Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏలినాటి శనిదోషాలను తొలగించడానికి రావిచెట్టును నాటితే?

జ్యోతిష్య శాస్త్రంలో వృక్షాలకు చాలా ప్రాధాన్యత ఉంది. ఒక్కో నక్షత్రం వారు ఒక్కొక్క చెట్టును నాటితే ఎటువంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయి. రావిచెట్టు నారాయణ స్వరూపం అని ప్రతీతి. మహానుభావులు, విద్యావంతులు, ఋష

Webdunia
గురువారం, 7 జూన్ 2018 (17:09 IST)
జ్యోతిష్య శాస్త్రంలో వృక్షాలకు చాలా ప్రాధాన్యత ఉంది. ఒక్కో నక్షత్రం వారు ఒక్కొక్క చెట్టును నాటితే ఎటువంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయి. రావిచెట్టు నారాయణ స్వరూపం అని ప్రతీతి. మహానుభావులు, విద్యావంతులు, ఋషులు, మహామునులు ఈ రావిచెట్టు క్రింద కూర్చొని తపస్సును చేసి వారు అనుకున్నది సాధించగలుగుతారు. వర్తమానం సాధువుల్లోనూ, పీఠాధిపతులు చేతుల్లో రావి పుల్ల ఉంటుంది. 
 
స్థిరబుద్ధిలేనివారు, శనిదోషంతో పీడించబడేవారు ఈ రావిచెట్టు చుట్టూ 11 సార్లు ప్రదక్షణ చేస్తే సర్వదా శుభం కలుగుతుంది. శ్రీకృష్ణుని చివరి దశలోకూడా ఈ రావి వృక్షం క్రిందే ప్రాణ త్యాగం చేశారు. అంతటి విశిష్టత కలిగిన ఈ చెట్టును ఆరాధించడం వల్ల అంతామంచే జరుగుతుంది.
 
వేపచెట్టు ఇది ఒక శక్తి స్వరూపం. ఈ వేప దివ్యౌషధ గుణములు కలిగిఉంటుంది. సంతానం, కుటుంబ సౌఖ్యం లేనివారు ఈ వేపచెట్టు చుట్టూ 19 సార్లు ప్రదక్షణ చేస్తే ఎటువంటి దోషాలు వున్నా తొలగిపోతాయి. సర్ప దోషాలతో బాధపడేవారు రావి, వేపచెట్టుకు ప్రదక్షణ చేస్తే ఎటువంటి ఆటంకాలు ఉన్నా తొలగిపోతాయి. వృక్షో రక్షతి రక్షితః అన్నట్లుగా ప్రతి నక్షత్రం వారు ఈ క్రింది చూపిన చెట్లను దేవాలయాల్లోకానీ, ఉద్యాన వనాల్లో కానీ, ఖాళీ స్థలాల్లో నాటి వాటి పురోభివృద్ధికి పాటుపడితే సర్వదా శుభం కలుగుతుంది. 
 
అశ్వని నక్షత్రం వారు జీడిమామిడి చెట్టు.
భరణి నక్షత్రం వారు దేవదారు చెట్టు.
కృత్తిక నక్షత్రం వారు అత్తి చెట్టు.
రోహిణి నక్షత్రం వారు నేరేడు చెట్టు.
మృగశిర నక్షత్రం వారు మారేడు చెట్టు.
ఆరుద్ర నక్షత్రం వారు చింత చెట్టు.
పునర్వసు నక్షత్రం వారు గన్నేరు చెట్టు.
పుష్యమి నక్షత్రం వారు పిప్పిలి చెట్టు.
ఆశ్లేష నక్షత్రం వారు బొప్పాయి చెట్టు.
మఖ నక్షత్రం వారు మర్రి చెట్టు.
పుబ్బ నక్షత్రం వారు మోదుగ చెట్టు.
ఉత్తర నక్షత్రం వారు జువ్వి చెట్టు.
హస్తా నక్షత్రం వారు కుంకుడు చెట్టు.
చిత్త నక్షత్రం వారు తాటి చెట్టు.
స్వాతి నక్షత్రం వారు మద్ది చెట్టు.
విశాఖ నక్షత్రం వారు మొగలి చెట్టు.
అనూరాధ నక్షత్రం వారు పొగడ చెట్టు.
జ్యేష్ట నక్షత్రం వారు కొబ్బరి చెట్టు.
మూల నక్షత్రం వారు వేగి చెట్టు.
పూర్వాషాడ నక్షత్రం వారు నిమ్మ చెట్టు.
ఉత్తరాషాఢ నక్షత్రం వారు పనస చెట్టు.
శ్రవణా నక్షత్రం వారు జిల్లేడు చెట్టు.
ధనిష్టా నక్షత్రం వారు జమ్మి చెట్టు.
శతభిష నక్షత్రం వారు అరటి చెట్టు.
పూర్వాభాద్ర నక్షత్రం వారు మామిడి చెట్టు.
ఉత్తరాభాద్ర నక్షత్రం వారు వేప చెట్టు.
రేవతి నక్షత్రం వారు విప్ప చెట్టును నాటిన శుభం కలుగుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

EVM లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, మీరు గెలిస్తే ట్యాంపరింగ్ కాదా అంటూ ప్రశ్న

ఒకే ఒక్క విద్యార్థిని... పాఠశాల యేడాది ఖర్చు రూ.12.48 లక్షలు (Video)

శని శింగ్నాపూర్‌లో శని భగవానుడి చుట్టూ పిల్లి ప్రదక్షిణలు (video)

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన : ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

జగన్‌ను జీవితాంతం జైల్లోనే ఉంచాలి : వైకాపా కార్యకర్త పచ్చిబూతులు (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

2025 మేషరాశి వారికి విద్యావకాశాలు ఎలా వుంటాయంటే?

శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. వివరాలు

25-11 - 2024 సోమవారం వారం ఫలితాలు - రుణ సమస్యలు పరార్

చెప్పులున్నవాడి వెనక అప్పులున్నవాడి వెనక అస్సలు తిరగొద్దు: గరకపాటి వారి ప్రవచనం

2025 మహాలక్ష్మి రాజయోగం.... ఈ రాశులకు కనకవర్షమే!

తర్వాతి కథనం
Show comments