Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంచాంగం.. 16 ఆగష్టు 2023: అమావాస్య.. బుధ దోషం వున్నవారు..?

Webdunia
బుధవారం, 16 ఆగస్టు 2023 (09:55 IST)
అధిక మాసం, ఆశ్లేష నక్షత్రం, బుధవారం కృష్ణ పక్షం అమావాస్య తిథి. ఈరోజు అధిక మాసం అమావాస్య. శ్రావణ శుక్ల పక్షం ప్రారంభమవుతుంది. అధిక మాసంలో ఉదయం స్నానం చేసిన తర్వాత దానం చేస్తే పుణ్యం లభిస్తుంది. ఈ రోజున పవిత్ర నదులలో స్నానమాచరించడం శుభ ఫలితాలను ఇస్తుంది. 
 
ఈ రోజు విష్ణువు, మహాదేవుని పూజతో పాపాలు నశించి మోక్షం లభిస్తుంది. పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి వారికి యాగాలు చేస్తారు. బ్రాహ్మణులకు వారి వారి శక్తికి తగ్గట్టుగా దానాలు చేస్తారు. దీంతో పూర్వీకులు సంతృప్తి చెంది ఆశీస్సులు అందజేస్తారు.
 
అలాగే బుధవారం ఆదిదేవుడు గణపతిని పూజించడం మంచి ఫలితాలను ఇస్తాయి. గణపతికి అరటిపండు, మోదకం, లడ్డూలను నైవేద్యంగా సమర్పించాలి. దీపం, ధూపం మొదలైన వాటిని పూజలో ఉపయోగిస్తారు. హారతికి నెయ్యి దీపం లేదా కర్పూరం ఉపయోగించండి. 
 
ఇంకా గణపతిని " ఓం గన్ గణపతయే నమః లేదా ఓం గణేశాయ నమః" అని జపించవచ్చు. గణేష్ చాలీసా, గణేష్ స్తోత్రం పఠించడం ద్వారా సర్వశుభాలు చేకూరుతాయి. ఈ రోజున, బుధ దోషం తొలగిపోవడానికి, ఉపవాసంతో పాటు బుధ బీజ మంత్రాన్ని జపించవచ్చునని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.  

సంబంధిత వార్తలు

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

16-05-2024 గురువారం దినఫలాలు - రాజకీయాలలోని వారికి మెళకువ అవసరం...

15-05-202 బుధవారం దినఫలాలు - డిపాజిట్ల సొమ్ము చేతికందుతుంది...

14-05-202 మంగళవారం దినఫలాలు - సంగీత సాహిత్య సదస్సులలో మంచి గుర్తింపు...

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

తర్వాతి కథనం
Show comments