధాన్యాలు, పాలు తీసుకోవచ్చు. ఈ ఏకాదశి ఇంద్రియాలనూ ఆ హరికి అర్పించే అరుదైన అవకాశమే ఏకాదశి వ్రతం. ఇందుకోసం ముందురోజు రాత్రి నుంచే ఉపవాసం ఉండి, ఏకాదశి రోజున కేవలం తులసి తీర్థాన్నే స్వీకరిస్తూ, మర్నాడు ఉదయం ఎవరికన్నా అన్నదానం చేసిన తర్వాత భుజించాలి. 
 
ఏకాదశి రోజున రాత్రి భగవన్నామస్మరణతో జాగరణ చేయాలి. ఇలా జాగరణతో మనసునీ, ఉపవాసంతో శరీరాన్ని నిగ్రహించుకుని.. వాటిని హరిధ్యానంలోకి మరల్చడే ఏకాదశి వ్రత ఉద్దేశం. వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే ఏడాదిలోని అన్ని ఏకదాశులలోను ఉపవాసం వున్నట్లు లెక్క. ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉండి తులసినీటిని మాత్రమే సేవిస్తూ గడుపుతారు. 
 
ఇక ఏకాదశి రోజు రాత్రి జాగరణ చేసి మర్నాడు ఉదయం ఆహారాన్ని భుజించడం ద్వారా ఈ ఉపవాస దీక్షను ముగిస్తారు. ఏకాదశి రోజున ఉపవాసం, జాగరణలను పాటించడం ద్వారా అనారోగ్య సమస్యలుండవని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో కొత్త టెక్స్‌టైల్ పాలసీ.. రూ.10 వేల కోట్ల పెట్టుబడులు

అది యేడాది క్రితం పోస్టు.. ఈ కేసులో అంత తొందరెందుకో : ఆర్జీవీ ప్రశ్న

16 యేళ్లలోపు పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాల్సిందే...

ఢిల్లీలో పవన్ కళ్యాణ్ 'తుఫాన్' - నేడు ప్రధాని మోడీతో భేటీ!!

EVM లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, మీరు గెలిస్తే ట్యాంపరింగ్ కాదా అంటూ ప్రశ్న

అన్నీ చూడండి

లేటెస్ట్

2025.. బాబా వంగా జ్యోతిష్యం.. ఆ ఐదు రాశులకు అదృష్టమే..

2025: మిథునరాశి విద్యారంగంలో ఏ మేరకు రాణిస్తుంది?

2025లో వృషభరాశికి విద్యా జాతకం ఎలా వుంటుంది..?

2025 మేషరాశి వారికి విద్యావకాశాలు ఎలా వుంటాయంటే?

శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. వివరాలు

తర్వాతి కథనం
Show comments