Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాశి ఫలితాలు 19-06-2017... మితిమీరిన ఉత్సాహంతో సమస్యలు తప్పవు..

చిన్నతరహా వ్యాపారస్తులకు, భూమి, సంబంధించిన వ్యాపారస్తులకు కలిసిరాగలదు. స్త్రీలకు స్వీయ అర్జన పట్ల ఆసక్తి, ప్రోత్సాహం లభిస్తాయి. ఇతరులకు వాహనం ఇవ్వడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. విద్యార్థుల మితిమీర

Webdunia
ఆదివారం, 18 జూన్ 2017 (18:25 IST)
మేషం
ఇన్వెర్టర్, జనరేటర్, ఏసీ, మెకానికల్ రంగాలకు చెందినవారు ఆర్థికంగా ఒకడుగు ముందుకువేస్తారు. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికం. మీ సంకల్పసిద్ధికి నిరంతరం శ్రమ పట్టుదల చాలా ముఖ్యమని గమనించండి. వ్యాపారవర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలుదార్లను ఆకట్టుకుంటాయి. 
 
వృషభం
చిన్నతరహా వ్యాపారస్తులకు, భూమి, సంబంధించిన వ్యాపారస్తులకు కలిసిరాగలదు. స్త్రీలకు స్వీయ అర్జన పట్ల ఆసక్తి, ప్రోత్సాహం లభిస్తాయి. ఇతరులకు వాహనం ఇవ్వడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. విద్యార్థుల మితిమీరిన ఉత్సాహం వల్ల సమస్యలు తప్పవు. పూర్వానుభవంతో ముందుకు సాగుతారు. 
 
మిథునం
ఆర్థికంగా పురోభివృద్ధి కానవస్తుంది. కళాకారులకు, రచయితలు, అంతరిక్ష పరిశోధకుల నుంచి గుర్తింపు లభిస్తుంది. దంపతుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి. కొబ్బరి, పండ్ల, పానీయ వ్యాపారస్తులకు సంతృప్తి, అభివృద్ధి కానరాగలదు. ఆశయ సాధనే అత్యున్నత లక్ష్యంగా బాధ్యతగా భావించాలి. 
 
కర్కాటకం
విద్యార్థులకు టెక్నికల్, ఇంజనీరింగ్ కోర్సులలో ప్రవేశం లభిస్తుంది. ఖర్చులు, రావలసిన ధనం వసూలులో కించిత్ ఇబ్బంది తప్పదు. ఉద్యోగస్తులకు అధికారుల గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. గృహం ఏర్పరచుకోవాలనే కోరిక నెరవేరుతుంది. స్త్రీలకు ఆహ్వానాలు, వస్త్ర, వస్తులాభం వంటి శుభ ఫలితాలుంటాయి. 
 
సింహం
వ్యాపారాభివృద్ధికి నూతన ప్రణాళికలు అమలు చేస్తారు. పెద్దల ఆరోగ్యంలో తగు జాగ్రత్తలు అవసరం. రాబడికిమించిన ఖర్చులెదుర్కొంటారు. కొంతమంది మీ నుండి విషయాలు రాబట్టడానికి యత్నిస్తారు. ప్రభుత్వరంగ సంస్థలలోని వారికి అశాంతి, చికాకులు అధికం కాగలవు. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. 
 
కన్య
కొన్ని ఆర్థిక సమస్యల ఎదుర్కోవచ్చు. జాగ్రత్త వహించండి. బాగా నమ్మే వ్యక్తులే మిమ్మలను మోసం చేసే ఆస్కారం ఉంది. భాగస్వామిక చర్చల్లో మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. స్త్రీలు, ప్రముఖుల సిఫార్సులతో దైవదర్శనాలు త్వరగా ముగించుకుంటారు. విద్యార్థుల్లో నూతనోత్సాహం చోటుచేసుకుంటుంది. 
 
తుల
స్త్రీలు విదేశీ వస్తువులు సేకరిస్తారు. వాహనం నడుపుతున్నపుడు మెలకువ వహించండి. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల పట్ల ఆసక్తి పెరుగును. సోదరీ, సోదరుల మధ్య పరస్పర అవగాహనా లోపం. రాజకీయాల వారికి చికాకులు తప్పవు.  
 
వృశ్చికం
రాజకీయాల్లో వారికి ఆందోళన తప్పదు. శాస్త్ర, సాంకేతికత రంగాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది. రుణాలు పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తారు. ఖర్చులు అదుపు చేయాలన్న మీ యత్నం ఫలించదు. ప్రైవేటు ఉపాధ్యాయులకు ఒత్తిడిలు, చికాకులు తప్పవు. గృహోపకరణాలకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. 
 
ధనస్సు
ఆర్థిక, పెట్టుబడుల గురించి స్పష్టమైన నిర్ణయానికి వస్తారు. స్త్రీలకు నూతన వస్తు, వస్త్ర ప్రాప్తి కలుగుతుంది. డాక్టర్లకు నిరుత్సాహం కానవస్తుంది. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. దీర్ఘకాలం వాయిదా పడుతున్న పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు పని భారం అధికం. 
 
మకరం
బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్లు, ఫ్లీడరు గుమస్తాలకు ఊహించని చికాకులు ఎదురవుతాయి. కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల విషయంలో పునరాలోచన అవసరం. తీర్థయాత్రలు, నూతన ప్రదేశాల సందర్శనలు అనుకూలిస్తాయి. ధనం కంటే ఆత్మగౌరవానికే ప్రాధాన్యత ఇస్తారు. 
 
కుంభం 
ఆర్థిక వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా అధికమిస్తారు. వైద్యులు ఆపరేషన్లు చేయునపుడు మెళకువ అవసరం. నేడు చేద్దామన్న పనులు రేపటికి వాయిదా వేస్తారు. వ్యాపారాల్లో పోటీని తట్టుకోవడానికి బాగా శ్రమించాలి. స్త్రీలు ఉదరం, నడుం, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది. 
 
మీనం
ఇంటాబయట కొన్ని కొత్త సమస్యలను ఎదుర్కొన్నా నెమ్మదిగా సమసిపోతాయి. మధ్యవర్తిత్వం వహించడం వల్ల మాటపడవలసి వస్తుంది. విద్యార్థులు ఉల్లాసంగా గడుపుతారు. ఉభయులకు ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. పరిగెత్తించి లెక్చరర్‌పై దాడి.. (video)

అప్పుల బాధ.. తెలంగాణలో ఆటో డ్రైవర్ ఆత్మహత్య.. ఈఎంఐ కట్టలేక?

రేవంత్‌రెడ్డి హయాంలో ప్రజల శాపనార్థాలు తప్పట్లేదు.. కవిత ఫైర్

మేమేమైన కుందేళ్లమా? ముగ్గురు సంతానంపై రేణుకా చౌదర్ ఫైర్

నెలలో ఏడు రోజులు బయట తిండి తింటున్న హైదరాబాదీలు!

అన్నీ చూడండి

లేటెస్ట్

2025లో శనిగ్రహ మార్పు... ఈ ఐదు రాశులకు అంతా అనుకూలం..

కార్తీకమాసం: మాస శివరాత్రి.. సాయంత్రం కొబ్బరినూనెతో దీపం.. ఎందుకు?

కార్తీక శివరాత్రి.. రాళ్ల ఉప్పు శివలింగంపై వుంచితే?

29-11-2024 శుక్రవారం ఫలితాలు - సంకల్పబలంతోనే కార్యం సిద్ధిస్తుంది...

అదృష్టం ఈ రాశుల వారికే.. 2025 శుక్ర గ్రహ అనుకూలంతో..?

తర్వాతి కథనం
Show comments