ఆదివారాల్లో ఆచరించదగిన నియమనిబంధనలేంటి?

సాధారణంగా ఆదివారం ప్రతి ఒక్కరూ హాలిడే మూడ్‌లో ఉంటారు. అయితే, పంచాంగంలో ఆదివారం కూడా అనేక నియమనిబంధనలు పాటించవచ్చని బ్రహ్మణోత్తములు చెపుతున్నారు. ఆదివారం అనే పదం ఆదిత్యవారం నుండి పుట్టినదని సాహిత్య నిర

Webdunia
శనివారం, 9 జూన్ 2018 (12:22 IST)
సాధారణంగా ఆదివారం ప్రతి ఒక్కరూ హాలిడే మూడ్‌లో ఉంటారు. అయితే, పంచాంగంలో ఆదివారం కూడా అనేక నియమనిబంధనలు పాటించవచ్చని బ్రహ్మణోత్తములు చెపుతున్నారు. ఆదివారం అనే పదం ఆదిత్యవారం నుండి పుట్టినదని సాహిత్య నిరూపణము. సంస్కృతమున భానూవారంగా పిలువబడుతుంది. ఇంకా చెప్పాలంటే భారతదేశములోని కొన్ని ప్రాంతాలలో ఇది సూర్యదేవుని పేరుతో రవివార్ గా ఇప్పటికీ పిలుస్తున్నారు.
 
వారంలో మెుదటి రోజుగా పరిగణించే ఆదివారం నాడు పాటించవలసిన కొన్ని నియమనిబంధనలు పరిశీలిస్తే, ఆదివారం ఉదయాన్నే సూర్యస్తోత్రం పఠించడంతో పాటు స్నానమాచరించి సూర్య నమస్కారం చేయడం మంచిదని జ్యోతిష్కులు అంటున్నారు. సూర్యస్తోత్రం తరువాత ఆలయ దర్శనం గావించి ఎరుపు పువ్వులు స్వామికి సమర్పించడం ఉత్తమమని వారు పేర్కొంటున్నారు.
 
ఆదివారం రోజున స్త్రీలు తలలో మందారం వంటి ఎరుపు పువ్వులు ధరించడం సౌభాగ్య చిహ్నమని, అదేవిధంగా ఎరుపు రంగు దుస్తులు ధరించడం శ్రేష్టమని చెబుతున్నారు. భానువారమున సూర్యభగవానునికి గోధుమలు, నవధాన్యాలను నైవేద్యంగా సమర్పించినట్లైతే సకల సంపదలు దరిచేరుతాయి. గోధుమలతో తయారు చేసే వంటకాలు చపాతీ, పూరీ వగైరాలను ఆదివారం రోజున భుజిస్తే ఆరోగ్యదాయకమని శాస్త్రకర్తలు తెలియజేయుచున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శుద్ధి చేసిన యురేనియంను మాకు ఇస్తారా లేదా నాశనం చేస్తారా? ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్

Ebola : ఆఫ్రికాలో ఎబోలా-విజయవాడ ఎయిర్‌పోర్టులో పరీక్షా కేంద్రం

తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయిన మావో అగ్రనేత నరహరి

సొంత పార్టీ మంత్రి కందుల దుర్గేశ్‌కు ముచ్చెమటలు పోయించిన డిప్యూటీ సీఎం పవన్ (వీడియో)

వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్నప్పపై ఏసీబీ అక్రమాస్తుల కేసు- తిరుమల నెయ్యి కల్తీలోనూ..

అన్నీ చూడండి

లేటెస్ట్

Eid Al-Adha 2026 date: తెలుగు రాష్ట్రాల్లో మే 28, 2026 గురువారం బక్రీద్.. సెలవు దినం

26-05-2026 మంగళవారం ఫలితాలు - ధనసహాయం తగదు

25-05-2026 సోమవారం ఫలితాలు - ఖర్చులు అదుపులో ఉండవు.. ముఖ్యుల కలయిక వీలుపడదు...

24-05-2026 ఆదివారం ఫలితాలు - సంతోషకరమైన వార్త వింటారు

24-05-2026 నుంచి 30-05-2026 వరకు ఫలితాలు - రుణ ఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదు

తర్వాతి కథనం
Show comments